Home / జన సేన / రైతుల బ‌కాయిలు త‌క్ష‌ణం చెల్లించండి.. ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ డిమాండ్‌..

రైతుల బ‌కాయిలు త‌క్ష‌ణం చెల్లించండి.. ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ డిమాండ్‌..

ధాన్యం కొనుగోళ్ల బ‌కాయిల చెల్లింపులో నిర్ల‌క్ష్యం
రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల్లో విత్త‌నాల కొర‌త‌
రైతుల స‌మ‌స్య‌ల‌పై స‌ర్కారు త‌క్ష‌ణం స్పందించాలి
రైతులు రోడ్డెక్కే ప‌రిస్థితి తేవ‌ద్దు
ప్ర‌భుత్వానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హెచ్చ‌రిక‌.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం పార్టీ నాయ‌కులు, శ్రేణుల‌తో స‌మీక్షా స‌మావేశాల్లో బీజీగా ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద దృష్టి సారించారు.. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చే అంశంలో ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య ధోర‌ణిని ఎత్తిచూపే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.. ఈ వ్య‌వ‌హారం ఏదో తూతూ మంత్రంగా అన్న చందంగా కాకుండా, స‌మ‌స్య మీద పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేసి ప్ర‌జ‌ల త‌రుపున గొంతు విప్ప‌డం గ‌మ‌నార్హం.. తాజాగా ప‌వ‌న్ గ‌ళం విప్పిన రైతుల బ‌కాయిల అంశమే అందుకు నిద‌ర్శ‌నం.. ఖ‌రీఫ్ ప‌నులు మొద‌లైన త‌రుణంలో ప్ర‌భుత్వం నుంచి రైతుల‌కు అందాల్సిన ధాన్యం కొనుగోళ్ల తాలూకు బ‌కాయిలు అంద‌క‌పోవ‌డంతో, వారు సాగుకు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.. ఇదే అంశం ఆయ‌న దృష్టికి రావ‌డంతో., రాష్ట్రంలో ప‌రిస్థితిపై స‌మీక్ష జ‌రిపిన జ‌న‌సేనాని., ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంపై త‌న‌దైన శైలిలో స్పందించారు.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్ర‌భుత్వం వారికి సొమ్ములు చెల్లించే అంశంలో జాప్యం చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. తొల‌క‌రి మొద‌లు కావ‌డంతో వ్య‌వ‌సాయ అవ‌స‌రాల కోసం రైతులు అప్పుల‌కు వెళ్లే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.. అటు బకాయిలు చెల్లించకుండా, రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. రైతుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు మొత్తం త‌క్ష‌ణ‌మే చెల్లించ‌డంతో పాటు వారికి అవ‌స‌ర‌మైన విత్త‌నాలు త‌క్ష‌ణం అందుబాటులో ఉంచాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు..

ఇవాల్టికి ప్ర‌భుత్వం రైతుల‌కు చెల్లించాల్సిన‌ బ‌కాయిల మొత్తం రూ. 610.86 కోట్లు ఉంద‌ని తెలిపారు.. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ.240 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.176 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.94 కోట్లు ప్రభుత్వం రైతుల‌కు బాకీపడింద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.. ఖరీఫ్ పనులు మొదలైన తరుణంలో ధాన్యం అమ్మిన సొమ్ము రాక రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న విషయాన్ని ప్ర‌భుత్వం ముందు ఉంచారు..

ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రైతుల‌ను విత్త‌నాల కొర‌త వేధిస్తోంద‌ని., విత్త‌నాల కోసం రైతులు అర్థరాత్రి వరకూ క్యూల్లో నిలబడ్డా దొరుకుతాయో దొర‌క‌వో తెలియని పరిస్థితి నెల‌కొంద‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆరోపించారు.. అనంతపురం జిల్లాలో ఈ యేడాది 4.96 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయ‌నుండ‌గా., అందుకు 3 లక్షల క్వింటాళ్ళ విత్తనం అవసరమని ఉంద‌ని తెలిపారు.. అయితే ఇప్ప‌టికి 1.8 లక్షల క్వింటాళ్ళు విత్తనాలు మాత్ర‌మే అందుబాటులో ఉంద‌ని తెలిపారు.. స‌ర్కారు స‌బ్సిడిపై ఇచ్చే దుకాణాల్లో విత్తనాలు దొరకడం లేదనీ, బయట వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశెనగ విత్తనం దొరుకుతోందన్న విస‌యాన్ని రైతులు త‌న దృష్టికి తీసుకురావ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌న్నారు.. లోపం ఎక్కడ ఉందో ప్రభుత్వమే చెప్పాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు.. ప్రభుత్వం ఇచ్చే స‌బ్సిడి విత్తనాలను రైతులు బయట అమ్ముకొంటున్నారనీ, అలా చేస్తే ప్రభుత్వం నుంచి వ‌చ్చే లబ్ధి రాదు అంటూ అధికారులు హెచ్చరించడాన్ని ప‌వ‌న్ త‌ప్పుబ‌ట్టారు.. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవ‌ని స్ప‌ష్టం చేశారు.. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స‌మీక్షించి రైతులు రోడ్డెక్కి ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించారు..

Share This:

579 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 14 =