Home / పవన్ టుడే / రైతు క‌న్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు.. నిర్వాసితుల‌కి న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్‌.

రైతు క‌న్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు.. నిర్వాసితుల‌కి న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్‌.

img-20170122-wa0099

త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంది.. ఆదుకోమంటూ జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం త‌లుపుత‌ట్టిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోల‌వ‌రంలోని మూల్లంక‌., అమ‌రావతి లంక భూముల రైతుల త‌రుపున జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ళం విప్పారు.. ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు.. రైతుల క‌న్నీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు క్ష‌మేదాయ‌కం కాద‌ని అభిప్రాయ‌ప‌డిన ప‌వ‌న్‌., పోల‌వ‌రం ప‌క్క‌న ఉన్న మూల‌లంక‌లో 207 ఎక‌రాల మాగాణి భూమిని రైతుల అంగీకారంతో సంబంధం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చ‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మో చెప్పాల‌ని ప్ర‌జాప్ర‌తినిధుల్ని నిల‌దీశారు..

img_9027 img_9028

టీడీపీ ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకి చెందిన పోల‌వ‌రం గుత్తేదారు కంపెనీ ట్రాన్స్ స్ట్రాయ్‌., అడ్డ‌గోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మారిస్తే., అది చూస్తున్న ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారోన‌న్న వివేకం కూడా ప్ర‌జాప్ర‌తినిధులు చూప‌క‌పోతే ఎలా అని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు.. పోల‌వ‌రం నిర్మాణంలో ప్ర‌గ‌తికి సంబంధించి నెల‌కోమారు స‌మీక్ష జ‌రుపుతున్న స‌ర్కారు., ఇంత‌మంది అన్న‌దాత‌లతో క‌న్నీరు పెట్టిస్తున్న ఈ స‌మ‌స్య‌పై ఎందుకు దృష్టి పెట్ట‌డం లేదో అర్ధం కావ‌డం లేద‌ని జ‌న‌సేనుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఇలాంటి ప‌ద్ద‌తి మంచిది కాద‌ని., ఇక‌న‌యినా వారికి న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు..

ఈ భూముల రైతులు త‌మ వారు కాద‌ని స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేదా..? లేక‌పోతే కాంట్రాక్ట‌రుకి ఇబ్బంద‌ని ప‌ట్టించుకోవ‌డం లేదా..? అని ప‌వ‌న్ నిల‌దీశారు..గ‌త్యంత‌రం లేని రైతులు భూములు లాక్కుంటే లాక్కున్నారు క‌నీసం న‌ష్ట‌ప‌రిహారం అయినా ఇవ్వ‌మ‌ని అడిగితే వారి గోడు విన‌ర‌న్నారు.. పోల‌వ‌రం రైతులు ఇప్ప‌టికే ప‌లుక‌రాలుగా న‌ష్ట‌పోయార‌ని అభిప్రాయ‌ప‌డిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఇది అన్యాయం అని అడిగిన వారిపై పోలీసుల‌తో కేసులు పెట్టించి వారి నోళ్లు మూయిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు..

img_9029

అమ‌రావ‌తి ప్రాంతంలోని కృష్ణాన‌ది లంక భూముల రైతుల బాధ‌ను స‌మాజ వికాసాన్ని కాంక్షించే వారు అర్ధం చేసుకోవాల్సి ఉంద‌ని ప‌వ‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. తాము ద‌ళితులం అయినందువ‌ల్లే న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపులో వివ‌క్ష‌కు గుర‌వుతున్నామ‌ని ఆ ప్రాంత రైతులు ఆవేద‌న‌తో ఉన్నార‌న్నారు.. ఇలాంటి ప‌రిస్థితులు స‌మాజానికి మంచిది కాద‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు..

formers

అస‌లు గ్రీన్ ట్రిబ్యున‌ల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌దీ ప‌రివాహ‌కంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌న్న ఆయ‌న‌., ఇక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు తీసుకుందా..? లేదా అనే అంశంపై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేద‌న్నారు.. ఈ భూముల్నీ తీసుకుని ఏం చేస్తారో ప్ర‌జ‌ల‌కు చెప్ప‌క‌పోయినా., క‌నీసం రైతుల‌కైనా తెల‌పాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు.. భూముల స‌మీక‌ర‌ణ‌కి ముందు స‌ర్కారు ఎంత మేర‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పిందో., అంతా ఇవ్వాల్సిందేన‌న్నారు.. ప‌ట్టారైతుల‌కి ఒక‌లా., లంక భూముల‌కి మ‌రోలా వివ‌క్ష పాటించ‌డం మంచిది కాద‌న్నారు.. ఒక వేళ ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌క‌పోతే., సాగు భూములుగానే రైతుల‌కి వ‌దిలేయాల‌ని జ‌న‌సేన పార్టీ త‌రుపున ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

JANASENA PARTY guidelines to party activists

1. Address respectfully. Do not engage in personal abuses during the debates, even when provoked. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − twelve =

%d bloggers like this: