Home / జన సేన / విభ‌జ‌న స‌మ‌స్య‌ల పోరాటానికి బ‌ల‌మైన గొంతుక‌(జేఏసీ).. జ‌న‌సేనాని వ్యూహాత్మ‌క‌ ప్ర‌తిపాధ‌న‌..

విభ‌జ‌న స‌మ‌స్య‌ల పోరాటానికి బ‌ల‌మైన గొంతుక‌(జేఏసీ).. జ‌న‌సేనాని వ్యూహాత్మ‌క‌ ప్ర‌తిపాధ‌న‌..

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం వెనుక ముఖ్య‌కార‌ణాల్లో ఒక‌టి విభ‌జ‌న వ‌ల్ల వ‌చ్చిన స‌మ‌స్య‌ల పరిష్కారం కూడా ఒక‌టి.. ప్రస్తుతం విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో కేంద్ర‌, రాష్ట్రాల వాద‌న‌లు చాలా తిక‌మ‌క‌గా ఉన్నాయి.. ఒక‌రు ఇచ్చాం అంటారు.. ఇంకొక‌రు ఇవ్వ‌లేదంటారు.. లెక్క చెప్ప‌మంటారు.. ఇంకొక‌రు ఇచ్చింది చాల్లేదు అంటారు.. ప్ర‌జ‌ల‌కి అర్ధ‌మ‌య్యే భాష‌లో ఎవ‌రూ మాట్లాడ‌రు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరుస్తార‌నే ఇక్క‌డ చంద్ర‌బాబుకి, అక్క‌డ మోడీకి మ‌ద్ద‌తు ఇస్తే., ఇప్పుడు వీరు కూడా ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోయారు.. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వివ‌ర‌ణ ఇది.. వేచి చూశా.. ఏడాది.. ఏడాదిన్న‌ర.. ఇంకా న్యాయం చేస్తార‌ని వేచిచూశా ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేద‌న్న‌వి ఆయ‌న ఆవేధ‌న‌.. ఆ ఆవేద‌న‌తోనే బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్ర‌త్యేక హోదా హామీ అమ‌లు కోసం ప్ర‌శ్నించాల్సి వ‌చ్చింద‌న్నారు.. తిరుప‌తి-కాకినాడ స‌భ‌ల త‌ర్వాత ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీ., త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌ధ్యంలో., హోదా పోరుని అంతా క‌ల‌సి నీరుగార్చారని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు.. మొద‌ట ప్యాకేజీ చాలా బాగుంద‌న్నారు.. త‌ర్వాత నిధులు స‌రిప‌డ ఇవ్వ‌లేదంటున్నారు.. కేంద్రం ఇచ్చిన వాటికి లెక్క‌లు చెప్ప‌మంటోంది.. అస‌లేం జ‌రుగుతోందో తెలియ‌ని తిక‌మ‌క ప్ర‌జ‌ల్లో నెల‌కొంద‌ని ఆయ‌న అంటున్నారు..

ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల బాగు కోసం స‌రికొత్త ఆలోచ‌నా విధానం కావాలి.. స‌రికొత్త వ్యూహం కావాలి.. రాజ‌కీయాల‌కి అతీతంగా రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం అంతా ముందుకి రావాలని జ‌న‌సేన అధినేత పిలుపునిచ్చారు.. తెలంగాణ సాధ‌న కోసం అన్ని పార్టీలు క‌ల‌సి ఎలాగైతే లోక్‌స‌భ‌ని స్థంభింప చేశారో., అదే స్ఫూర్తితో ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కోరారు.. అందుకోసం ఓ ప్ర‌త్యేక వేదిక ఏర్పాటు చేయాల‌ని జ‌న‌సేనాని ప్ర‌తిపాధించారు.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ఉండ‌వ‌ల్ల అరుణ్‌కుమార్‌, లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ లాంటి మేధావుల‌తో క‌ల‌సి ఈ వేదిక‌ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు.. అనంత‌పురం కృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్శిటీకి చెందిన కొంద‌రు ప్రొఫెస‌ర్లు, మ‌రికొంద‌రు మేధావులను ఇందులో భాగ‌స్వాముల్ని చేయాల‌ని భావిస్తున్న‌ట్టు జ‌న‌సేన అధినేత స్ప‌ష్టం చేశారు..

అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌ల‌సిరాని ప‌క్షంలో., మిగిలిన పార్టీలు, సంఘాలు, ట్రేడ్ యూనియ‌న్లు, ఎన్జీవోలు అంతా క‌ల‌సిరావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.. ఉండ‌వ‌ల్ల‌, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌ల‌తో వ్య‌క్తిగ‌తంగా క‌లిసి మాట్లాడిన త‌ర్వాత జేఏసీకి సంబంధించి త‌న ప్ర‌తిపాధ‌న‌కి ఓ రూపం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.. ప్ర‌జా శ్రేయ‌స్సు కోరే ఏ ఒక్క‌రైనా ఇందులో భాగ‌స్వాములు కావొచ్చ‌ని ప‌వ‌న్ చెప్పారు.. ఈ ఇద్ద‌రు నేత‌ల ఎంపిక వెనుక కూడా కార‌ణాన్ని ప‌వ‌న్ స్ప‌ష్టంగా తెలియ‌జేశారు.. అస్ప‌ష్టంగా రాష్ట్రాన్ని విభ‌జించిన‌ప్పుడు సొంతపార్టీకి వ్య‌తిరేకించి రాజ‌కీయాల‌కి దూరంగా ఉన్న ఉండ‌వ‌ల్లి చిత్త‌శుద్ది., జేపీకి ఉన్న ప‌రిపాల‌నా అనుభ‌వం.. ఈ ఇద్ద‌రితో చ‌ర్చ‌ల త‌ర్వాత వారి సూచ‌న‌ల మేర‌కు ముంద‌డుగు వేయ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత తెలిపారు..

ప్ర‌త్యేక హోదా అనే అంశంపై పోరాటానికి ఒక్క జ‌న‌సేన గొంతుక చాల‌డం లేద‌ని భావించిన ఆయ‌న‌., కేంద్రంపై పోరాటానికి ప‌క్కా వ్యూహాన్ని రెడీ చేస్తున్నారు.. టీడీపీ-వైసీపీ కూడా క‌ల‌సి వ‌స్తే భాగుండ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.. ప్ర‌జా శ్రేయ‌స్సు విష‌యంలో చిత్త‌శుద్ది ఉంటే మ‌రి ఈ అద్భుత ప్ర‌తిపాధ‌న‌కి అంతా క‌ల‌సే వ‌స్తార‌ని జ‌నం భావిస్తున్నారు..

Share This:

830 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 3 =