Home / ఎడిటోరియల్స్ / రిజిస్ట‌ర్ పార్టీకి కేటాయించిన కామ‌న్ సింబ‌ల్ ఇంకొక‌రికి ఇవ్వొచ్చా.?

రిజిస్ట‌ర్ పార్టీకి కేటాయించిన కామ‌న్ సింబ‌ల్ ఇంకొక‌రికి ఇవ్వొచ్చా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాపితంగా ఈ నెల 11వ తేదీన జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తిగా ప్ర‌జాస్వామ్యాన్ని కూనీ చేస్తూ సాగింది.. ప‌ట్ట‌ప‌గ‌లు పార్టీలు ఓటుకు నోటి ఇచ్చి కొంటున్నా ప‌ట్టించుకునే నాధుడు లేడు.. ధ‌న ప్ర‌భావం లేని ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం.. ప్ర‌తి అడుగు త‌నిఖీలు చేస్తున్నాం అని ఈసీ చెప్పిన మాట‌లు నీటి మూట‌లుగా మిగిలాయి.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలో పోటీ ప‌డి మ‌రీ ఓట్ల కోసం డ‌బ్బులు విర‌చిమ్మాయి.. నాయ‌కులు బ‌హిరంగంగా డ‌బ్బులు పంచుతున్నార‌న్న విష‌యం తెలిసినా ఈసీ నిద్ర న‌టించింది.. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే నెల్లూరు జిల్లాలో వీ వీ ప్యాట్ స్లిప్స్ బ‌య‌ట‌ప‌డేయ‌టం, జ‌న‌సేన పార్టీకి కేటాయించిన కామ‌న్ సింబ‌ల్ వేరే అభ్య‌ర్ధుల‌కు కేటాయించడం వంటి చ‌ర్య‌ల‌తో ఓ పార్టీ గెలుపు కోసం చేయాల్సిన ప‌నుల‌న్నీ చేసిన‌ట్టే క‌న‌బ‌డుతోంది.. ముఖ్యంగా గాజుగ్లాసు సింబ‌ల్ స్వ‌తంత్ర అభ్య‌ర్ధికి కేటాయించిన వ్య‌వ‌హారం మీద ఈసీ ప్ర‌తి స్పంద‌న సాంతం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంది..

ప‌ర్చూరులో జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం బీఎస్పీ అభ్య‌ర్ధి విజయ్‌కుమార్ బ‌రిలో ఉండ‌గా, స్వ‌తంత్ర అభ్య‌ర్ధికి జ‌న‌సేన పార్టీ కామ‌న్ సింబ‌ల్ కేటాయించ‌డం వివాదాస్ప‌ద‌మైన విష‌యం అంద‌రికీ తెలిసిందే.. అయితే బీఎస్పీ అభ్య‌ర్ధి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.. అయితే స్థానిక రిట‌ర్నింగ్ అధికారికి బీఎస్పీ అభ్య‌ర్ధి ఓర‌ల్‌గా ఫిర్యాదు చేయ‌గా., జ‌న‌సేన పార్టీ కేవ‌లం రిజిస్ట‌ర్డ్ పార్టీ మాత్ర‌మేన‌ని, గుర్తింపు పొందిన పార్టీ కాదు కాబ‌ట్టి, ఆ పార్టీకి ఇచ్చిన కామ‌న్ సింబ‌ల్‌కు విలువ ఉండ‌ద‌ని స‌ద‌రు రిట‌ర్నింగ్ అధికారి సెల‌విచ్చి వెన‌క్కు పంపేశారు.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించి అంత‌గా అనుభ‌వం లేక‌పోవ‌డంతో బీఎస్పీ అభ్య‌ర్ధి స‌ద‌రు అదికారి ఇచ్చిన స‌మాధానంతో త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు పూనుకోలేదు..

అయితే రిజిస్ట‌ర్డ్ పార్టీ అయిన జ‌న‌సేన పార్టీ రెండు రాష్ట్రాల్లో పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధుల‌ను బ‌రిలోకి దించేందుకు ఓ కామ‌న్ సింబ‌ల్ కావాల‌ని ఈసీని కోర‌గా, గాజుగ్లాసు గుర్తును ఇచ్చింది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆరు నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. అలా తీసుకువెళ్లిన కామ‌న్ సింబ‌ల్‌ను గుర్తింపు పొందిన పార్టీ కాద‌న్న నెపంతో ఇత‌రుల‌కు కేటాయిస్తే.. పార్టీకి జ‌రిగే న‌ష్టానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు.? నిబంధ‌న‌ల మేర‌కు ఓ పార్టీకి కేటాయించిన కామ‌న్ సింబ‌ల్ అదే రాష్ట్ర ప‌రిధిలో ఇత‌రుల‌కు కేటాయించ రాద‌న్న విష‌యం మీద ఎన్నిక‌ల సంఘం అధికారుల‌కు అవ‌గాహ‌న లేదా.? లేదా ఉద్దేశ‌పూర్వ‌కంగా బీఎస్పీ అభ్య‌ర్ధిని దెబ్బ కొట్ట‌డం ద్వారా, జ‌న‌సేన‌, బీఎస్పీల మైత్రీ బంధం మ‌ధ్య ఆగాధం సృష్టించేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మా.? ఎన్నిక‌ల సంఘం త‌న త‌ప్పును ఇద్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం కూడా అనుమానాల‌కు తావిస్తోంది.. చేసిన త‌ప్పును స‌రిదిద్దుకోవ‌డం అంటే, ప‌ర్చూరులో రీ పోలింగ్ నిర్వ‌హించాలి.. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరు ప‌ట్ల న్యాయ వ్య‌వ‌స్థ కూడా అక్షింత‌లు వేస్తుంటే., దున్న‌పోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్టుగా అధికారులు మాత్రం అవ‌న్నీ మాకు తెలియ‌దు.. మా వెనుక వున్న చోద‌క శ‌క్తి న‌డిపించిన‌ట్టే న‌డుస్తాం అన్న చందంగా ఉంది ఈసీ ప‌రిస్థితి.. మొక్కితార్ధంగా ఐదు బూత్‌ల‌లో మాత్ర‌మే రీ పోలింగ్ పెట్టేసి చేతులు దులుపుకున్న తీరు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో, పార్టీల్లో ఉన్న అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి.. అయితే గాజుగ్లాసు గుర్తును ఇత‌రుల‌కు కేటాయించిన అంశం మాత్రం కోర్టు మెట్లు ఎక్క‌డం ఖాయంగా క‌న‌బ‌డుతోంది.. అది జ‌ర‌గ‌క ముందే ఈసీ క‌ళ్లు తెరుస్తుందో లేదో వేచి చూడాలి..

Share This:

1,664 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + four =