Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / యూనివ‌ర్శిటీలా.. పొలిటిక‌ల్ పార్టీల యుద్ధ‌భూములా-రోహిత్ వేముల‌ ఇష్యూపై పవ‌ర్ పంచ్‌..

యూనివ‌ర్శిటీలా.. పొలిటిక‌ల్ పార్టీల యుద్ధ‌భూములా-రోహిత్ వేముల‌ ఇష్యూపై పవ‌ర్ పంచ్‌..

capture22 capture33

ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీపై ప‌వ‌ర్ పంజా విసిరిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., రెండో రోజు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌., ఆ అంశం చుట్టూ న‌డిచిన పొలిటిక‌ల్ డ్రామాల‌పై త‌న ఆస్త్రాన్ని ఎక్కుపెట్టారు.. పాయింట్ టూ పాయింట్ రోహిత్ విష‌యంలో చోటు చేసుకున్న ప్ర‌తి అంశాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.. క‌మ‌ల‌నాధుల త‌ప్పుల‌ను ఎత్తిచూపారు.. దేశంలో ఉన్న కొన్ని ల‌క్ష‌ల మందిలాగే రోహిత్ వేముల‌కి కూడా బీజేపీ అంటే ఇష్టం లేదు.. అంత‌మాత్రాన అత‌న్ని టార్గెట్ చేయాలా అని జ‌న‌సేనాని ప్ర‌శ్నించారు.. రోహిత్ త‌న వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగానే తెలిపాడు.. అయితే కాషాయీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించే క్ర‌మంలో తొంద‌ర‌ప‌డి ఓ మాట జారాడు.. దీన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంది.. యూనివ‌ర్శిటీ నుంచి గెంటేసింది.. అదే రోహిత్‌ను ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పింద‌ని జ‌న‌సేన‌ని అభిప్ర‌యాప‌డ్డారు..

capture44 capture55

రోహిత్ నిజంగానే తొంద‌ర‌ప‌డ్డాడు.. మ‌రి కేంద్రం ఏం చేసింది..? రోహిత్ ఆలోచ‌నా విధానాన్ని., ఓ విద్యార్ధి ఆలోచ‌నా విధానంగా ప‌రిగ‌ణించి ఉంటే., అత‌నికి స‌రైన స‌మ‌యంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఉన్న‌ట్ట‌యితే., దేశం ఓ త‌త్వ‌మేధావిని కోల్పోయి ఉండేది కాదని జ‌న‌సేనాని అన్నారు.. రోహిత్ వ్య‌వ‌హారంలో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని భావించి ఉంటే చ‌ర్య‌లు తీసుకునే అధికారం సంబంధిత వ‌ర్గాలు చ‌ర్య‌లు తీసుకునేవ‌న్నారు.. స‌మాజంలో పేరుకుపోయిన అస‌మాన‌త‌లు రోహిత్ వేముల ఆలోచ‌నా విధానాన్ని ప్ర‌భ‌వితం చేశాయ‌న్నారు.. చివ‌ర్లో సొంత‌వ‌ర్గాల మ‌ద్ద‌తు కూడా అత‌నికి ల‌భించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు..

capture66 capture77

రోహిత్ ఆత్మ‌హ‌త్య‌ను బీజేపీయేత‌ర పార్టీలు పొలిటిక‌ల్ మైలేజీ కోసం వాడుకుంటే., బీజేపీ రోహిత్ అస‌లు ద‌ళితుడే కాద‌ని చిత్రించేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేసింది.. ఇక్క‌డ ఎవ‌రి రాజ‌కీయ అవ‌స‌రాలు వారు తీర్చుకున్నారే త‌ప్ప‌., ఏ ఒక్క‌రూ కూడా రోహిత్ లాంటి ఘ‌ట‌న‌లు పురావృతం కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆలోచ‌న చేయ‌లేద‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.. అదే త‌న‌ను తీవ్రంగా బాధించింద‌న్నారు..

capture88

ఆ బాధ‌తోనే చెబుతున్నాన‌న్న ఆయ‌న ఎప్ప‌టికైనా ఓ మార్పు వ‌స్తుంద‌ని ఎదురుచూస్తున్నాన‌ని., యూనివ‌ర్శిటీలు విద్య‌ను నేర్పే గ్రంథాల‌యాలుగా మారాలే త‌ప్ప‌., పొలిటిక‌ల్ పార్టీలు కాలుదువ్వుకునే క‌థ‌న‌రంగాలు కారాద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేశారు..

 

Share This:

1,442 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − nine =