Home / జన సేన / ర‌హ‌దారి భ‌ద్ర‌త ఎక్క‌డ‌..? వెల్దుర్తి రోడ్డు ప్ర‌మాదంపై జ‌న‌సేనాని..

ర‌హ‌దారి భ‌ద్ర‌త ఎక్క‌డ‌..? వెల్దుర్తి రోడ్డు ప్ర‌మాదంపై జ‌న‌సేనాని..

క‌ర్నూలు జిల్లా వెల్దుర్తి వ‌ద్ద జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో సుమారు 15 మంది మృత్యువాత ప‌డ్డారు.. ఎస్‌.ఆర్‌.ఎస్ ట్రావెల్స్ బ‌స్సుకు తుఫాన్ జీప్‌కు ఢీ కొట్ట‌డంతో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది.. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసి దిగ్భ్రాంతికి లోన‌యిన‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్‌., వారిని ప్ర‌భుత్వం అన్ని విధాలా అదుకోవాల‌ని డిమాండ్ చేశారు.. మృతులు గ‌ద్వాల జిల్లాకు చెందిన వారు కాగా, వీరంతా పెళ్లి చూపుల‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ ఉండ‌గా మార్గం మ‌ధ్య‌లో ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం తన‌కు బాధ క‌లిగించింద‌న్నారు.. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని కోరారు.. మితిమీరిన వేగ‌మే 15 మంది ప్రాణాలు తీసింద‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. ప్ర‌యివేటు బ‌స్సులు అతి వేగంతో వెళ్తున్నా ర‌వాణాశాఖ చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ప్ర‌మాదాలు పెరుగుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. ర‌హ‌దారి భ‌ద్ర‌తా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేసి, ప్ర‌యివేటు బ‌స్సుల వేగానికి క‌ళ్లెం వేయాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు..

Share This:

338 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 6 =