Home / జన సేన / లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీతో పాటు 6 క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించిన జ‌న‌సేనాని

లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీతో పాటు 6 క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించిన జ‌న‌సేనాని

జ‌న‌సేన పార్టీ క‌మిటీల నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభం అయ్యింది.. సోమ‌వారం ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం అయిన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్., సుధీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు.. అనంత‌రం ఏడు క‌మిటీల‌కు చైర్మ‌న్ల‌ను, లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ నియామ‌క ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు.. ఇందులో లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌గా త‌మిళ‌నాడు మాజీ ఛీఫ్ సెక్ర‌ట‌రీ పి.రామ్మోహ‌న్‌రావు(ఐఏఎస్‌)ను నియ‌మించారు. లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్ క‌మిటీలో పంతం నానాజీ (తూర్పుగోదావ‌రి జిల్లా), బొలిశెట్టి శ్రీనివాస్‌(తాడేప‌ల్లిగూడెం) చిల‌కం మ‌ధుసూద‌న్‌రెడ్డి(ధ‌ర్మ‌వ‌రం), పితాని బాల‌కృష్ణ‌(ముమ్మిడివ‌రం), స‌య్య‌ద్ జిలాని(న‌ర‌స‌రావుపేట‌), అంకెం ల‌క్ష్మీశ్రీనివాస్‌(పెడ‌న‌), కోత పూర్ణ‌చంద్ర‌రావు (ప‌లాస‌), పాటంశెట్టి సూర్య‌చంద్ర‌(జ‌గ్గంపేట‌), సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌(య‌ల‌మంచిలి), సుంక‌ర శ్రీనివాస్‌( క‌డ‌ప‌), ఘంట‌సాల వెంట‌క‌ల‌క్ష్మి(దెందులూరు), కాకినాడ మాజీ మేయ‌ర్‌ పొల‌స‌ప‌ల్లి స‌రోజు, షేక్ రియాజ్‌(ఒంగోలు), వై.శ్రీను(రాజ‌మండ్రి), బాడ‌న వెంక‌ట జ‌నార్ధ‌న్‌(ఎచ్చెర్ల‌), ఇంజా సోమ‌శేఖ‌ర్‌రెడ్డి(ప్రొద్దుటూరు) త‌దిత‌రుల‌ను స‌భ్యులుగా ఉంటారు.. ఇక క‌మిటీ ఫ‌ర్ మైనారిటీస్ చైర్మ‌న్‌గా విద్యావేత్త అర్హం ఖాన్‌ను, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ క‌మిటీ చైర్మ‌న్‌గా ద‌ళిత ఉద్య‌మ‌నేత అప్పిక‌ట్ల భ‌ర‌త్‌భూష‌ణ్‌ను ఎంపిక చేశారు.. మ‌హిళా సాధికారిత క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా క‌ర్నూలుకు చెందిన రేఖాగౌడ్‌ను నియ‌మించారు. ప్ర‌స్తుతం రేఖాగౌడ్‌ వీర మ‌హిళా విభాగం చైర్మ‌న్‌గా ఉండ‌గా, ఆ బాధ్య‌త‌ల నుంచి మార్పు చేశారు. పార్టీ నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌(ఐఏఎస్‌)ను నియ‌మించారు. ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌సేన‌ శాస‌న స‌భ్యులు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ పేరును ఖ‌రారు చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మోనిట‌రింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా చింత‌ల పార్ధ‌సార‌థిని ఖ‌రారు చేశారు.. మిగిలిన క‌మిటీల స‌భ్యుల వివ‌రాల‌ను ఆయా క‌మిటీల చైర్మ‌న్ల‌తో మాట్లాడిన అనంత‌రం ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు పార్టీ అధినేత వెల్ల‌డించారు.

Share This:

851 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 3 =