Home / సేన సేవ / వారాంతం వేస్ట్‌ ఖ‌ర్చుల‌కు చెక్‌.. సేవా మార్గంలో సేన..

వారాంతం వేస్ట్‌ ఖ‌ర్చుల‌కు చెక్‌.. సేవా మార్గంలో సేన..

img-20161211-wa0029 img-20161211-wa0030

వారాంత‌పు సెల‌వులు వ‌స్తే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి ఎంజాయ్ చేయ‌డం., ఏ మూవీకో, హాలిడే స్పాట్‌కో వెల్ల‌డమో చేసే యువ‌త‌లో అనూహ్య మార్పు వ‌చ్చింది.. ప‌వ‌నిజం బాట ప‌ట్టాక ప‌ద్ద‌తి పూర్తిగా మారిపోయింది.. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా సేవా కార్య‌క్ర‌మాల వైపు మొగ్గు చూపుతోంది.. న‌లుగురు క‌లిసి త‌లో చెయ్యి వేయ‌డం., పేద‌ల‌కు సాయం చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త ఇస్తోంది.. జ‌న‌సేనాని వీరిలో నింపిన స్ఫూర్తి అలాంటిది మ‌రి.. తాను ఆచ‌రించిన ధ‌ర్మాన్ని ప‌క్క‌వారికి చెబితే., వారూ దాన్ని పాటిస్తారు.. అదే సూత్రాన్ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనుస‌రించి విజ‌య ప‌థంలో దూసుకుపోతున్నారు..

img-20161211-wa0035 img-20161211-wa0036

కుల‌,మ‌త‌, ప్రాంతీయ విబేధాల‌కు అతీతంగా సేవా ప‌ధంలో దూసుకుపోతున్న జ‌న‌సైన్యం., గ‌త వారాంతంలో అనంత‌లో ద‌ళిత‌, బ‌హుజ‌నుల సేవ‌లో త‌రించింది.. సాగ‌ర్ రాయ‌ల్ ఆధ్వ‌ర్యంలో స్థానిక ఎస్సీ కాల‌నీలో ప‌వ‌న్ ద‌ళిత యువ‌సేన నిరు పేద మ‌హిళ‌ల‌కు చీర‌లు., విద్యార్ధుల‌కి పుస్తకాలు పంచారు..

మంచాన ప‌డిన ఓ ప‌వ‌న్ అభిమానికి దుస్తుల‌తో పాటు మందులు, వైద్యం ఖ‌ర్చుల నిమిత్తం కొంత న‌గ‌దు సాయం కూడా అందించారు.. సాటి ప‌వ‌ర్‌స్టార్ అభిమానులుగా అత‌నికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.. రోజు రోజుకీ రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సైన్యం సేవా కార్య‌క్ర‌మాలు విస్తృత‌మ‌వుతుండ‌డంతో., ఎక్క‌డ చూసినా జ‌న‌సేన టాకే విన‌బ‌డుతోంది..

Share This:

689 views

About Syamkumar Lebaka

Check Also

తిత్లీ బాధితుల‌కి జ‌న‌సేన ఊర‌ట‌.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో చురుగ్గా..

చేతిలో అధికారం లేదు.. చేతినిండా డ‌బ్బు లేదు.. కానీ చేయాల‌న్న మ‌న‌సు మాత్రం ఉంది.. నాయ‌కుడు అందించిన స్ఫూర్తి గుండెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × five =