Home / జన సేన / వార‌స‌త్వ ల‌క్ష‌ణం బ‌య‌ట‌పెట్టుకున్న జేసీ త‌న‌యుడు.. ప‌వ‌న్‌పై ప‌చ్చ పురాణంతో తెరంగేట్రం.

వార‌స‌త్వ ల‌క్ష‌ణం బ‌య‌ట‌పెట్టుకున్న జేసీ త‌న‌యుడు.. ప‌వ‌న్‌పై ప‌చ్చ పురాణంతో తెరంగేట్రం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వివాదాల వీరుడు, కామెడీ పీస్ ఎవ‌రు అంటే.. అది జేసీ దివాక‌ర్ రెడ్డి అన్న విష‌యం వేరే చెప్పాల్సిన ప‌ని లేదు.. ఒక్క దివాక‌రే కాదు.. జేసీ సోద‌రులిద్ద‌రికీ నోటి దూల కాస్త జాస్తే.. అయితే ఈ నోటి దూల‌కి అంత‌ర్లీనంగా ఒక ల‌క్ష్యం అయితే ఖ‌చ్చితంగా ఉంటుంది.. అదే అధికారం.. రాజ‌కీయాల నుంచి రిటైర్మెంట్‌కి రెఢీ అయిన జేసీ, వార‌సుల ఏంట్రీకి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నారు.. అందులో భాగ‌మే మ‌హానాడులో నారా లోకేష్‌ని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించ‌డం.. బాబు గార్ని ప్ర‌స‌న్నం చేసుకుంటే త‌న‌యుడి తెరంగేట్రానికి ఇబ్బంది ఉండ‌ద‌న్నది జేసీ ఆలోచ‌న‌.. అందులో భాగంగానే నిత్యం సినిమావాళ్ల‌తో, అదే సినీమా వాళ్ల‌తో బిజీ బిజీగా గ‌డిపే ప‌వ‌న్‌రెడ్డిని అనంత‌కు దించేశారు.. ఎవ‌ర్ని టార్గెట్ చేస్తే ఈజీగా ప్ర‌చారం వ‌చ్చేస్తుందో వివ‌రించేసి ముందుకి పంపారు.. త‌మ ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన నోటి దూల‌ని జ‌న‌సేన అధినేత‌పై తీర్చుకోమంటూ అచ్చోసి వ‌దిలేశారు.. అంతే జూనియ‌ర్ జేసీ త‌న ఫ్యామిలీ మార్క్ నోటి దూల‌తో రంకెలు వేసేశారు..

ఆ రంకెల్లో ఓ వైపు స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శిస్తూనే, మ‌రోవైపు జ‌న‌సేనానిపై ప‌చ్చ పురాణం తెరిచేశారు.. రెండు నెల‌ల వెన‌క్కి వెళ్లి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిందంటూ అంతా తాను ద‌గ్గ‌రుండి చూసిన‌ట్టు ఓ క‌ట్టు క‌థ‌ని అల్లేశారు.. స్టోరీ అంతా భాగానే మ్యానేజ్ చేశారు గానీ, మార్చ్ 14న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌గ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదంటూ తాన మాట‌ల మ‌ర్మం ఏంటో చెప్ప‌క‌నే చెప్పారు.. సీనియ‌ర్ జేసీకి అంటే వ‌య‌సు మ‌ళ్లింది కాబ‌ట్టి కాస్త వినికిడో, క‌నికిడో లోపం ఉంద‌నుకోవ‌చ్చు.. చిన్న జేసీ క‌ళ్ల‌కీ, చెవుల‌కీ ఏమ‌డ్డుప‌డిందా అని ఆలోచిస్తే, తెలుగు త‌మ్ముళ్లంద‌ర్లాగే ప‌చ్చ పొర‌లు అడ్డుపడ్డాయ‌న్న‌ది తాడిప‌త్రిలో టాక్‌.. మాట్లాడితే వార్త‌ల్లోకి ఎక్కాల‌ని చూసుకునే జేసీ ఫ్యామిలీ పీస్ క‌ధా..

స‌రే మార్చ్ 14న ముఖ్య‌మంత్రి త‌న‌యుడు లోకేష్‌పై జ‌న‌సేన అధినేత చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కి ఆధారాలు చాలా క్లియ‌ర్‌గా ఉన్నాయ‌న్న‌ది జ‌న‌సేన శ్రేణుల వాద‌న‌.. విశాఖ భూక‌బ్జాల‌పై సిట్ రిపోర్టు, అదే ప్ర‌భుత్వం దాచిపెట్టిన రిపోర్టు బ‌య‌ట‌పెడితే తెలిసిపోతుందంట‌, శ్రీవారి పింక్ డైమండ్ వివ‌రాలు త‌వ్వితే తెలిసిపోతుందంట.. హెరిటేజ్ ఆస్తులు ఏటా వంద‌ల రెట్లు ఎలా వృద్ది చెందుతున్నాయో విచార‌ణ జ‌రిపిస్తే స‌రంట‌., ఇంకా మాట్లాడితే మీరు నీతిప‌రులే అయితే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోకుండా, ఓ సారి సిబిఐ విచార‌ణ జ‌రిపిస్తే తేలిపోతుంది.. ఎవ‌రి వ్య‌వ‌హారం ఏంటో.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఏదో ల‌బ్ది పొందాడు అన్న ఆరోప‌ణ‌ల్ని మీరు రుజువు చేస్తారా..? ప‌వ‌ర్ మీ చేతిలోనే ఉందిగా, ఎవ‌రితో విచార‌ణ చేయించుకున్నా స‌రే.. అంటూ స‌వాలు విసురుతున్నారు..

ఈ స‌వాలుని స్వీక‌రించే ద‌మ్ము నోటిదూల జేసీ జూనియ‌ర్ రెడ్డిగారికి ఉంటే, ఎవ‌రికెన్ని ఓట్లు ప‌డ‌తాయ‌న్న సంగ‌తి 2019 ఎన్నిక‌ల్లో తేల్చుకుందామంటున్నారు అనంత జ‌న‌సేన శ్రేణులు.. ఇంత‌కీ కొంప‌తీసి తాడిప‌త్రి ఉక్కు ప‌రిశ్ర‌మ ప్ర‌మాదాన్ని క్యాష్ చేసుకుందామ‌ని భావించిన మీ ఆశ‌ల మీద జ‌న‌సేన శ్రేణులు నీళ్లు చ‌ల్ల‌డం కార‌ణంగా వ‌చ్చిన క‌డుపు మంట కాదుగా ఇది.. మీ ఊరి జ‌నం మాత్రం అదే అనుమానంతో ఉన్నారు జేసీ ప‌వ‌న్‌రెడ్డీ..

అస‌లు మ్యాట‌ర్ వేర‌ని వారికి తెలియ‌దు క‌దా పాపం.. ఇంత‌కీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై ప‌చ్చ పురాణం ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టేనా., చంద్ర‌బాబు ప్ర‌స‌న్నం అయిన‌ట్టేనా.. సీటు ఖాయం అయ్యిందా..? ఇవ‌న్నీ అనంత జ‌నం వ్య‌క్త‌పరుస్తున్న అనుమానాలే..

Share This:

2,229 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − six =