Home / జన సేన / యువ‌జ‌న‌మే…సైన్యం..

యువ‌జ‌న‌మే…సైన్యం..

jana-sena-party-meeting-in-vizag-photos-107
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇజం నుంచి పుట్టిన జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుత బ‌లం ఎంత‌.. ఉన్న‌ప‌ళంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి వ‌స్తే పార్టీకి ఓట్లు రాల‌తాయా..? రాజ‌కీయ విమ‌ర్శ‌కుల నుంచి సాధార‌ణ ప్ర‌జానికం వ‌ర‌కు అంద‌రి మ‌దిలో ఉన్న క్వ‌శ్చ‌న్ ఇది.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని., అప్ప‌టి ప‌రిస్థితులను భ‌ట్టి టిడిపి, బీజేపీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చింది.. త‌న‌ది కాని పార్టీ కోసం ప‌వ‌ర్‌స్టార్ ఓ నాలుగు స‌భ‌ల‌కి వ‌స్తే., 13 శాతం ఓట్లు రాలాయి.. ఫ‌లితం తారుమారైంది.. ప‌వ‌న్ రాకకి ముందు మెజార్టీ శాతం మీడియా ఇచ్చిన స‌ర్వేల‌న్నీ వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కి 5 నుంచి 8 శాతం మెజార్టీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేశాయి.. జ‌న‌సేనాని ఎంట్రీతో సీన్ మారిపోయింది.. అది అధికార‌, విప‌క్షాలు రెండూ ఒప్పుకున్న విష‌య‌మే.. ఈ ఓట్ల‌లో మెజార్టీ శాతం ఓట్లు యువ‌జ‌నం నుంచి రాలిన‌వే.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ప్ర‌ధాన ఫాలోవ‌ర్స్‌గా ఉన్న ఏజ్ గ్రూప్ 14 నుంచి 40 సంవ‌త్స‌రాల లోపు వారే.. అందులో గ‌త ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కురాని వారికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఓటు హ‌క్కు వ‌చ్చేస్తుంది.. వీరి సంఖ్య ఓ 10 నుంచి 15 శాతం ఉంటుంది.. ఆ లెక్క‌న వేసుకున్నా., జ‌న‌సేనాని పూర్తి స్థాయి క‌థ‌న‌రంగంలోకి దిగ‌కుండానే 30 శాతం ఓట్లు ఆయ‌న ఖాతాలో ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా.. జ‌న‌సేనాని పూర్తి స్థాయిలో రాజ‌కీయ ర‌ణానికి దిగితే., కుల‌,మ‌త‌, ప్రాంతీయాభిమానాల‌కు అతీతంగా యువ‌జ‌నంలో ఉన్న ప‌వ‌నిజం(ప‌వ‌న్ అభిమానం) మ‌రో 20 శాతానికి పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.. ఇదే జ‌న‌సేన స‌త్తా..

Share This:

803 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + eight =