Home / సేన సేవ / రంప ఏజెన్సీలో జ‌న‌సైన్యం మెగా మెడిక‌ల్ క్యాంప్‌.. గిరిజ‌నులకి ఉచిత వైద్యం..

రంప ఏజెన్సీలో జ‌న‌సైన్యం మెగా మెడిక‌ల్ క్యాంప్‌.. గిరిజ‌నులకి ఉచిత వైద్యం..

img-20170122-wa0133 img-20170122-wa0134

జ‌న‌సేన‌కు సేవే మార్గం.. అదే పార్టీ నినాదం.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ సేవాగుణం నుంచి స్ఫూర్తిని పొందిన ఆయ‌న సైన్యం.. అవ‌కాశం ఉన్న‌చోట‌ల్లా నిత్యం సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ తోటివారికి తోడ్ప‌వోయ్ అన్న సూక్తిని ఫాలో అయిపోతున్నారు.. తాజాగా రాజ‌మండ్రికి చెందిన జ‌న‌సైనికురాలు ఘంటా స్వ‌రూప‌., జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతం రంప‌చోడ‌వ‌రంలో గిరిపుత్రుల కోసం ఓ మెగా వైద్య శిభిరాన్ని నిర్వ‌హించారు.. గ‌తంలో ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించి., అక్క‌డ గిరిజ‌నుల దుస్థితిని గ‌మ‌నించిన ఈ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌., ప్ర‌జ‌లు ఏఏ రోగాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.. వారికి కావాల్సిన మందులు ఏంటి తెలుసుకుని., ఉచిత క్యాంప్ నిర్వ‌హించారు..

img-20170123-wa0005 img-20170123-wa0007

త‌న స్నేహితులు, డాక్ట‌ర్ల బృందంతో క‌ల‌సి ఉద‌యాన్నే రంప‌చోడ‌వ‌రం చేరుకున్న స్వ‌రూప నేతృత్వంలోని జ‌న‌సైన్యం., జ్వ‌రం, విరేచ‌నాలు, వైర‌ల్ డిసీజెస్‌కి సంబంధించి రోగుల‌ని ఎంపిక చేసి., వారికి ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు మందులు, బిస్క‌ట్లు, ఓఆర్ ఎస్ లిక్విడ్స్ పంప‌ణీ చేశారు.. సుమారు 223 మంది గిరిజ‌నులు ఈ వైద్యసేవ‌ల్ని వినియోగించుకున్నారు..

img-20170122-wa0132

జ‌న‌సేన పార్టీ త‌రుపున ఏర్పాటు చేసిన ఈ మెగా వైద్య‌శిభిరం విజ‌య‌వంతం అయ్యేందుకు., కాకినాడ‌కు చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త కుంప‌ట్ల విజ‌య్‌గోపాల్‌., రాజ‌మండ్రికి చెందిన తోట‌ప్ర‌సాద్‌, చంద్ర‌బోస్‌, జ‌నార్ధ‌న్‌, పిఠాపురంకి చెందిన కొమ్మినీడి రాజేంద్ర‌, చిట్టి, అరుణ్ త‌దిత‌రులు గంటా స్వ‌రూప‌కి స‌హ‌క‌రించారు.. రంప‌చోడ‌వ‌రంకి చెందిన జ‌న‌సేన పార్టీ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కాకి స్వామి స్థానికంగా క్యాంప్ నిర్వ‌హ‌ణ‌కి ఏర్పాట్లు చేసి స‌హ‌క‌రించారు.. ఓ మంచి ఉద్దేశంతో గిరిపుత్రుల కోసం జ‌న‌సైన్యం నిర్వ‌హించిన ఈ మెడిక‌ల్ క్యాంప్ విజ‌య‌వంతంగా ముగిసింది..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యమే గిరిజ‌నుల ఉసురు తీసింది.. లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ఫైర్‌..

గోదావ‌రి లాంచీ ప్ర‌మాద ఘ‌ట‌న గుండె బ‌రువెక్కించింది.. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి గురిజ‌నులు బ‌లికావాలా.. దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేస్తే స‌రా..? …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 14 =

%d bloggers like this: