Home / జన సేన / విలువ‌ల‌తో కూడిన పోరాటం చేశాం.. ఓడినా త‌లెత్తుకు తిరుగుతున్నాం- తానాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

విలువ‌ల‌తో కూడిన పోరాటం చేశాం.. ఓడినా త‌లెత్తుకు తిరుగుతున్నాం- తానాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

విలువ‌ల‌తో కూడిర రాజ‌కీయాలు చేశాం.. అందుకే ఓడినా గ‌ర్వంగా ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ప‌త‌న‌మ‌వుతున్న విలువ‌ల‌కి పున‌రుజ్జీవం పోయ‌డానికేన‌ని ఉద్ఘాటించారు.. ధైర్యంగా స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చెప్ప‌డానికి వ‌చ్చాన‌న్నారు.. స్కాములు, ద్రోహాలు చేయ‌డానికి మాత్రం తాను రాజ‌కీయాల్లోకి రాలేద‌ని తెలిపారు.. అమెరికాలోని వాషింగ్ట‌న్ డిసిలో జ‌రిగిన 22వ తానా మ‌హాస‌భ‌ల‌కు ముఖ్య అతిధిగా ప‌వ‌న్ హాజ‌ర‌య్యారు. అమెరికా న‌లుమూల‌ల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌వాసుల‌ను ఉద్దేశించి జ‌న‌సేనాని సుధీర్ఘ ప్ర‌సంగం చేశారు.. ఆ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు..
* నేను పాటించే విలువ‌లే నా ఓట‌మికి కార‌ణం అయితే దాన్ని సంతోషంగా స్వీక‌రిస్తా.
* జైళ్ల‌లో కూర్చున్న వ్య‌క్తులే ద‌ర్జాగా తిరుగుతుంటే, స‌త్యాన్ని మాట్లాడే నేను ఎందుకు ఓట‌మికి భ‌య‌ప‌డ‌తాను.?
* డ‌బ్బుతో ముడిప‌డిన రాజ‌కీయాల్లో మార్పు తీసుకురావ‌డం క‌ష్ట‌మ‌ని మాకు తెలుసు
* డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌క‌పోతే ఓడిపోతాన‌ని నాకు తెలుసు. అయితే న‌మ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని బాధ‌లు అయినా ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నా.
* చిన్న నాటి నుంచి ఓట‌మి నుంచి పాఠాలు చేర్చుకుంటూనే ఉన్నా. ఓట‌మి ఎదురైన ప్ర‌తిసారీ విజ‌యానికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యా.
* జ‌న‌సేన పార్టీ ఓట‌మి ప్ర‌భావం నుంచి నేను కోలుకోవ‌డానికి కేవ‌లం 15 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది.
* ఎన్ని క‌ష్టాలు ఎదురైనా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు, భార‌త దేశానికి అండ‌గా నిల‌బ‌డ‌తా.
* స్వామి వివేకానందుడి ప్ర‌సంగాలు విని, పుస్త‌కాలు చ‌దివి మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు చాలా గొప్ప‌వ‌ని అనుకునేవాడిని.
* బ‌య‌ట స‌మాజంలో కులాలు, మ‌తాల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డం చూసి ఆవేద‌న క‌లిగించింది.
* సొంత రాష్ట్రంలోనే ద్వితియశ్రేణి పౌరులుగా బ‌తకాల్స‌న ప‌రిస్థితులు బాధ క‌లిగించాయి
* ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానో లేదో తెలియ‌దు. ప‌ద‌వులు వ‌స్తాయో రావో తెలియ‌దు. కానీ న‌వ‌త‌రానికి బ‌ల‌మైన గొంతు కావాల‌న్న ఉద్దేశంతోనే పార్టీ పెట్టాను.
* దాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డానికి ఎన్ని ఎదురుదెబ్బ‌ల‌కైనా సిద్ధం
* సినిమాల్లో డైలాగులు చెప్ప‌డం వేరు నిజ‌జీవితంలో మాట్లాడ‌డం వేరు.
* నిజ జీవితంలో మాట్లాడాలి అంటే గుండె ధైర్యం కావాలి. ఆ ధ‌ర్యం నాకు ప్ర‌జ‌లు ఇచ్చిన బ‌లం. ప్ర‌జ‌ల అండ‌లేక‌పోతే ఇంత ధైర్య‌గా మాట్లాడ‌గ‌లిగేవాడిని కాదు.
* సినిమాల్లో స‌క్సెస్ కోసం దాదాపు 10 ఏళ్లు స‌హ‌నంతో నిరీక్షించా.
* పాల‌కులు పాల‌కుల్లా ఉండాలి ఉండాలి త‌ప్ప నియంత‌లా ఉండ‌కూడ‌దు. నియంతలా ఉంటే పెట్టుబ‌డులు రావు. అభివృద్ధి ఎలా జ‌రుగుతుంది.?
* భార‌త‌దేశం నాయ‌కుడిని ప్రేమించే దేశం. నాయ‌కుడిని చూసి భ‌య‌ప‌డే దేశం కాదు.
* ప్ర‌జ‌లు నాయ‌కుల‌ను చూసి భ‌య‌ప‌డుతున్నారంటే ఖ‌చ్చితంగా ఏదో ఒక రోజు ఆ నాయ‌కుడు ప‌త‌నమ‌వ్వ‌డం ఖాయం.
* డ‌బ్బులిచ్చి ఓట్లు కొంటున్నారు. దాని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో నైతిక బ‌లం పోతుంది. ఓట్లు కొనుగోలు చేసే నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల మీద గౌర‌వం ఉండ‌దు.
* తానా స‌భ‌ల‌కు వెళ్తున్నానంటే రావొద్ద‌ని కొంద‌రు, వెళ్లొద్ద‌ని కొంద‌రు మాట్లాడం బాధించింది.
* మ‌నంతా ఒక‌టి కాదా..? మ‌నం తెలుగువాళ్లం కాదా..? భార‌తీయులం కాదా..?. కులాలుగా, మ‌తాలుగా విడిపోవాలా..? ప‌్రాంతీయ విద్వేషాల‌తో ఎందుకు కొట్టేకోవాలి.
* మ‌హాత్మ‌గాంధీకి న‌మ‌స్క‌రించి నా కులం నా మ‌తం అని తిట్టుకుంటుంటే ఎలా..?
* అమెరికాలో ఎన్ని ఆర్గ‌నైజేష‌న్లు ఉన్నా మ‌నంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉండాలి. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు మ‌న‌మే స‌హాయం చేసుకోవాలి. * కొంత‌మంది రాజ‌కీయ‌నాయ‌కులు కులాల‌ను, మ‌నుషుల‌ను విడ‌దీయాల‌ని చూస్తారు. నేను మాత్రం మ‌నుషుల‌ను క‌ల‌ప‌డానికి వ‌చ్చాను.
* అది నాకు అప‌జ‌యం ఇస్తే గ‌ర్వంగా తీసుకుంటాను.
* రాజ‌కీయ ల‌బ్ధికోసం మ‌నుషుల‌ను విడ‌గొట్టి విడివిడిగా వెళ్లిపోతుంటే స‌మాజం విచ్ఛినం అయిపోతుంది.
* భార‌త‌జాతి స‌మ‌గ్ర‌త కోసం, మ‌న తెలుగు సంస్కృతి కోసం మ‌నంద‌రం క‌లిసే ఉండాలి.
* అమెరికాలో విద్యార్ధుల‌ను అరెస్టు చేస్తే అధికారుల‌తో మాట్లాడాను. ఆ వ్య‌క్తులు ఏ కులామో, ఏ మ‌త‌మో, ఏ ప్రాత‌మో నాకు తెలియ‌దు.
* నాకు తెలిసింది వాళ్లు నాతోటి భార‌తీయులు అని మాత్ర‌మే. దాని వ‌ల్ల ఓట్లు ప‌డొచ్చు, ప‌డ‌క‌పోవ‌చ్చు, ప్ర‌భుత్వాలు రాక‌పోవ‌చ్చు. నేను ఓడిపోవ‌చ్చు నాకు ఇబ్బంది లేదు. విలువ‌ల‌ను నిల‌బెట్టినంత‌కాలం నేను చాలా గ‌ర్వంగా త‌లెత్తుకొనే తిరుగుతాను, గ‌ర్వంగా నిల‌బ‌డే మాట్లాడ‌తాను.
* సోష‌ల్ మీడియాను వ్య‌క్తుల‌ను కించ‌ప‌ర‌చ‌డానికి కాకుండా స‌మాజ‌హితం కోసం వాడండి.
* మ‌న ఎంపిలు, ఎమ్మెల్యేలు ఎలా ఉండాల‌న్న అంశంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా డిబేట్లు పెట్టండి.
* చాలామంది ఎన్నారైలు అడుగుతున్నారు మీకు డ‌బ్బు ఎంత ఇవ్వాల‌ని అడుగుతున్నారు. నేను వాళ్ల‌కు ఒక‌టే చెబుతున్నాను డ‌బ్బుల కోసం నేను రాజ‌కీయాల్లోకి రాలేదు. మంచి స‌మాజం నిర్మించ‌డానికి మీ మ‌న‌సు ఇవ్వండి చాలు.
* స‌మాజానికి ఏదో చేయాల‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను త‌ప్ప‌, రాజ‌కీయాల నుంచి ఏదో తీసుకెళ్ల‌డానికి రాలేదని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

Share This:

424 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − 4 =