Home / జన సేన / లెక్క‌లు తేల్చేందుకు JFC రెఢీ.. శుక్ర‌వార‌మే తొలి స‌మావేశం..

లెక్క‌లు తేల్చేందుకు JFC రెఢీ.. శుక్ర‌వార‌మే తొలి స‌మావేశం..

ప్ర‌త్యేక హోదా స‌హా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల అమ‌లు వ్య‌వ‌హారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు., రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప‌ర‌స్ప‌ర విరుద్ద ప్ర‌క‌ట‌న‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన గంద‌ర‌గోళాన్ని తొల‌గించేందుకు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC)కి రూప‌క‌ల్ప‌న చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. క‌మిటీ నిర్మాణానికి సంబంధించిన అడుగులు కూడా వ‌డివ‌డిగా వేశారు.. ఓ వైపు లోక్‌స‌త్తా జేపీ, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ఉండ‌వ‌ల్లి లాంటి నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూనే., స‌మాంత‌రంగా నిజాలు నిగ్గు తేల్చే క‌మిటీ (JFC)కి సంబంధించి మిగిలిన స‌భ్యుల ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగించారు.. వివిధ రంగాల నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు.. మ‌రోవైపు ఎవ‌రి లెక్క‌లు ఏంటో ఇస్తే.. అదీ ఫిబ్ర‌వ‌రి 15 లోపు ., కేంద్రానిది నిజ‌మా., రాష్ట్ర ప్ర‌భుత్వానిది నిజ‌మా అన్న విష‌యాన్ని JFC నిర్ధారిస్తుంద‌ని ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత స్ప‌ష్టం చేశారు.. అయితే లెక్క‌ల వ్య‌వ‌హారంలో ఇరు వ‌ర్గాల నుంచి స్ప‌ష్ట‌త వ‌చ్చిన దాఖ‌లాలు క‌న‌బ‌డ‌లేదు..

అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ త‌న చొర‌వ‌తో ఏర్పాటు చేసిన JFCని స‌మావేశ ప‌ర్చి., భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ సిద్దం చేసేందుకు రెడీ అయ్యారు.. ఫిబ్ర‌వ‌రి 16 అంటే శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ తొలి స‌మావేశం జ‌రుగుతుంది.. ఈ మేరకు జ‌న‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కి హైద‌రాబాద్‌లోని హోట‌ల్ ద‌స్ప‌ల్లాలో ఈ స‌మావేశం జ‌రుగుతుంది.. రెండు రోజుల పాటు ఈ స‌మావేశం ఉంటుంద‌ని జ‌న‌సేన పార్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.. అంటే 17వ తేదీ శ‌నివారం కూడా JFC స‌మావేశం కొన‌సాగుతుంది..

ఈ స‌మావేశానికి ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త‌ల‌తో పాటు న్యాయ‌కోవిదులు, ఆర్ధిక శాస్త్ర‌వేత్త‌లు, విద్యావేత్త‌లు, సామాజిక నిపుణుల‌తో పాటు ఇత‌ర రంగాలకు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రుకానున్న‌ట్టు జ‌న‌సేన పార్టీ ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్కొన్నారు.. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌, సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, మాజీ లోక్‌స‌భ స‌భ్యులు కొణ‌తాల రామ‌కృష్ణ‌, సిపిఎం ఏపీ కార్య‌ద‌ర్శి మ‌ధు, సిపిఐ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర‌రాజు, పిసిసి కార్య‌ద‌ర్శి జంగా గౌత‌మ్‌, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీనివాస‌రావు త‌దిత‌రులు పాల్గొంటారు.. JFCలో మేధావుల‌తో పాటు అన్ని రాజ‌కీయ పార్టీల్ని భాగ‌స్వాముల్ని చేయాల‌న్న ల‌క్ష్యంతో జ‌న‌సేనాని స్వ‌యంగా ఏపిసిసి అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డికి కాల్ చేయ‌గా., ఆయ‌న త‌మ పార్టీ త‌రుపున ఇద్ద‌రు స‌భ్యుల్ని పంపేందుకు ముందుకి వ‌చ్చారు..

ప్ర‌జ‌ల‌కి రాజ్యాంగం బ‌ద్దంగా ద‌క్కిన హ‌క్కుల్ని సాధించేందుకు ముంద‌డుగు వేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి., నివాళులు అర్పించిన అనంత‌రం JFC భేటీకి హాజ‌రుకానున్న‌ట్టు ఆ పార్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది..

Share This:

3,362 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × five =