Home / పవన్ టుడే / రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన కాట‌మ‌రాయుడు సంక్రాంతి పోస్ట‌ర్‌.. ఇండియాలోనే రెండో స్థానం…

రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన కాట‌మ‌రాయుడు సంక్రాంతి పోస్ట‌ర్‌.. ఇండియాలోనే రెండో స్థానం…

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో., మ‌రోసారి రుజువైంది.. ప‌వ‌న్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు., క‌నీసం టీజ‌ర్ కూడా రిలీజ్ కాకుండానే స‌రికొత్త టాలీవుడ్ ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారింది.. సంక్రాంతి సంద‌ర్బంగా కాట‌మ‌రాయుడు టీం విడుద‌ల చేసిన‌
డిజిట‌ల్ పోస్ట‌ర్‌., ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.. యూట్యూమ్ వేదిక‌గా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్ సంస్థ విడుద‌ల చేసిన ఈ పోస్ట‌ర్ వ్యూస్‌., తెలుగులో మ‌రే చిత్రం తాక‌లేని స్థాయిలో వ‌చ్చిప‌డుతున్నాయి.. మొద‌టి 24 గంటల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ ల‌క్ష వ్యూస్ టార్గెట్‌గా పెట్టుకుంటే., రెండు గంట‌ల్లోనే ప‌వ‌న్ ప‌వ‌ర్ రికార్డుల వేట మొద‌లు పెట్టింది..

rayudu-rec sankranthi-rayudu

మొద‌టి రెండు గంట‌ల్లో వ‌చ్చిన యూట్యూబ్ వ్యూస్‌తో కాట‌మ‌రాయుడు ఇండియాలోనే నంబ‌ర్ టూ స్థానంలో నిలిచాడు.. మూడు గంట‌ల్లో ల‌క్షా 30 వేల వ్యూస్‌తో ప్ర‌క‌పంన‌లు రేపాడు.. ఇక గంట‌లు గ‌డ‌చిన కొద్ది., కాట‌మ‌రాయుడు డిజిట‌ల్ పోస్ట‌ర్ వ్యూస్‌., స‌రికొత్త రికార్డులు వేటాడుతూ ముందుకు సాగుతున్నాయి.. 15 గంట‌లు దాటే స‌మ‌యానికి మూడు ల‌క్ష‌ల మందికి ద‌గ్గ‌ర‌గా., ఈ పోస్ట‌ర్‌ని తిల‌కించారు..

భోగి నాడు రైతు బిడ్డ గెట‌ప్‌లో ఉన్న పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసిన చిత్ర నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌., పండుగ రోజు కాట‌మ‌రాయుడు కోడి పుంజుని నిమురుతూ ఉన్న మ‌రో పోస్ట‌ర్‌ని ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు.. సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌న్న‌ట్టు ఉన్న ఈ పోస్ట‌ర్ నిమిషాల్లో వైర‌ల్‌గా మారిపోయింది.. ఇక ప‌చ్చ‌ని ప‌ల్లెటూరి అందాలు చూపుతూ., అదే పుంజు చేతిలో ప‌ట్టుకుని ఉన్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిక్చ‌ర్‌ని డిజిట‌ల్ పోస్ట‌ర్‌గా సంక్రాంతి రోజు ఉద‌య‌మే విడుద‌ల చేశారు.. టీజ‌ర్ రిలీజ్ కాకుండానే., దంచేస్తోంది.. ప‌వ‌ర్‌స్టారా మ‌జాకా..

ఇక టీజ‌ర్ విడుద‌ల అయితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.. యూట్యూబ్ బాక్సులు ప‌గిలిపోవాల్సిందే అంటున్నారు.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌..

Share This:

477 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + one =

%d bloggers like this: