Home / జన సేన / రాజ‌మ‌హేంద్రిలో జ‌న‌సైన్యం గ‌ర్జ‌న‌.. ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు మొద‌లైన ద‌ఢ‌..

రాజ‌మ‌హేంద్రిలో జ‌న‌సైన్యం గ‌ర్జ‌న‌.. ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు మొద‌లైన ద‌ఢ‌..


తూర్పుగోదావ‌రి జిల్లా రెండో రాజ‌ధాని న‌గ‌రం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సాక్షిగా జ‌న‌సైనికులు గ‌ర్జించారు.. ఔత్సాహికుల స‌మావేశానికి వంద‌లాదిగా హాజ‌రై ప‌వ‌న్‌సేన స‌త్తా చాటారు.. రాజ‌మండ్రి న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల ప‌ల్లెల నుంచి కూడా ప‌దుల సంఖ్య‌లో పార్టీ ఔత్సాహికులు ఈ భేటీలో పాల్గొన్నారు.. కుల‌, మ‌త‌. వ‌ర్గ విబేధాలు లేకుండా అంతా క‌ల‌సిక‌ట్టుగా త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు.. ఇదే ప‌వ‌న్ ఇజం అని చాటి చెప్పారు.. పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం ఎలా.. బూత్ స్థాయి నుంచి కేడ‌ర్‌ను ఎలా త‌యారు చేయాలి అనే అంశాల‌పై ఎవ‌రి సూచ‌న‌లు వారు చేశారు.. పార్టీ విధి విధానాలు, ముఖ్యంగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశ‌యాలు ఏంటి..? ఆయ‌న ల‌క్ష్యాలు ఏంటి..? అనే అంశాల‌ను ఓ బూత్ యూనిట్‌గా తీసుకుని అంద‌రికీ అర్ధ‌మ‌య్యేలా వివ‌రించాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.. పార్టీ ప‌ట్ల న‌మ్మ‌కంతో వ‌చ్చిన ప్ర‌తి ఔత్సాహికుడ్ని కాపాడుకోవ‌డం కూడా చాలా ముఖ్య‌మ‌న్నారు.. వారితోనే బూత్ స్థాయి విస్త‌ర‌ణ సాధ్య‌ప‌డుతుంద‌న్న సూచ‌న‌లు చేశారు..
img-20161218-wa0088img-20161218-wa0089img-20161218-wa0091

వృక్షం బ‌లంగా ఎద‌గాలంటే., వేళ్లు ప‌టిష్టంగా ఉండాలన్న సూత్రాన్ని పాటించాల‌ని మ‌రికొంద‌రు తెలిపారు.. అప్పుడే జ‌న‌సేన అనే మ‌హావృక్షం అంద‌రికీ గూడుగా మారి నీడ నిస్తుంద‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌ధ్యంలో ఎంతో ఓపిక‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రాన్ని ప‌లువురు ప్ర‌స్థావించారు.. ప్ర‌తి ఒక్క‌రు ఓర్పుతో ముందుకి న‌డ‌వాల‌ని చెప్పారు..

img-20161218-wa0120

ఇక జ‌న‌సేన పార్టీ పేరుతో కొంద‌రు ఊర్ల‌లో తిరిగి అక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న విష‌యం కూడా ఔత్సాహికుల భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.. పార్టీ అభివృద్ది కోసం వారి కృషి అభినంధ‌నీయ‌మ‌న్న ప‌లువురు., ఏవైతే స‌మ‌స్య‌లు తెలుసుకుని వ‌చ్చారో., వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు.. సంబంధిత వ‌ర్గాలు స్పందించ‌కుంటే ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడాల‌ని కోరారు.. మిగిలిన పార్టీల్లా స‌మ‌స్య‌ల్ని స‌మ‌స్య‌లుగా మాత్ర వ‌దిలేయ‌వ‌ద్ద‌న్నారు.. అప్పుడే జ‌న‌సేన ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు..

కుల‌, మ‌త‌, వ‌ర్గ విబేధాలు పార్టీలో లేవ‌ని నిరూపితం కావ‌డంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు యువ‌త మాత్ర‌మే జ‌న‌సేన‌కి అండ అనుకున్న వారికి రాజ‌మండ్రి స‌మావేశం గ‌ట్టి బ‌దులే చెప్పింది.. దీంతో ప్ర‌త్య‌ర్ధి పార్టీల్లో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు మొద‌ల‌య్యాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు అండ‌గా ఉన్న‌వారిలో ఎంత మంది ప‌వ‌ర్‌స్టార్ వైపు వెళ్లారు అనే ఆరాలు షురూ అయిపోయాయి..

Share This:

2,905 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + 17 =