Home / పవన్ టుడే / విశాఖలో జ‌న‌సేనాని.. ఉద్దానం ప‌ర్య‌ట‌న‌కు స‌ర్వం సిద్ధం..

విశాఖలో జ‌న‌సేనాని.. ఉద్దానం ప‌ర్య‌ట‌న‌కు స‌ర్వం సిద్ధం..

img-20170102-wa0044 img-20170102-wa0045

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విశాఖ చేరుకున్నారు.. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప‌ర్య‌ట‌న ఉన్న నేప‌ధ్యంలో ఆయ‌న విశాఖ‌కు విచ్చేశారు.. స్టీల్ సిటీలో ఆయ‌న‌కు అభిమానులు, జ‌న‌సేన పార్టీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి.. విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్ వ‌ర‌కు దారి పొడుగునా పూల‌వ‌ర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్క‌మ్ చెప్పారు.. జ‌న‌సేనాని కూడా త‌న‌కోసం వ‌చ్చిన అభిమానుల్ని నిరాశ‌ప‌ర్చ‌కుండా., అంద‌రికీ అభివాదం చేస్తూ ముందుకి సాగారు..

మంగ‌ళ‌వారం ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్ర‌స్తుల్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌లుక‌రించ‌నున్నారు.. ఎల్‌.మాక్స్ థియెట‌ర్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌యివేటు ప్రోగ్రాంలో సుమారు 300 మంది ఉద్దానం బాధితుల‌ను జ‌న‌సేనాని క‌లిసి., వారి బాధ‌లు తెలుసుకుంటారు.. అనంత‌రం ఇఛ్చాపురంలో రోడ్ షో నిర్వ‌హిస్తారు., ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్ల‌ను స్థానిక పార్టీ శ్రేణులు ఇప్ప‌టికే పూర్తి చేశాయి.. మూడు ద‌శాబ్దాలుగా అంతుతెలియ‌న మ‌హ‌మ్మారిలా ఉద్దానం ప్రాంతంపై దాడి చేసిన మూత్ర‌పిండాల వ్యాధి., వేలాది మందిని పొట్ట‌న‌పెట్టుకుంది.. ఇంకా ల‌క్ష‌లాది మంది ., ఈ మ‌హమ్మారి భారిన ప‌డి మృత్యువుతో పోరాడుతున్నారు.. పార్టీలు, పాల‌కులు మారినా., ఉద్దానం బాధితుల క‌ష్టాలు మాత్రం తీర‌డం లేదు.. అయితే వీరంతా జ‌న‌సేనాని రాక‌తో అయినా త‌మ బ‌తుకులు మార‌తాయ‌ని గంపెడాశ‌తో ఉన్నారు..

Share This:

642 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + nineteen =