Home / జన సేన / రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న.. వివ‌రాలు ఇవిగో..

రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న.. వివ‌రాలు ఇవిగో..

యువ‌త క‌ద‌లాలి.. యువ‌త‌ని జాగృతం చేయాలి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట స్ఫూర్తి నింపాలి.. ఇదే ల‌క్ష్యంతో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూడు విడ‌త‌లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించారు.. తొలి విడ‌త క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌ల ప‌రిశీల‌న‌, అధ్య‌య‌నం, అవ‌గాహ‌న కోసం కాగా., రెండో విడ‌తలో ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌భుత్వంలో చిత్త‌శుద్ది ఉంటే స‌రే., లేకుండా ప్ర‌భుత్వ బాధ్య‌త‌(పొలిటిక‌ల్ రెస్పాన్సిబులిటీ)ని జ‌న‌సేన పార్టీ త‌రుపున గుర్తుచేస్తారు.. మూడో విడ‌త ఇక స‌మ‌ర‌మే.. ఈ మూడు ద‌శ‌ల ప‌ర్య‌ట‌న ల‌క్ష్యం యువ‌త‌ను జాగృతం చేసేందుకే.. అందుకోసం ఛ‌లోరే ఛ‌లోరే ఛ‌ల్ పేరుతో ఒక చైత‌న్య గీతాన్ని కూడా ఆవిష్క‌రించారు.. ఈ ఉద్వేగ‌భ‌రిత గీంత‌లో మ‌హాక‌వి గుంటూరు శేషేంద్ర‌శ‌ర్మ క‌లం నుంచి జాలువారిన క‌విత‌లు జ‌న‌సేనుడి గ‌ళం నుంచి ప్ర‌తిధ్వ‌నించాయి..

వింటారా! వెనకాలే వస్తారా! తోడుగఉందాం వస్తారా! రండి విందాం.
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో ధూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదుధైర్యమే ఒక కవచం ,
రా…
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు
కలల ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే చాల్ల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
మన ఆత్మగౌరవన్ని దెబ్బ తీసే వాడికి ఇదే చెబుదాం,
సముద్రం ఒక్కళ్ల కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు , తుఫాన్ గొంతు చిత్తం అనడం ఎరగదు , పార్వతం ఎవడికి ఒంగి సలాం చెయ్యదు
నేను పిడికెడంత మట్టె కావొచ్చు ! కానీ గొంతేత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఏం రా
ప్రజల ఓట్లతో అందాలం ఎక్కిన నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒక్కటే! దేశం మకు గాయలిచ్చినా మీకు మేము పువ్వులిస్తున్నం
ఓ ఆశచంద్రికల కుంభ వృష్టి కురిసే మిత్రమా యోచించు ఏమి తెస్తావో , మన
అందరి ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే ధాటావు మరువకు మిత్రమా మరువకు
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
మన హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట! రాహువు పట్టిన పట్టు ఒక్క సెకండు అఖండమైన లోకభాంధావుడు అసలే లేకుండా పోతాడా
మూర్ఖుడు గడియారంలో ముళ్ళును కధలనియ్యకుంటే కాలగమనం అంతటితో తల క్రిందులైపోతుందా, పాలకుల కూటమికొక్క త్రుటికాలం విచ్చిన్నం అవుతుందా
దీనజనలోకం ఏకంగా దారికి అడ్డంగా నిల్చుంటే! నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా
ఏం …
రా …
బయటికి రా…

ఇక బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల ఏపీ టూర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఉద‌యం 8.30 గంట‌ల‌కి విశాఖ విమానాశ్ర‌యానికి చేరుకోనున్న ప‌వ‌న్‌., అక్క‌డి నుంచి నేరుగా విశాఖ న‌గ‌రంలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కార్యాల‌యానికి వెళ్తారు.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కార్పొరేష‌న్ ఉద్యోగి వెంక‌టేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు.. అనంత‌రం డిసిఐ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహీర దీక్ష శిభిరం వ‌ద్ద‌కు వెళ్లి ఉద్యోగుల‌తో మాట్లాడుతారు.. అక్క‌డే ఎల‌క్ట్రానిక్-ప్రింట్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌తో ముచ్చ‌టిస్తారు.. సాయంత్రం జ‌న‌సైనికుల స‌మావేశంలో పాల్గొంటారు..
ఏడో తేదీ ఉద‌యం రాజ‌మండ్రి చేరుకుని అక్క‌డ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొంటారు.. అనంత‌రం పోల‌వ‌రం ప్రాజెక్టుకి వెళ్లి., అక్క‌డ ప‌నుల తీరుని ప‌రిశీలిస్తారు.. అనంత‌రం విజ‌య‌వాడ‌కి చేరుకుంటారు..
ఎనిమిదో తేదీ ఉద‌యం విజ‌య‌వాడ‌లో ఫాతిమా కాలేజీ విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశం అవుతారు.. ఆ త‌ర్వాత కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అధ్యాప‌కుల‌తో మాట్లాడ‌తారు.. అనంత‌రం జ‌న‌సైనికుల‌తో స‌మావేశంలో పాల్గొంటారు..
తొమ్మిదో తేదీ ఉద‌యం మంగ‌ళ‌గిరిలో పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేయ‌నున్న స్థ‌లాన్ని పరిశీలిస్తారు.. అనంత‌రం ఒంగోలు వెళ్లి., అక్క‌డ ఫెర్రీ ప‌డ‌వ ప్ర‌మాద మృతుల కుటుంబాల‌ని ప‌రామ‌ర్శిస్తారు.. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ తిరుగు ప‌య‌న‌మ‌వుతారు.. ఉరుము, మెరుపుల్లేని పిడుగులా జ‌న‌సేన అధినేత ఒక్క‌సారిగా రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కి బ‌య‌లు దేర‌డంతో., పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి..

Share This:

1,073 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × two =