Home / ఎడిటోరియల్స్ / ల‌గ‌డ‌పాటి స‌ర్వేల్లో నిజం అమ్ముడు పోయిందా..? ఆంధ్రా ఆక్టోప‌స్ దారిత‌ప్పిందా..? గుట్టు విప్పిన జ‌న‌సేనాని..

ల‌గ‌డ‌పాటి స‌ర్వేల్లో నిజం అమ్ముడు పోయిందా..? ఆంధ్రా ఆక్టోప‌స్ దారిత‌ప్పిందా..? గుట్టు విప్పిన జ‌న‌సేనాని..

మీడియాలో జ‌గ‌డ‌పాటిగా సుప్ర‌సిద్ధుడైన మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటికి మ‌రో బిరుదు కూడా ఉంది.. ఆంధ్రా ఆక్టోప‌స్‌.. అది రాజ‌కీయాల్లో మాత్ర‌మేనండోయ్‌.. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఒక స్థానానికి అయినా, రాష్ట్రం మొత్తం అయినా.. పంచాయితీ అయినా., పార్ల‌మెంటు అయినా.. ఈయ‌న‌గారు ఓ స‌ర్వే వేసేస్తారు.. ల‌గ‌డ‌పాటి జాత‌కం చెబితే ఇక తిరుగుండ‌ద‌ని ఖాక‌లు తీరిన నాయ‌కుల‌కి సైతం న‌మ్మ‌కం.. ల‌గ‌డ‌పాటి స‌ర్వే గెలుపుని ముందే నిర్ణ‌యిస్తోందంట‌.. కానీ నిజం మాత్ర‌మే చెప్పే ఆక్టోప‌స్ ఇప్పుడు దారి త‌ప్పిన‌ట్టు క‌న‌బ‌డుతోంది.. ఆ ఆక్టోప‌స్ ఆహారం తీసుకోకున్నా అబ‌ద్దం ఆడ‌దు., కానీ మ‌న ఆంధ్రా ఆక్టోప‌స్ మాత్రం బిజినెస్‌లు కాపాడుకునేందుకు అబ‌ద్దం అడుతోంది.. స‌ర్వే రిపోర్టులు తారు మారు చేసి., అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రిపోర్టులు రూపొందిస్తుంది.. జ‌నం నాడిని ఇవాళ స‌ర్వే రిపోర్టులు కాదు సామాన్యుడు కూడా ప‌సిక‌ట్ట‌గ‌ల‌డు.. కోటికి చేరువ‌వుతున్న స‌భ్య‌త్వాలు, కుల‌మ‌తాల‌కి అతీతంగా జ‌న‌సేన కోసం ప‌నిచేస్తున్న యువ‌త‌, వారిలో ఓ 20 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించి ప‌చ్చ ప్ర‌భుత్వం క‌సి తీర్చుకుంది.. ఆ విష‌యం కూడా గ‌మ‌నార్హం.. యువ‌త‌తో పాటు జ‌నంలో పెల్లుబుకుతున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌., ప్రజా స‌మ‌స్య‌ల‌పై క‌నీస పోరాటం చేయ‌లేని ప్ర‌తిప‌క్షం.. అలాంటి స‌మ‌యంలో జ‌నం ఎవ‌రి వైపు చూస్తారు.. మూడో ప్ర‌త్యామ్నాయం అయిన జ‌న‌సేన వైపు.. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏ ఒక్క‌ర్నీ ఓటు అడ‌గ‌డం లేదు.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ ప్ర‌తి ప్ర‌జా స‌మ‌స్య‌ని ప్ర‌పంచం దృష్టికి తీసుకెళ్ల‌డంతో పాటు బాధితుల‌కి భ‌రోసా ఇవ్వ‌డం.. అండ‌గా నిల‌బ‌డ‌డం, స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని పోరాటానికి పుర‌మాయించ‌డం.. ఇవ‌న్న జ‌నాల్లో జ‌న‌సేన ఆధ‌ర‌ణ‌కి కార‌ణం అవుతున్నాయి.. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెయిడ్ స‌ర్వేలు మాత్రం జ‌న‌సేన‌కి ఓట్ల శాతం లేదంటూ ఘోషిస్తున్నాయి..                                                                                                              Advertisement.

ఇక్క‌డ ఇంకో పాయింటు కూడా ఉంది.. రెండేళ్ల క్రితం జ‌న‌సేన అధినేత‌ని క‌లిసిన సంద‌ర్బంలో మ‌న ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌డ‌గ‌పాటి., ప‌బ్లిక్ ప‌ల్స్‌ని ఆయ‌న‌ ముందు ఉంచే క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే మీరే కింగ్ మేక‌ర్ అన్న‌ట్టు స్వ‌యంగా జ‌న‌సేనాని చెబుతున్నారు.. ప్ర‌భుత్వంలోకి ఎవ‌రు రావాలో డిసైడ్ చేయ‌గ‌ల స‌త్తా మీకు ఉంద‌ని చెప్పార‌ట‌.. అంతేకాదు బ‌లంగా ప‌ని చేసుకుంటూ పోతే., 2019 కాక‌పోయినా 2024కి ఖ‌చ్చితంగా సిఎం అవుతార‌ని అన్నార‌ట‌.. రెండేళ్ల నాటి ప‌రిస్థితుల‌కి, ఇప్పిటికీ జ‌న‌సేన బ‌లం ఎన్నో రెట్లు పెరిగింద‌న్న‌ది నిర్వివాదాంశం.. ఆ లెక్క‌న చూస్తే.. జ‌న‌సేన పార్టీ అధికారంలో కూర్చోవాలి గానీ., నాలుగు శాతం రావ‌డం ఏంటి..? ఇవి దొంగ లెక్క‌లు కావా.. మీ కంపెనీల‌ని కాపాడుకునేందుకే ముఖ్య‌మంత్రికి అనుకూలంగా స‌ర్వేలు ఇస్తున్నార‌ని జ‌న‌సేన అధినేత ఆరోపిస్తున్నారు. కాద‌ని మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్ప‌గ‌ల‌రా..?

జ‌న‌సేన అధినేత డిక్లేర్ చేశారు.. త‌న బ‌లం ఎంతో.. ఇప్పుడు జ‌న‌సేన పార్టీకి ఉన్న బ‌లం 18 శాతం.. ఎన్నిక‌ల నాటికి ఇది ఎంత‌వుతుందో ప్ర‌త్య‌ర్ధులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జ‌న‌సేనాని నోటి నుంచి వెలువ‌డే ప్ర‌తి మాట‌కీ చిత్త‌శుద్ది ఉంటుంది.. ఆ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల‌కి కూడా ఉంది.. అంటే మ‌రి జ‌న‌సేన అధినేత కింగ్ మేక‌ర్ అవుతారా..? కింగ్ అవుతారా..? మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ప‌రిణామాల్ని భ‌ట్టి చూస్తే., 2019లోనే జ‌న‌సైనికుల క‌ల నెర‌వేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.. ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగానే రాజ్యాన్ని ఏలే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి.. మీరు ఇలాంటి నిబ‌ద్ద‌త లేని ఎన్ని స‌ర్వేలు వేసినా..? జ‌నాన్ని ఏ మార్చాల‌ని చూసినా..? ఫ‌లితం ఎలా ఉండ‌బోతోందో ముందు ముందు మీకే తెలుస్తుంది..

Advertisement.

Share This:

2,595 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =