Home / జన సేన / లంచాల‌కు ఎవ‌రైనా రసీదులు ఇస్తారా..? ముఖ్య‌మంత్రిగారూ.. జ‌న‌సేనుడి ప‌వ‌ర్‌పంచ్..

లంచాల‌కు ఎవ‌రైనా రసీదులు ఇస్తారా..? ముఖ్య‌మంత్రిగారూ.. జ‌న‌సేనుడి ప‌వ‌ర్‌పంచ్..

జ‌న‌సేన పోరాట యాత్ర‌లో ఎన్నిక‌ల హామీలు ఎగ్గొట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌క్ష్యంగా ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. 40 ఏళ్ల అనుభ‌వం రాష్ట్రాన్ని దోచుకోవ‌డానికీ, తెలుగు త‌మ్ముళ్ల జేబులు నింపుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింద‌న్న ఆయ‌న‌, ముఖ్య‌మంత్రి, ఆయ‌న త‌న‌యుడి అవినీతిని విమ‌ర్శిస్తే., నిరూపించాల‌ని స‌వాళ్లు విసురుతున్నారన్నారు.. ఎక్క‌డైనా లంచాల‌కు ర‌సీదులు ఇస్తారా..? ముఖ్య‌మంత్రిగారు.. మా ప్ర‌శ్న‌కి బ‌దులిస్తే.. మీ ప్ర‌శ్న‌కి స‌మాధానం ల‌భించిన‌ట్టేన‌న్నారు.. పోరాట యాత్ర‌లో భాగంగా శుక్ర‌వారం సాలూరు, గ‌జ‌ప‌తిన‌గ‌రంల‌లో నిర‌స‌న క‌వాతులు నిర్వ‌హించిన ప‌వ‌న్‌, కేంద్ర-రాష్ట్రాల తీరుపై దుమ్మెత్తిపోశారు.. బాక్సైట్ కోసం కొండ‌ల్ని అక్ర‌మంగా త‌వ్వేస్తున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల ఉద్యోగ‌లకి, ఆఖ‌రికి ఆయాల ద‌గ్గ‌ర కూడా మామూళ్లు వ‌సూలు చేస్తున్న‌ర‌నీ, ఇదంతా అవినీతి కాక మ‌రేంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు..

సాలూరుకి ఆటోన‌గ‌ర్ పెట్టాల‌న్న జ‌న‌సేనాని, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.. ప‌చ్చ‌టి ఈ ప్ర‌కృతిలో టూరిజం స్పాట్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు.. తెలుగుదేశం పార్టీ ఎన్నిక సంద‌ర్భంగా ఇచ్చాన హామీలు ఏమ‌య్యాయంటూ ప్ర‌శ్నించారు.. నిరుద్యోగ భృతిపైనా ప‌వ‌న్ ఘాటుగా విమ‌ర్శ‌లు సంధించారు.. డిగ్రీ చ‌ద‌వ‌ని యువ‌కులు నిరుద్యోగులు అవ్వ‌రా,,? అంటూ నిల‌దీశారు..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 17 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పారు.. సాలూరుకు బైపాస్‌ వేశారా అంటూ జ‌న‌సేనుడు ఘాటుగా స్పందించారు.. సాలూరులో వేలమంది కార్మికులు ఉన్నారు. ఆటో నగర్‌ ఉంటే అభివృద్ది చెందేదన్నారు. ఉద్దానం సమస్యను ప్రపంచం దృష్టికి ఎలాగా తీసుకు వెళ్లానో అదే విధంగా సాలూరు సమస్యలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. జిల్లాలో 5వేల చెరువులు ఉన్నా ఫలితం లేదు. స్థానిక తెలుగు దేశం ఇంచార్జ్‌ బంజదేవ్‌ పెద్ద గెడ్డ రిజార్వాయర్‌ నుంచి నీటిని రొయ్యల చెరువుకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కలుషిత నీటిని ప్రజలకు పంపించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని పవన్ ధ్వ‌జ‌మెత్తారు.. అనుకున్న స‌మ‌యానికంటే ముందుగానే వ‌చ్చినా, మండుటెండ‌లోనూ జ‌నం పెద్ద ఎత్తున పోరాట‌యాత్ర‌కి త‌ర‌లివ‌చ్చారు.. ఆయ‌న‌తో క‌లిసి ఉత్సాహంగా ప‌దం క‌లిపారు..

అటు శ‌నివారం ప‌వ‌న్ టూర్ చీపురుప‌ల్లి, నెల్లిమెర్ల‌, విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగుతుంది..

Share This:

1,516 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 20 =