Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / మ‌హా మూర్తి ‘మాయ‌ వార్త‌ల‌’పై జ‌న‌సైన్యం ఫైర్‌.. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కి సిద్ధం..

మ‌హా మూర్తి ‘మాయ‌ వార్త‌ల‌’పై జ‌న‌సైన్యం ఫైర్‌.. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కి సిద్ధం..

అంద‌రి అభివృద్ది కోసం.. సామాజిక స‌మ‌తుల్య‌త కోసం పొరాటం చేసే జ‌న‌సేన పార్టీకి నా వంతు స‌హ‌కారం అంటూ పార్టీ న‌డిపేందుకు ప‌బ్లిగ్గానే విరాళాలు సేక‌రిస్తోంది.. జ‌న‌సేన పార్టీ. ఇందుకు సంబంధించి ఎలాంటి ర‌హ‌స్య‌మూ లేదు.. పార్టీకి వ‌చ్చిన విరాళాలు-పెట్టిన ఖ‌ర్చు మొత్తం అణా పైస‌ల‌తో స‌హా ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క కూడావుంటుంది.. ఇందులో ఎవ్వ‌రికీ ఎలాంటి సందేహ‌మూ లేదు.. విరాళాల స్వీక‌ర‌ణ ఎందుకంటే..? జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయ పార్టీ అయితే పెట్టారు గానీ., గ‌డ‌చిన నాలుగేళ్ల కాలంలో ఎక్క‌డా రాజ‌కీయాలు చేయ‌లేదు.. కేవ‌లం ఓ ప్ర‌జా నాయ‌కుడిగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం మాత్ర‌మే చేశారు.. చేస్తున్నారు.. గ‌తంలో సినిమాలు తీసే వారు కాబ‌ట్టి ఆ సంపాద‌న‌తో పార్టీని న‌డిపించారు.. త‌న వ‌ద్ద అక్ర‌మార్జ‌నా లేదు.. ప్ర‌జ‌ల సొమ్ముతో ఉచితంగా తిరిగేందుకు అధికార‌మూ లేదు.. దీంతో పార్టీని న‌డిపించేందుకు విరాళాలు త‌ప్ప‌లేదు.. అయితే పార్టీ కోసం రూపాయి విరాళం ఇచ్చిన వారికి కూడా జ‌న‌సేన జ‌వాబుదారీగా వుంటుంద‌ని ప‌వ‌న్ ఎప్పుడో ప్ర‌క‌టించారు కూడా..

విరాళాల‌పై బుర‌ద చ‌ల్లేందుకు మ‌హా ప్ర‌య‌త్నాలు..
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటూ జ‌నక్షేత్రంలో దూసుకుపోతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని చూస్తే ప‌చ్చ పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.. అదే స‌మ‌యంలో త‌మ మ‌హారాజ పోష‌కుల ప‌రిస్థితి చూసి ప‌చ్చ మీడియాకి సైతం నిద్ర ప‌ట్ట‌డం లేదు.. జ‌న‌సేనానిపై వ్య‌క్తిగ‌తంగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా., అవి కాస్తా బూమ్ రాంగ్ అవుతున్నాయి.. అవినీతి ఆరోప‌ణ‌లు చేసే ప‌రిస్థితా లేదు.. మ‌రి జ‌నంలో జ‌న‌సేనానిని ప‌లుచ‌న చెయ్యాలి.. అది ఎలా.. మ‌హా మాయ మూర్తి బుర్ర‌కి ప‌దును పెట్టి.. జ‌న‌సేన అధినేత క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టి.. ఓ చ‌చ్చుటెలుక‌ని ప‌ట్టేశారు.. ఆ ఎలుకే హోట‌ల్‌లో దొరికిన వీడియో.. వీడియోలో జ‌న‌సేన కోసం డొనేష‌న్లు స్వీక‌రిస్తున్నారు అన్న‌ది మ‌హా మూర్తి ఆరోప‌ణ‌.. దానికి చాలా దారుణ‌మైన కొటేష‌న్ నీతులు చెప్పే నేత‌ల భాగోతాలు అంటూ.. జ‌న‌సేన పార్టీ డొనేష‌న్లు సేక‌రిస్తున్న అంశంలో అస‌లు ర‌హ‌స్యం ఏముంది..? త‌న సొంత ఫేస్ బుక్ పేజీలోనే డొనేష‌న్లు కోరుతూ వీడియో సైతం పోస్టు చేసింది.. రాజ‌కీయం ప‌క్క‌దారి ప‌ట్ట‌డానికి జ‌న‌సేన అధినేత అధికార పార్టీ నేత‌ల్లా ఏమైనా కోట్ల‌కి కోట్లు స్కాములు చేశారా..? అన్న‌ది జ‌న‌సైనికుల ప్ర‌శ్న.. ఎలాంటి బ‌ల‌వంతం లేకుండా స్వ‌చ్చందంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకి వ‌చ్చే వారి ద‌గ్గ‌ర తీసుకుంటున్నారు.. ఇక్క‌డ భాగోతం ఏముంది..? ఏకంగా రాజ‌కీయం ప‌క్క‌దారి ప‌ట్ట‌డం ఏంటి..?

పార్టీలో అంత‌ర్గ‌త విబేధాలు రేపే ప్ర‌య‌త్నం..!
మ‌హా టీవీ సంచ‌ల‌నం అంటూ వేసిన క‌థ‌నంలో పైకి చెప్పేది ఒక‌టి అయితే.. అంత‌ర్లీనంగా జ‌న‌సేన పార్టీని దెబ్బ తీసేందుకు గ‌ట్టి వ్యూహాన్నే అమ‌ల్లో పెట్టింది.. ముఖ్యంగా ప‌చ్చి అబ‌ద్దాలు చెప్ప‌డంలో ఆరితేరిన మూర్తి బ‌లంగా నొక్కి నొక్కి మ‌రీ వినిపించిన మాట‌.. హోట‌ల్‌లో విరాళాలు సేక‌రిస్తున్న విష‌యాన్ని మ‌హా టీవీకి చెప్పిందే పార్టీలోని కీల‌క‌మైన వ్య‌క్తి అన్న‌ది.. ఈ మాట జ‌న‌సేన శ్రేణుల్ని ఉలిక్కి పాటుకి గురిచేయ‌డంతో పాటు పార్టీలోని వ్య‌క్తులు ఒక‌రి వైపు ఒక‌రు అనుమానంగా చూసుకునే ప‌రిస్థితిని క్రియేట్ చేద్దామ‌నుకున్నారు.. కానీ కొద్ది నిమిషాల్లోనే మ‌హా మూర్తి బంఢారం బ‌ట్ట‌బ‌య‌లైంది.. ఎవ‌రైతే ఆ ఛాన‌ల్ క‌ర‌స్పాండెంట్ వార్త‌కి సంబంధించి లైవ్‌లో అప్‌డేట్స్ ఇచ్చారో., అదే రిపోర్ట‌ర్ జ‌న‌సేన అధినేత చుట్టూ దొంగ‌త‌నంగా త‌చ్చాడుతున్న ఫోటోని జ‌న‌సైనికులు దొర‌క‌బ‌ట్టేశారు.. దీంతో ఈ వార్త వెనుక మ‌ర్మం బ‌ట్ట‌బ‌య‌లైంది..

కుల‌ముద్ర‌కి విఫ‌ల‌య‌త్నం…
మ‌హా మూర్తి మ‌హా మాయ‌ని జ‌నం క‌ళ్ల‌కి క‌ట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నాల్లో రెండోది.. జ‌న‌సేన‌పై కులం ముద్ర వేసే ప్ర‌య‌త్నం.. మ‌హా ప్ర‌సారం చేసిన వార్త‌లో రిపోర్ట‌ర్ స్ప‌ష్టంగా ఓ కులానికి జ‌న‌సేన‌ని అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నాలు చేశాడు.. అంతేకాదు మిగిలిన కులాల్ని జ‌న‌సేన‌కి దూరం చేసేందుకు కూడా మ‌హా స్టూడియో నుంచి య‌త్నాలు చేశారు.. విరాళాల కోసం మీటింగ్ పెట్టార‌ని తెలుసుకుని ఆధారాలు ఉన్నాయంటూ ఓ చిన్న క్లిప్‌తో హ‌డావిడి చేసిన మ‌హా మూర్తి.. జ‌న‌సేన అధినేత గానీ, పార్టీ నాయ‌కులు గానీ ఎక్క‌డైనా మా కులం అన్న మాట‌లు మాట్లాడినట్టు ఆధారాలు వుంటే ధైర్యంగా ప్ర‌సారం చేయాల‌న్న‌ది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ప్ర‌శ్న‌.. అందుకు సంబంధించిన ఆధారాలు లేకుండా అభాండాలు వేస్తే చూస్తూ ఊర‌కోమ‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.. డ‌బ్బు గురించి మాట్లాడుతున్న వీడియో వున్న‌ప్పుడు, ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు హాజ‌ర‌య్యారు అన‌డానికి మీ వ‌ద్ద వున్న ఆధారాలు ఏంటి..? రిపోర్ట‌ర్ చెబుతున్న కామెంట్లలో నిబ‌ద్ధ‌త ఎంత వుంది..? ఏవో అంత‌ర్గ‌త ప్ర‌యోజ‌నాల కోసం ఇలాంటి చౌక‌బారు ఆరోప‌ణ‌లు చేస్తే., జ‌నానికి అర్ధం కాద‌నుకోవ‌డం.. పిల్లి కళ్లు మూసుకుని పాలు త్రాగ‌డ‌మే..

పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన రాజ‌కీయాల‌కి కేంద్ర బింధువు అయిన జ‌న‌సేన‌, జ‌న‌సేనానిపై బుర‌ద చ‌ల్లాలంటే ప‌చ్చ బ్యాచ్‌కి ఈ జ‌న్మ చాల‌దు అంటున్నారు జ‌న‌సైనికులు.. అయినా మీ విఫ‌ల‌య‌త్నాలు మీరు కొన‌సాగిస్తేనే., పార్టీ అల‌ర్ట్‌గా వుంటుంది..

Advertisement.

Share This:

3,793 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × three =