జనసేన పార్టీ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని జనసేన కార్యకర్తలు మరోసారి నిరూపించారు.. చేతిలో అధికారం లేదుగా., చేతలేం చేస్తారు అనుకుంటున్నారా..? జనం కోసం జనసేన అధినేత ఏం చెబితే అది చేస్తారు.. జనసేనాని ప్రకటించిన ఏడు సిద్ధాంతాల్లో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది.. జనసేన అధినేత నోటి నుంచి ఓ మాట చెప్పారంటే., ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా., ఏ పనిలో ఉన్నా.. ఆయన మాటను తూచా తప్పకుండా అమల్లో పెట్టడంలో జనసైనికులకి మరే పార్టీ కార్యకర్తా సాటిరారు.. విశాఖ కవాతు సందర్బంగా మరోసారి కృష్ణా జిల్లాకి చెందిన జనసైనిక్స్ అదే స్ఫూర్తిని చాటి.. అందరితో వహ్వా అనిపించుకున్నారు..
ప్రత్యేక హోదా-విభజన హామీల అమలు కోసం, ఉత్తరాంధ్ర వెనుకబాటుని ప్రశ్నించే లక్ష్యంతో విశాఖ బీచ్ రోడ్డులో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భారీ నిరసన కవాతుకి పిలుపునిచ్చారు.. జనసేనుడి పిలుపుతో ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి లక్షకు పైగా జనసైనికులు ఆయనతో కలసి పదం కలిపేందుకు అక్కడికి తరలివచ్చారు.. పార్టీ అధినేత పదివేల మందితో కవాతు చేద్దామనుకుంటే., పది రెట్లు ఎక్కువ సైన్యం కదిలిరావడంతో., బీచ్ రోడ్డు ఇసుకవేస్తే కిందికి రాలనంత జనంతో కిటకిటలాడింది.. కాళీమాత ఆలయం వద్ద కవాతు మొదలుపెట్టిన పార్టీ అధినేత, సుమారు మూడు కిలోమీటర్ల దూరం లక్షకు పైగా జనసైనికులు పూర్తి క్రమశిక్షణతో వెంటరాగా., విజయవంతంగా పూర్తి చేశారు.. కవాతు సందర్బంగా జనసేన కార్యకర్తల దాహర్తి తీర్చేందుకు పార్టీ మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేసింది.. ఇక జనసేన అధినేత రోడ్డెక్కుతున్నారంటే ఇంకా చెప్పేదేముంది.. తోపుడ్లు, తొక్కిసలాటలతో రోడ్లు మొత్తం చెప్పులతో నిండిపోతాయి.. బీచ్ రోడ్ కవాతులో కూడా అదే జరిగింది..
కవాతు అనంతరం ఓ వైపు జనసేన అధినేత ప్రసంగం కొనసాగుతుంటే., మరోవైపు ఆ ప్రసంగం వింటూనే కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన గరికపాటి శ్రీధర్, కైకలూరుకి చెందిన నల్లగోపుల చలపతి, విజయవాడకి చెందిన రావి శ్రీనివాస్‌లు., జనసేనుడి స్ఫూర్తితో తమ బాధ్యతని నిర్వర్తించడం మొదలుపెట్టారు.. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అన్న నినాదంతో పాటు తమ తోటి జనసేన కార్యకర్తలు నిల్చున్న చోటు నుంచి కదల్లేని పరిస్థితుల్లో తాగిపడేసిన వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్‌తో పాటు కాగితాలు.. తదితర చెత్తని ఏరడం మొదలు పెట్టారు.. మంచినీళ్ల ప్యాకెట్లు తెచ్చిన సంచుల్ని గమనించిన వీరికి ఆ సంచిల్లో చెత్త నింపి, డస్ట్ బిన్‌ల్లో వేయాలన్న ఆలోచన కలిగింది.. అది తమ బాధ్యతగా భావించి., ఒకరి వెనుక ఒకరు కదిలి., రోడ్డుపై చెత్త మొత్తాన్ని ఏరివేశారు.. పర్యావరణ పరిరక్షణ అనే జనసేన నినాదాన్ని అమల్లో పెట్టడంతో పాటు.., సామాజిక స్పృహలో తమకు తామే సాటి అని నిరూపించారు.. ఈ ముగ్గురి స్ఫూర్తితో మరికొందరు క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు.. జనసేనుడి ప్రసంగం పూర్తయ్యే సమయానికి., కవాతు జరిగిన బీచ్ రోడ్డులో చెత్తని మొత్తం ఏరేశారు..
ఈ ముగ్గురు విశాఖ కవాతులో చెత్తను ఏరి, రోడ్లు క్లీన్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. గరికపాటి శ్రీధర్, నల్లగోపుల చలపతి, శ్రీనివాస్‌లని నెటిజన్లతో పాటు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.. ప్రతి జనసైనికుడు ఇదే స్ఫూర్తితో ముందుకి కదిలి, ప్రజలకి తామేంటో చాటాలని ఆకాంక్షిస్తున్నారు.. కొన్ని వేల మందిలో స్ఫూర్తిని రగిల్చిన ఈ ముగ్గురికీ పవన్‌టుడే కూడా హ్యాట్సాఫ్ చెబుతోంది..
Advertisement..