Home / జన సేన / విజ‌యం వ‌రిస్తుందో.? లేదో.? తెలియ‌దు.. ప‌ని మాత్రం మొద‌లెట్టేశాడు.. ద‌టీజ్‌ జ‌న‌సేన‌..

విజ‌యం వ‌రిస్తుందో.? లేదో.? తెలియ‌దు.. ప‌ని మాత్రం మొద‌లెట్టేశాడు.. ద‌టీజ్‌ జ‌న‌సేన‌..

సామాజిక మాధ్య‌మాల్లో మూడు లైన్ల పోస్టు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.. తిరిగి అధికారంలోకి రాక‌పోతే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర‌మైన నిరాశా నిస్పృహ‌ల్లో కుంగిపోతాడు.. ఈ సారి కూడా అధికారం అంద‌ని ద్రాక్ష అయితే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిచ్చోడు అయిపోతాడు.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా మార్పు కోసం నిరంత‌రం పోరాటం చేస్తూనే ఉంటాడు.. అనేది ఆ పోస్టు.. మార్పు కోసం యుద్ధం మొద‌లుపెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఓట‌రులో ఏ మేర‌కు మార్పు తీసుకువ‌చ్చారో తెలియాలంటే మ‌రో 40 రోజులు వెచిచూడాలి.. అయితే మార్పు దిశ‌గా బ‌ల‌మైన అడుగు మాత్రం ఖ‌చ్చితంగా వేశారు.. ధ‌న‌ప్ర‌భావం లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ నిర్మాణం దిశ‌గా అడుగులు వేసే క్ర‌మంలో కేవ‌లం అభ్య‌ర్ధికి ఉన్న క‌మిట్‌మెంట్ ఆధారంగా సీట్లు కేటాయించి త‌నేంటో చాటుకున్నారు.. అదే స‌మ‌యంలో గెలిస్తే ఎవ‌రూ చేయ‌నంత అభివృద్ధి చేస్తా, ఓడితే ప్ర‌జ‌ల త‌రుపున పోరాటం చేస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు మాటిచ్చారు.. జ‌న‌సేనాని ఇచ్చిన స్ఫూర్తిని పార్టీ అభ్య‌ర్ధులు అమ‌లుప‌రిచి చూపుతున్నారు..

జ‌న‌సేన పార్టీ త‌రుపున ఎన్నిక‌ల బ‌రిలో దిగిన అభ్య‌ర్ధుల్లో మెజారిటీ శాతం ఓటుకు నోటు ఆశ చూప‌కుండా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి అవ‌స‌రం అయిన హామీల‌ను బాండ్ రూపంలో ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్పించారు.. గెలిస్తే ఈ ప‌నులు చేస్తాం, చేయ‌కుంటే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కును ప్ర‌జ‌ల చేతుల్లో పెట్టారు.. అయితే గెలుపు ఓట‌ముల సంగ‌తి తెలియ‌డానికి ఇంకా స‌మ‌యం ఉండ‌గా., గెలుస్తామా? లేదా? అన్న ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నెర‌వేర్చే ప‌నిలో ప‌డ్డారు జ‌న‌సేన అభ్య‌ర్ధులు.. అనంత‌పురం జిల్లాలో ఓ అభ్య‌ర్ధి ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చేందుకు బోరు వేయిస్తాన‌ని ఇచ్చిన మాట‌ను ఇప్ప‌టికే నిల‌బెట్టుకోగా., పుంగ‌నూరు నుంచి బ‌రిలోకి దిగిన జ‌న‌సేన అభ్య‌ర్ధి రామ‌చంద్ర‌యాద‌వ్‌., తన ప్రాంతానికి రైల్ లైన్ కోసం అప్పుడే హ‌స్తిన వెళ్లి ఏకంగా బోర్డు చైర్మ‌న్‌ను క‌లిశారు.. కేజీఎఫ్ నుంచి రొంపిచ‌ర్ల మీదుగా పుంగ‌నూరు వర‌కు రైల్ లేన్ కావాలంటూ విజ్ఞాప‌న‌ను వినోద్‌కుమార్ యాద‌వ్ ముందు ఉంచారు.. జ‌న‌సేన అభ్య‌ర్ధి త‌ప‌న చూసి బోర్డు చైర్మ‌న్ సానుకూలంగా స్పందించారు..

గెలిచినా ఓడినా జ‌న‌సేన పోరు జ‌నం కోస‌మే.. అలాంటి మార్పును జ‌నం కూడా ఆహ్వానిస్తార‌ని ఆశిద్దాం..

Share This:

1,094 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five − 1 =