Home / జన సేన / రాజీనామా చేసి రండి.. జోన్ సాదిద్ధాం.. సిఎం,జ‌గ‌న్‌ల‌కు జ‌న‌సేనుడి బ‌హిరంగ స‌వాల్‌..

రాజీనామా చేసి రండి.. జోన్ సాదిద్ధాం.. సిఎం,జ‌గ‌న్‌ల‌కు జ‌న‌సేనుడి బ‌హిరంగ స‌వాల్‌..

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌ట్ల‌.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డం ప‌ట్ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న‌కున్న నిబ‌ద్ద‌త ఏంటో మ‌రోసారి నిరూపించుకున్నారు.. ఇక ముఖ్య‌మంత్రి-ప్ర‌తిప‌క్ష నేతలు తమ నిబ‌ద్ద‌త‌ని నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితులు క‌ల్పిస్తూ ప్ర‌జా కోర్టులో స‌వాలు విసిరారు.. విశాఖ రైల్వే జోన్ కోసం చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి వ‌స్తే., ఆయ‌న‌తో క‌లిసి ఇదే విశాఖ‌లో రైళ్ల‌ను స్థంభింప‌చేస్తాన‌ని., జోన్ ఎలా రాదో చూద్దామంటూ జ‌న‌సేనుడు పిలుపునిచ్చారు.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా ఈ పోరాటంలో క‌లిసి రావాలంటూ స‌వాలు విసిరారు.. ముగ్గురం క‌లిసే కేంద్రంపై పోరాటం చేద్దామ‌న్నారు.. సిఎం-జ‌గ‌న్‌ల‌కి తాను విసురుతున్న ఓపెన్ ఛాలెంజ్ అని జ‌న‌సేన అధినేత తొడ‌కొట్టారు.. కేంద్రంపై ఫైట్‌కి మీరు స‌య్యా అంటూ ప్ర‌శ్నించారు.. పోరాట‌యాత్ర‌లో భాగంగా త‌గ‌ర‌పువ‌ల‌స‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్ ఈ స‌వాలుని విసిరారు..

విశాఖ రైల్వే జోన్‌పై అస‌లు మీ వైఖ‌రి ఏంటో బ‌హిర్గ‌త‌ప‌ర్చాలంటూ ముఖ్య‌మంత్రి-టీడీపీ నేత‌ల‌ని కోరిన జ‌న‌సేనాని., నా వైఖ‌రి సుస్ప‌ష్టం.. మీ వైఖ‌రి-చిత్త‌శుద్ది ఏంటో ఈ మ‌ధ్య‌నే ఓ వీడియో వ‌చ్చింది.. అంటూ ఎంపిల 5 కేజీల చ‌ర్చ విష‌యాన్ని గుర్తు చేశారు.. జ‌నం అంటే మీకు అంత చిన్నచూపా అంటూ నిల‌దీశారు.. వారు చేసే దీక్ష‌ల‌న్ని, డ్రామాల్ని జ‌నం న‌మ్మాలా..? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌., రాజీనామా చేసి వ‌స్తే అంతా క‌ల‌సి రైల్‌లైన్ ఎక్కి పోరాటం చేద్దాం ర‌మ్మ‌న్నారు.. నాకు కేసులు భ‌యాలు లేవు.. నా క్యాడ‌ర్‌ని పంపి, నేను వెనుక ఉండ‌ను.. మొద‌టి అడుగు నేనే వేస్తాన‌ని చెప్పారు.. ఢిల్లీ సిఎం దీక్ష చేస్తే ప‌లుక‌రించి వ‌చ్చే మ‌న సిఎం., విశాఖ కోసం పోరాటం చేసేందుకు కూడా రావాల‌ని పిలుపునిచ్చారు.. త‌న‌ను కాంగ్రెస్‌ని తిట్ట‌డం లేదంటున్నారు.. కాంగ్రెస్ హ‌ఠావో.. దేశ్ బ‌చావో నినాదం నాదే.. పంచెలూడ‌దీసి కొడ‌దామ‌న్న‌దీ నేనేఉ.. మీకు అంత ధైర్యం ఉందా అంటూ ప‌చ్చ బ్యాచ్ ప్ర‌శ్నించారు..

ప్ర‌త్యేక హోదాపై నా వైఖ‌రి మొద‌టి నుంచి ఒక్క‌టే చెబుతూ వ‌స్తున్నాన‌న్న ప‌వ‌న్‌., అర్ధ‌రాత్రి మీటింగ్ పెట్టి ప్యాకేజ్ అంటే.. అవి పాచిపోయిన ల‌డ్డూల‌న్నాను.. కానీ మాక‌వే కావాల‌ని టీడీపీ తీసుకుంద‌ని ఎద్దేవా చేశారు.. ఇప్పుడు మాట‌లు మార్చి దీక్ష‌లంటున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు.. కేంద్రాన్ని-ప్ర‌ధానిని ఎదిరించే ధైర్యం నాకు ఉంది.. ముఖ్య‌మంత్రికి ఉందా అంటూ నిల‌దీశారు.. తాను స్వ‌యంగా చూశాన‌ని సిఎంకి ప్ర‌ధాని మోడీ అంటే భ‌య‌మ‌ని చెప్పారు.. కాపు రిజ‌ర్వేష‌న్ పై నా వైఖ‌రి అడుగుతున్న మీరు., మీ ఎంపిల‌ను పార్ల‌మెంట్‌లో ఇదే అంశంపైనా, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పైనా మాట్లాడ‌మ‌న‌మంటూ స‌వాల్ చేశారు.. ఇప్పుడు నా వైఖ‌రి ఏంటో చెబుతాన‌ని చెప్పారు.. ఒక స‌మ‌స్య తీర్చ‌మంటే ముఖ్య‌మంత్రి ఇంకో స‌మ‌స్యను నెత్తిన రుద్దుతార‌ని ఆరోపించారు..

ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం గురించి మాట్లాడిన జ‌న‌సేనాని., దేశంలోనే అత్య‌ధికంగా ఈ పాల‌కులు ఎస్సీ, ఎస్టీల‌పై అత్యాచారాలు చేస్తున్నార‌ని ఆరోపించారు.. ద‌ళితుల భూములు లాక్కొంటున్నార‌న్న ఆయ‌న‌., ముద‌పాక వ్య‌వ‌హారాన్ని ఉద‌హ‌రించారు.. అర‌కులో గిరిపుత్రుల భూములు లాక్కొంటూ చ‌ట్టాల్ని నిర్వీర్యం చేస్తున్నార‌న్నారు. డ్రెడ్జింగ్ కార్పోరేష‌న్ విష‌యం ఏంట‌ని నిల‌దీశారు.. చిట్టి వ‌ల‌స జూట్ మీల్లుపై టీడీపీ వైఖ‌రి ఏంటి..? ఆరు వేల కుటుంబాలు రోడ్డున ప‌డినా గంటా ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్న‌ల‌పై ప్ర‌శ్న‌లు గుప్పించారు.. 2014లో పోటీ చేసి ఉంటే భీమిలి జ‌న‌సేన ఖాతాలోకే వ‌చ్చేద‌న్న ప‌వ‌న్‌., సీటుని దానం చేస్తే ఇక్క‌డ ఎమ్మెల్యే భూ దోపిడి సాగిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.. మ‌త్స్య‌కారుల‌కి క‌నీసం జెట్టీలు నిర్మించ‌ర‌న్న జ‌న‌సేనాని, గంటా, హ‌రిబాబుల బోట్‌ల‌కి మాత్రం ఆ ఇబ్బంది ఉండ‌దంటూ ఎద్దేవా చేశారు..

ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు, అక్క‌డ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడిన జ‌న‌సేన అధినేత‌., టీడీపీ నేత‌ల వైఖ‌రి ప‌ట్ల కాస్త ఘాటుగానే స్పందించారు.. ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్టాలు ఏంటో త‌న‌తో వ‌స్తే., ముఖ్య‌మంత్రి-వార‌బ్బాయిల‌కు చూపిస్తాన‌న్నారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లతో పాల‌కుల్ని ఉక్కిరిభిక్కిరి చేసిన జ‌న‌సేనాని., జోన్‌పై విసిరిన స‌వాలుతో సిఎం-జ‌గ‌న్‌లని ఉక్కిరిబిక్కిరి చేశారు..

Share This:

2,299 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 15 =