Home / పవన్ టుడే / రాజ‌కీయ మేధావుల‌ని ఆక‌ర్షిస్తున్న జ‌న‌సేనాని.. JFCకి పెరుగుతున్న మ‌ద్ద‌తు..

రాజ‌కీయ మేధావుల‌ని ఆక‌ర్షిస్తున్న జ‌న‌సేనాని.. JFCకి పెరుగుతున్న మ‌ద్ద‌తు..

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పూర్తి స్థాయి రాజ‌కీయాలు మొద‌లుపెడితే ఎలా ఉంటుంది..? ప‌్ర‌జ‌ల కోసం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తే ఏం జ‌రుగుతుంది..? ఇన్నాళ్లు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన నోళ్లు ., ఆశ్చ‌ర్యంతో తెరుచుకునే ఉండేలా ఉంటుందా..? జ‌న‌సేనుడి రాజ‌కీయ చ‌తుర‌త చాణ‌క్యుడిని త‌ల‌పిస్తోంది.. ఆయ‌న వేసే అడుగులు ప్ర‌త్య‌ర్ధుల‌కి మ‌తిపోగోడుతున్నాయి.. జ‌న‌సేన‌కి నాయ‌కులు లేరు.. కేడ‌ర్ లేదు.. బూత్ స్థాయి క‌మిటీలు లేవు.. 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎలా పోటీ చేస్తుందంటూ వెక్కిరించిన‌ వారికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌వ‌ర్ పంచ్‌ల‌తో త‌ల‌బొప్పిక‌ట్టిస్తున్నారు.. జ‌న‌సేన‌కి నాయ‌కులు లేరు.. కేడ‌ర్ లేదు.. బూత్ స్థాయి క‌మిటీలు లేవు.. కానీ జ‌న‌సేనుడు ఉన్నాడు.. అని పించే స్థాయిలో ప‌వ‌న్ దూసుకుపోతున్నారు.. ముఖ్యంగా కోట్లాదిగా ఉన్న త‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌ల ఓట్ల‌కి తోడు., త‌ట‌స్థ ఓట‌ర్ల‌ని ఆలోచింప చేస్తున్నారు.. త‌న వైపుకి తిప్పుకుంటున్నారు.. ఇది ప్ర‌త్య‌ర్థి శిభిరాల‌ను ఆందోళ‌న రేపుతోంది..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టంలో హామీల అమ‌లుకి సంబంధించి రెండేళ్లుగా పోరాటం చేస్తున్న జ‌న‌సేన అధినేత‌., తాను మ‌ద్ద‌తిచ్చిన పాల‌క‌ప‌క్షాలు ప్ర‌జ‌ల‌కి, రాష్ట్రానికి న్యాయం చేస్తాయ‌న్న న‌మ్మకంతో చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.. ఇక నిరంత‌ర రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన అనంత‌రం., ఓ వైపు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూనే., మ‌రోవైపు విభ‌జ‌న హామీల‌కి సంబంధించి కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల భిన్న‌వాద‌న‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.. నిజానిజాలు ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు.. అందుకోసం JFC జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ.. ఐక్య నిజ‌నిర్ధార‌ణ క‌మిటీకి రూప‌క‌ల్ప‌న చేశారు.. రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్ధిక రంగ నిపుణుల‌తో కూడిన ఈ క‌మిటీ ఆలోచ‌నా ప‌రుల్నే కాదు., తెలుగు ప్ర‌జ‌ల మొత్తాన్ని త‌న‌వైపుకి తిప్పుకున్నారు..

ఇప్ప‌డు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్న మోధావులు సైతం జ‌న‌సేనాని JFCకి సంఘీభావం తెలుపుతుండ‌డంతో., ఆయ‌న వేసిన అడుగుల స‌త్తా అర్ధం అవుతోంది.. JFCకి సంబంధించి నిర్మాణం ప‌నుల్లో జ‌న‌సేన అధినేత బిజీగా ఉండ‌గానే., క‌మిటీకి సంఘీభావం తెలిపుతూ అందులో భాగ‌స్వాముల‌య్యే వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో స‌మైక్యాంధ్ర కోసం పోరాడిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు చ‌ల‌సాని శ్రీనివాస‌రావు., జ‌న‌సేన కార్యాల‌యానికి వ‌చ్చి JFCకి సంఘీభావం తెలిపారు.. శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న JFC తొలి స‌మావేశానికి త‌న స‌మితి ప్ర‌తినిధుల‌తో క‌ల‌సి హాజ‌రయ్యేందుకు ముందుకి వ‌చ్చారు.. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు, ఎంత వ‌చ్చింది.. ఖ‌ర్చ‌య్యింది.. ఇంకా ఎంత రావాలి అన్న వ్య‌వ‌హారంలో నిజానిజాలు తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. జ‌న‌సేనానితో కొంత‌సేపు చ‌ల‌సాని ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం గ‌మ‌నార్హం..

ఇక అనంతపురం జిల్లా లాంటి క‌రువు ప్రాంతాల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత మొద‌లు పెట్టిన పోరాటానికి కూడా మ‌ద్ద‌తు పెరుగుతోంది.. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కార్య‌నిర్వాహ‌క స‌భ్యుడు, స్వ‌రాజ్ అభియాన్ నేత యోగేంద‌ర్ యాద‌వ్ జ‌న‌సేనానిని క‌లిశారు.. ఇటీవ‌ల తాను అనంత జిల్లాలో జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప‌వ‌న్‌కి వివ‌రించారు.. ఏపీ పేరు చెబితే ప‌చ్చ‌టి పంట‌లు, జీవ‌న‌దుల క‌ళ‌క‌ళ అని భావించిన తాను., అనంతపురం జిల్లాను చూసిన త‌ర్వాత చ‌లించిన‌ట్టు తెలిపారు.. అనంత‌కు బుందేల్ ఖండ్‌కి పెద్ద‌గా తేడా లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు..

గురువారం జ‌న‌సేన అధినేత‌ని క‌ల‌సిన ప్ర‌ముఖుల్ని చూస్తే., ఆయ‌న చేస్తున్న రాజ‌కీయం ఏంటో ఇట్టే అర్ధం అవుతుంది.. రాజ‌కీయం అంటే కేవ‌లం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార సాధ‌నం.. రాజ‌కీయం అంటే అధికారం, ప‌ద‌వులు కాదు.. అన్న విష‌యాన్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ప్ర‌తి చేత‌లో తెలియ‌జెప్పుతున్నారు.. అందుకే ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచే ప్ర‌తి ఒక్క‌రు జ‌న‌సేన గ్యారేజ్‌లో విడిదికి విచ్చేస్తున్నారు..

Share This:

7,299 views

About Syamkumar Lebaka

Check Also

అహం బ్రహ్మాస్మి..! (పిట్టల దొరలు అంతే..! పిట్టల దొరలు అంతే..!) అంతేగా..అంతేగా..అంతేగా..

“సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం మా భువనేశ్వరితోనే ప్రారంభం అయ్యింది” అంటూ బాబోరు ఉద్ఘాటించారు. అది విన్న ప‌చ్చ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + three =