Home / జన సేన / విశాఖ బీచ్ రోడ్డులో జ‌న‌సేన భారీ నిర‌స‌న క‌వాతు.. ముందురోజే మోహ‌రించిన ప‌వ‌న్‌సేన‌..

విశాఖ బీచ్ రోడ్డులో జ‌న‌సేన భారీ నిర‌స‌న క‌వాతు.. ముందురోజే మోహ‌రించిన ప‌వ‌న్‌సేన‌..

ప్ర‌త్యేక హోదా- విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రికి నిర‌స‌న‌గా ఉత్త‌రాంధ్ర‌లో పోరాట యాత్ర చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్., శ‌నివారం విశాఖ‌లో భారీ నిర‌స‌న క‌వాతు నిర్వ‌హించ‌నున్నారు.. ఆంధ్రప్ర‌దేశ్‌కి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఈ క‌వాతుని నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన పార్టీ నిర్ణ‌యించింది.. దీంతో పాటు ఉత్త‌రాంధ్ర అభివృద్ది విష‌యంలో పాల‌కుల వైఫ‌ల్యాలు, భూ ఆక్ర‌మ‌ణ‌లు, క‌బ్జాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాల‌పై జ‌నాన్ని జాగృత ప‌రిచే ల‌క్ష్యంతో ఈ క‌వాతు త‌ల‌పెట్టింది.. జులై 7వ తేదీ, శ‌నివారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కి ఈ క‌వాతు ప్రారంభం కానున్న‌ట్టు పార్టీ ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు..

విశాఖ బీచ్ రోడ్డులోని కాళీ మాత గుడి నుండి ప్రారంభ‌మ‌య్యే ఈ క‌వాతు వైఎంసీఏ వ‌ర‌కు సాగుతుంది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ క‌వాతుని నిర్వ‌హించ‌నుండ‌గా., ఓ సైనిక క‌వాతులా పూర్తి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సాగ‌నుంది.. క‌వాతు కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌లుమూల‌ల నుండి పెద్ద ఎత్తున జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌స్తున్నారు.. ఇప్ప‌టికే వేలాది మంది కార్య‌క‌ర్త‌లు విశాఖ‌లో మోహ‌రించారు.. సుదూర ప్రాంతాల నుంచి బ‌య‌లుదేరిన వారు మ‌రికొంత మంది శ‌నివారం ఉద‌యం నాటికి సాగ‌ర తీరానికి చేరుకోనున్నారు.. ఇక ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర మూడు జిల్లాల నుండి కూడా భారీగా జ‌న‌సైనికులు విశాఖ త‌ర‌లివ‌చ్చేశారు..

కార్య‌క‌ర్త‌లు పూర్తి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, స‌మిష్టిగా క‌వాతుని జ‌య‌ప్ర‌దం చేయాలని పార్టీ అధినేత పిలుపునిచ్చారు.. నిర‌స‌న జ్వాల‌లు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి తాకేలా ఈ క‌వాతు సాగ‌నుంది…

Share This:

1,557 views

About Syamkumar Lebaka

Check Also

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =