Home / పవన్ టుడే / రైలు ప్ర‌మాదం మృతుల‌కు ప‌వ‌న్ నివాళి., బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్‌..

రైలు ప్ర‌మాదం మృతుల‌కు ప‌వ‌న్ నివాళి., బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్‌..

16114501_1625424031100284_3685648195194553971_n

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. 40 మంది ప్రాణాలు బ‌లిగొన్న ఈ ఘోర దుర్ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసిందంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. అధునాత‌న టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌స్తున్నా., ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.. 40 మంది ప్ర‌ణాలు కోల్పోవ‌డం., 100 మందికి పైగా గాయ‌ప‌డ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.. అయిన వాళ్ల‌ని కోల్పోయిన వారిని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు.. క్ష‌త‌గాత్రుల‌కి మేలైన వైద్యం అందించాల‌ని కోరారు.. మృతుల కుటుంబాల‌కు, ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి ఆమోద‌యోగ్య‌మైన రీతిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు.. ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్తులో పున‌రావృతం కాకుండా త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు.. రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన వారి ఆత్మ‌లకు శాంతి చేకూర్చాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్ధిస్తున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు..

Share This:

721 views

About Syamkumar Lebaka

Check Also

వ‌రుస‌గా రెండో రోజూ సామాన్యుడి గ‌డ‌ప త‌ట్టిన జ‌న‌సేనుడు.. దూసుకుపోతున్న త‌రంగం..

జ‌న‌సేన త‌రంగం.. ప్ర‌తి ఇంటికి జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు చేర్చే క్ర‌మంలో రూపొందించిన కార్య‌క్ర‌మం.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × one =