Home / జన సేన / యూ ట‌ర్న్ బాబుగారి నాలుక మ‌డ‌త బాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన జ‌న‌సేనాని..

యూ ట‌ర్న్ బాబుగారి నాలుక మ‌డ‌త బాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన జ‌న‌సేనాని..

యుద్ధంలో గెల‌వ‌డం అంటే శ‌త్రువుని చంప‌డం కాదు.. కేవ‌లం ఓడించ‌డం.. ఓడించే విధానంలో కూడా ఎవ‌రి ప‌ద్ద‌తులు వారికుంటాయి.. జ‌న‌సేన పార్టీకి కూడా ఓ విధానం ఉంది.. ప్ర‌తి విష‌యాన్ని చాలా స్ప‌ష్టంగా, సామాన్యుడికి కూడా అర్ధ‌మ‌య్యే విధంగా చెప్ప‌డం.. మిగిలిన పార్టీల మాదిరి పార్టీలు, వ్య‌క్తుల మీద కాకుండా కేవ‌లం విధానాల మీద‌, అదీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల మీద యుద్ధం చేయ‌డం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశంలో కూడా అదే సూత్రాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫాలో అవుతున్నారు..

ప్ర‌త్యేక హోదా-ఆంధ్రుల హ‌క్కు నినాదంతో ముందుకి క‌దిలిన జ‌న‌సేనాని, కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో క‌ద‌లిక తెచ్చారు.. ప్యాకేజీ ప్ర‌క‌ట‌న నుంచి అధికార‌-విప‌క్షాల అవిశ్వాస డ్రామా వ‌ర‌కు ముందుకి ప‌డిన ప్ర‌తి అడుగు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సాధించిన విజ‌య‌మే.. హోదా కోసం ఆంధ్రుల త‌రుపున గ‌ర్జించిందీ అయానే, ప్యాకేజీ పాచిపోయిన ల‌డ్డూల‌ని తిప్పికొట్టిందీ ఆయ‌నే, అవిశ్వాసం పెట్ట‌మ‌ని సూచ‌న ఇచ్చిందీ ఆయ‌నేన‌న్న‌ది నిర్వివాదాంశం..

అవిశ్వాసంపై చ‌ర్చ సాగిన తీరు ఆంధ్రుల‌కి ఉప‌యోగ‌ప‌డే రీతిలో సాగ‌లేద‌న్న‌ది టీవీ సెట్ల‌లో పార్ల‌మెంటు స‌మావేశాలు చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మైపోతుంది.. ముఖ్యంగా టీడీపీ ఎంపిలు మాట్లాడిన తీరు గ‌ల్లా జ‌య‌దేవ్., పార్ల‌మెంటులో కీల‌క అంశం మాట్లాడే అవ‌కాశం వ‌స్తే., దాన్ని కాస్త బావ‌మ‌ర్ధి సినిమా ప్ర‌మోష‌న్‌కి ఉప‌యోగించ‌డం ఏంట‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.. మూడున్న‌రేళ్లుగా చేసిందంతా చేసి ఇప్పుడు, కంటితుడుపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టిన టీడీపీ గుట్టుని జ‌న‌సేన అధినేత కూడా ఉద‌యం నుంచి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఉతికారేస్తూనే ఉన్నారు..

ఆయ‌న గుర్తించిన మ‌రో అంశం టీడీపీ-బీజేపీ మైత్రీబంధం తెర‌వెనుక ఇంకా కొన‌సాగుతూనే ఉన్నంద‌ని.. హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ మాట‌లు “ ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే అంటం “ చూస్తుంటే.. ఇద్ద‌రు క‌ల‌సి ఏపీ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ఆడుకుంటున్నార‌నిపిస్తోంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు..

యూ ట‌ర్న్ బాబు చిట్టా విప్పిన ప‌వ‌న్‌..

ఇక రాష్ట్ర విభ‌జ‌న నుంచి శుక్ర‌వారం జ‌రిగిన అవిశ్వాసంపై చ‌ర్చ వ‌ర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాలుక మ‌డిచి మాట్లాడిన మాట‌ల్ని తేదీల‌తో స‌హా వివ‌రిస్తూ జ‌న‌సేనాని విడుద‌ల చేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ రాజ్య‌స‌భ‌లో ఐదేళ్ల ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌డం., వెంక‌య్య‌నాయుడు ఐదేళ్లు చాల‌దు, ప‌దేళ్లు కావాల‌ని డిమాండ్ చేయ‌డం, మోదీ మ‌ద్ద‌తు ప‌లికిన అంశాల‌ను జ‌న‌సేన అధినేత విడుద‌ల చేసిన చిట్టాలో చేర్చారు.. ఇక చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక‌.. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో హోదా ఇవ్వ‌డం కుద‌ర‌దు అన్న‌ప్పుడు దాన్ని స్వాగ‌తించిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు..

ఇక తేదీల వారిగా చూస్తే.. 2016 మే 18వ తేదీన హోదాతో ఏం వ‌స్తుంది..? హోదా ఇచ్చి నిధులు ఇవ్వ‌క‌పోతే ఎలా అన్న మాట ద‌గ్గ‌ర నుంచి ., ప్యాకేజీ ప్ర‌క‌టించిన నాడు ., హోదా సంజీవ‌నా అని ప్ర‌శ్నించిన అంశం వ‌ర‌కు.. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాలి అంటూ మ‌ళ్లీ హోదా కోసం త‌న ఎంపిల‌తో అవిశ్వాసం ఆట ఆడిస్తున్న వ‌ర‌కు బాబు గారు మార్చిన ప్ర‌తి మాట‌ని తేదీల వారీగా ఓ చోట పొందు ప‌రిచి జ‌నం ముందు ఉంచారు.. జ‌న‌సేన అధినేత విడుద‌ల చేసిన బాబుగారి నాలుక మ‌డ‌త చిట్టా ఇప్పుడు టీడీపీకి త‌ల‌బొప్పి క‌ట్టిస్తుంటే.,
అమ్మ చంద్ర‌బాబో, ఇన్ని మాట‌లు ఆ ఒక్క నోటితోనే మార్చి మ‌మ్మ‌ల్ని మోసం చేశావా అంటూ జ‌నం నోరెళ్ల బెడుతున్నారు.. బాబోరూ రేప‌టి నుంచి బ‌య‌టికి మీ ముఖాన్ని చూపెట్ట‌గ‌ల‌రా..? అంటే అన్ని మాట‌లు మార్చిన‌ప్పుడు లేంది.. ఇవాళ ఏమైందిలే అని ప‌చ్చ బ్యాచ్ స‌ర్ధిచెప్పుకుంటున్నారు..

 

Share This:

2,313 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × five =