Home / పోరు బాట / రాష్ట్ర వ్యాప్తంగా చింత‌మ‌నేని వ్యాఖ్య‌ల సెగ‌లు.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌కు జ‌నసైన్యం డిమాండ్‌..

రాష్ట్ర వ్యాప్తంగా చింత‌మ‌నేని వ్యాఖ్య‌ల సెగ‌లు.. బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌కు జ‌నసైన్యం డిమాండ్‌..

img-20161227-wa0063 img-20161227-wa0065

దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.. అన్ని జిల్లాలో జ‌న‌సైనికులు రోడ్డెక్కారు.. నిర‌స‌న‌ల‌తో క‌థంతొక్కారు.. 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప్ర‌చారం చేస్తుంటే., ఆయ‌న వెనుకాల నిల‌బ‌డిన స‌లాం కొట్టిన చింత‌మ‌నేని., అవ‌స‌రం తీరాక‌. , న‌క్క‌జిత్తుల మాట‌లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డుతున్నారు.. ఓట్ల కోసం ప‌వ‌న్‌తో ప్ర‌చారం చేయించుకుని., ఆయ‌న అడుగుల‌కి మ‌డుగులొత్తిన ఫొటోల‌ను చూపెడుతూ., దీనికి బ‌దులు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. చింత‌మ‌నేని ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌ల‌కి క‌ట్టుబ‌డి ఉంటే., వెంట‌నే రాజీనామా చేసి బైఎల‌క్ష‌న్లో గెలిచి చూపించాల‌ని స‌వాలు విసురుతున్నారు..

నోటికావ‌రంతో క‌న్నూమిన్నూ కాన‌క చేసిన వ్యాఖ్య‌లైతే., జ‌న‌సేనానికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జ‌న‌సైనికులు డిమాండ్ చేస్తున్నారు.. చింత‌మ‌నేని సొంతజిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రిలో అడుగ‌డుగునా చింత‌మ‌నేని దిష్టిబొమ్మ‌లు త‌గుల‌బ‌డుతున్నాయి.. ఏదైతే మీడియా ఎదుట అనుచింత వ్యాఖ్య‌లు చేశారో., అదే మీడియా ఎదుట వాటిని ఉప‌సంహ‌రించుకోవాల‌ని., లేకుంటే జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని ఉంగుటూరులో ప‌వ‌న్ అభిమానులు హెచ్చ‌రించారు..

img-20161227-wa0055

అనంత‌పురం జిల్లా హిందూపురంలో జ‌న‌సైనికులు.., త‌మ సేనానికి చింత‌మ‌నేని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.. ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మేన‌ని హెచ్చ‌రించారు.. ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కి దారితీయ‌క ముందు చేసిన త‌ప్పును స‌రిదిద్దుకోవాల‌ని హెచ్చ‌రించారు.. స్థానిక అంబేద్క‌ర్ స‌ర్కిల్‌లో చింత‌మ‌నేని దిష్టిబొమ్మ‌ను ద‌గ్దం చేశారు..

fb_img_14827516343273233 img-20161226-wa0079

ఓ అభిమాని అయితే ఏకంగా చింత‌మ‌నేని క్ష‌మాప‌ణ చెప్పాల‌న్న డిమాండ్‌తో ఉన్న పోస్ట‌ర్‌ను సైకిల్‌కి త‌గిలించుకుని ఊరూరా తిరుగుతూ నిర‌స‌న తెలుపుతున్నారు..

అటు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నేత‌లెవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది.. చింత‌మ‌నేని వ్యాఖ్య‌లు కేవ‌లం వ్య‌క్తిగ‌త‌మా..? ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే మాదిరి వెనుకుండి పచ్చ పార్టీయే చేయించిందా..? అన్న‌ డౌట్లు వ‌స్తున్నాయి.. ఆది నుంచి వివాదాల‌కోరుగా పేరున్న చింత‌మ‌నేని వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మే అయితే., పార్టీ దాన్ని ఖండించాలిగా..? అవ‌స‌రం తీరాక ఓడు మ‌ల్ల‌న్న అనడం టీడీపీకి అల‌వాటే.. జ‌న‌సేనాని పోటీకి సై అని ప్ర‌క‌టించిన నాటి నుంచి., ప‌చ్చ‌చొక్కాలు ఇలాంటి న‌క్క‌జిత్తుల వేషాలు ఏవో ఒక‌టి వేస్తున్నారు.. అంటే పైకి మిత్రుడు అంటూనే., వెనుక గోతులు త‌స్తున్నారా..? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. అయితే ప‌వ‌న్ విష‌యంలో ఏం చేసినా., అది కాస్తా ఆకాశం మీద ఉమ్మి వేసిన చందంగా రివ‌ర్స్ అవ‌డం కూడా ప‌రిపాటిగా మారిపోయింది..

 

Share This:

2,058 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

One comment

  1. Pawan kalyan garu ki, kshamapana cheppali, from manikyalarao tatipakala janasena party active member visakhapathanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + three =