Home / జన సేన / రామ‌చంద్ర‌పురంలో జ‌న‌సేన అల‌జ‌డి.. పార్టీ శ్రేణుల బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..

రామ‌చంద్ర‌పురంలో జ‌న‌సేన అల‌జ‌డి.. పార్టీ శ్రేణుల బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..

img-20170119-wa0001 img-20170120-wa0068 తూర్పుగోదావ‌రి జిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్ర‌పురం.. జ‌న‌సేన పార్టీ, పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లకు ఇక్క‌డ అభిమానుల సంఖ్య‌., కాదు కాదు ఆరాధ‌కుల సంఖ్య భారీగానే ఉంటుంది.. జ‌న‌సేనుడి పార్టీ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఔత్స‌హికులు కూడా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోలిస్తే కాస్త ఎక్కువేన‌ని చెప్పొచ్చు.. ప‌వ‌న్ ప్రాభ‌ల్యం భాగా క‌న‌బ‌డే., ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ శ్రేణులు రెండు వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించాయి.. బూత్ స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి సంబంధించి నిర్వ‌హించిన ఈ అంత‌ర్గ‌త స‌మావేశాలు కాస్తా., జ‌న‌సేన బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌నా స‌మావేశాలుగా మారిపోయాయి.. స‌మావేశాలు నిర్వ‌హించిన రెండు వేదిక‌ల్లో అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యే స్థాయిలో పార్టీ ఔత్సాహికులు హాజ‌ర‌య్యారు.. తాము ఇప్ప‌టి నుంచే పార్టీ జెండా భుజాన క‌ట్టుకుని మోస్తామంటూ ముందుకి వ‌చ్చారు.. ఎవ‌రి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డోంట్ కేర్ అంటున్నారు..

img-20170121-wa0022 img-20170121-wa0025

ద్రాక్షారామంలో జ‌రిగిన స‌మావేశంలో అయితే., కుర్చీలు కిట‌కిట‌లాడ‌డంతో పాటు స‌మావేశానికి ఎంచుకున్న ప్ర‌దేశం సైతం ఇరుకుగా మారిపోయింది.. ఒక ర‌కంగా ఈ భేటీ., ప్ర‌త్య‌ర్ధుల‌కి గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించింద‌నే చెప్ప‌వ‌చ్చు.. అధికార‌, విప‌క్షాలు త‌మ త‌మ పార్టీల‌కి చెందిన ఎవరెవ‌రు., జ‌న‌సేన స‌మావేశంలో పాల్గొన్నార‌ని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టాయంటే ప‌రిస్థితి అర్ధం అవుతుంది..

రామ‌చంద్ర‌పురం మునిస్పాలిటీ, ద్రాక్షారామంల‌లో జ‌రిగిన స‌మావేశాల్లో., ఆ నియోజ‌క‌వ‌ర్గ అర్భ‌న్ ఏరియాలో ఉన్న బ‌లం నిరూపితం కాగా., గ్రామ‌స్థాయిలో పార్టీని ప‌టిష్ట ప‌ర్చ‌డం ఎలా అనే అంశంపై కీల‌క చ‌ర్చ జ‌రిగింది.. స‌మావేశానికి హాజ‌రైన ప‌లువురు., బూత్ స్థాయిలో వాలంటీర్ల ఏర్పాటు., కమిటీల ఫామింగ్‌కి సంబంధించి విలువైన స‌ల‌హాలు కూడా ఇచ్చారు.. ఈ అంత‌ర్గ‌త స‌మావేశాల‌కి జ‌న‌సైనికులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో., క‌వ‌ర్ చేసేందుకు ఎల‌క్ట్రానిక్ మీడియా సైతం పోటీ ప‌డింది..

Share This:

599 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 9 =