Home / జన సేన / వీధి వీధినా వేళ్లూనుకుంటున్న ప‌వ‌నిజం.. వాడ వాడ‌లా వ్యాపిస్తున్న జ‌నసేన‌..

వీధి వీధినా వేళ్లూనుకుంటున్న ప‌వ‌నిజం.. వాడ వాడ‌లా వ్యాపిస్తున్న జ‌నసేన‌..

14591708_1758155264401804_3795673837189788259_n 14601022_1092051790910088_4524960238911493257_n
జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టామినా గురించి ఎవ్వ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.. ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు ప్ర‌భంజ‌న‌మే.. అది సినిమా ఇండ‌స్ట్రీ అయినా., పోలిటిక్స్ అయినా.. జ‌రిగే ప‌వ‌ర్‌స్టార్‌, ఆయ‌న అభిమాను రియాక్ష‌న్‌లో పెద్ద‌గా తేడా ఉండ‌దు అంతా సేమ్ టూ సేమ్‌.. రెండు చోట్ల ప్ర‌త్య‌ర్ధుల్ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యం.. ఇక రెండు చోట్ల ఆయ‌న కెపాసిటీని కొత్త‌గా నిరూపించుకోవాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. ఇప్ప‌టికే తెలుగు ప్ర‌జ‌ల న‌ర‌న‌రాన ప‌వ‌నిజం పాకిపోయింది.. ఆయ‌న పార్టీ జ‌న‌సేన ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాలు విసురుతోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేస్తుందా..? గెలుస్తుందా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ సేన విస్త‌రణే బ‌దులు.. ఇప్పుడు మారు మూల ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ప‌వ‌నిజం జెండా పాతేసింది.. ఉడుకు ర‌క్తం ప్ర‌వ‌హించే ప్ర‌తి తెలుగువాడు ప‌వ‌ర్‌స్టార్ ఆరాధ‌కులే.. పోరాడే ప్ర‌తి ఒక్క‌డు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లే.. అధినేత ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం, పిలుపు లేకుండానే పార్టీ విస్త‌ర‌ణం ప్ర‌భుత్వాల్ని శాసించే స్థాయికి పెరిగిపోయింది.. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు తేడా లేకుండా, వీధి వీధినా వెలుస్తున్న ఈ ప‌వ‌నిజం గ‌ద్దెలే అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నాలు..

ఒక‌ప్పుడు జ‌నం గుండెల్లో చిర‌స్థాయిగా నిల‌చిన నేత‌ల‌కు మాత్ర‌మే ఇలాంటి గ‌ద్దెలు, వాటిపై జెండాలు క‌ట్టేవారు. ఇప్పుడు ఆ సంస్కృతి విగ్ర‌హాల వైపు తిర‌గ‌డం, పార్టీల నేత‌లు ఒక‌రికి ఒక‌రు పోటీ ప‌డి సొంత ఖ‌ర్చుల‌తో వీధి వీధినా బొమ్మ‌లు ఏర్పాటు చేయించుకోవ‌డం ప‌రిపాటిగా మారింది.. జ‌న‌సేన‌తో మ‌ళ్ళీ పాత సంస్కృతి., నాయ‌కుడ్ని నాయ‌కుడిగా ప్రేమించ‌డం., ఆయ‌న కోసం ఏమైనా చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు సందేశాన్ని పంప‌డ‌మే ల‌క్ష్యంగా ఈ మిద్దెలు వెలుస్తున్నాయి.. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు తేడా లేకుండా వీధి వీధినా వెలుస్తున్న గ‌ద్దెలు, ప్ర‌తి చోట ఇప్ప‌టికే గ‌ద్దెనెక్కి అధికారం చెలాయిస్తున్న నేత‌ల్ని ప్ర‌శ్నిస్తున్నాయి.. జ‌న‌సేన వ్యాప్తిని తెలియ‌జేస్తున్నాయి..

ప్ర‌త్య‌ర్ధుల్లో గుబులు రేపే వార్తే అయినా., క‌ళ్ల ఎదుట క‌న‌బ‌డుతున్న సాక్ష్యాల్ని ఆమోదించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.. దీంతో వేగంగా వేళ్లూనుకుంటున్న ప‌వ‌ర్‌స్టార్ పార్టీని పెకిలించే శ‌క్తుయుక్తుల స‌మీక‌ర‌ణ‌లో వైరీ ప‌క్షాలు బిజీగా ఉన్నాయి.. అయినా పేరులోనే ప‌వ‌ర్ నింపుకున్న ప‌వ‌న్‌ని ట‌చ్ చేయాల‌ని చూస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసుగా.. బీ..కేర్‌..ఫుల్‌..

Share This:

1,389 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + 10 =