Home / జన సేన / వీర తెలంగాణ పోరాట స్ఫూర్తి ఉత్త‌రాంధ్ర గ‌డ్డ‌పై చూశా-జ‌న‌సేనాని.

వీర తెలంగాణ పోరాట స్ఫూర్తి ఉత్త‌రాంధ్ర గ‌డ్డ‌పై చూశా-జ‌న‌సేనాని.

విభ‌జ‌న హామీలు అమ‌లు, ప్ర‌త్యేక హోదా సాధ‌న‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల అధ్య‌య‌నం ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా ఉత్త‌రాంధ్ర‌లో పోరాట యాత్ర చేప‌ట్టిన జ‌న‌సేనాని., రంజాన్ పండుగ సంద‌ర్బంగా ఇచ్చిన విరామంలో., త‌న ప‌ర్య‌ట‌న తాలూకు అనుభ‌వాల‌ను ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా పంచుకుంటున్నారు.. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి మొద‌లైన ఉత్త‌రాంధ్ర యాత్ర‌లో, ఆయ‌న గుర్తించిన ప్ర‌ధాన అంశాల‌ని ఒక్క మాట‌లో బ‌య‌ట‌పెట్టారు.. అదే ఉత్త‌రాంధ్రుల ఆత్మ‌బ‌లం.. ఎవ్వ‌రికీ లొంగ‌ని ఆత్మ‌బ‌లం, పోరాట స్ఫూర్తి.. అద్భుత‌మ‌నీ ఆయ‌న అభివ‌ర్ణించారు..

Bharatiya Aathma (The soul of our Motherland) will never surrender to such exploitive Pressures & Measures and I could see that tremendous Soul-Force in the Land of UttaraAndhra and also it reminded me of Fighting Spirit of Veera-Telangana.

అంటే..
భార‌తీయ ఆత్మ‌( మ‌న మాతృభూమి యొక్క ఆత్మ‌) దోపిడీ శ‌క్తుల‌కి, వారి ప‌న్నాగాల‌కు ఏనాడు లొంగ‌దు,మోక‌రిల్ల‌దు కూడా.. అటువంటి అద్భుత‌మైన ఆత్మ‌బ‌లాన్ని నేను ఉత్త‌రాంధ్ర గ‌డ్డ‌పై క‌ళ్లారా చూశాను.. అది నాకు వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని మ‌రోసారి గుర్తు చేసింది.. అనేది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్వీట్ సారాంశం..

రెండు వారాల ప‌ర్య‌ట‌న‌లో ఉత్త‌రాంధ్ర ఖ‌చ్చితంగా వెనక్కి నొక్క‌బ‌డింది అని తెలుసుకున్న జ‌న‌సేన అధినేత‌., అదే స‌మ‌యంలో సోంపేట ధ‌ర్మ‌ల్ పోరాటం గానీ, కొవ్వాడ అణువిద్యుత్ పోరాట గానీ, విశాఖ ఏజెన్సీ బాక్సైట్ ఉద్య‌మంగానీ., పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక‌త నుండి పుట్టి రాజ‌కీయాల‌కి అతీతంగా, రాజ‌కీయ నాయ‌కులికి దూరంగా సాగిన తీరుని గుర్తించారు.. అందుకే అక్క‌డ భార‌తీయ ఆత్మ‌, డోపిడి శ‌క్తుల‌కి, వారి ప‌న్నాగాల‌కు ఏనాడు లొంగ‌ద‌న్న ప‌దాన్నీ, వీర తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తి అన్న ప‌దాన్ని ఉత్త‌రాంధ్ర గ‌డ్డ‌కి ఆపాదించారు..

అయితే రాజ‌కీయాల‌కి అతీతంగా ప్ర‌జ‌ల కోసం ఉద్య‌మిస్తున్న శ‌క్తులు, మేధావులు ఎవ‌రైతే ఉన్నారో., వారంతా జ‌న‌సేన వారి కోసం నిల‌బ‌డుతుంద‌న్న న‌మ్మ‌కాన్నివ్య‌క్త‌ప‌రిచి, ప్ర‌తి చోటా జ‌న‌సేనానికి తోడుగా క‌దిలారు.. ఇది ఓ బ‌ల‌మైన మార్పుకి సంకేత‌మే.. అందుకే ఉత్త‌రాంధ్ర ఉద్య‌మ స్ఫూర్తికి తాను తోడ‌వుతాన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అదే గ‌డ్డ‌పై మాటిచ్చారు..

Advertisement.

Share This:

1,042 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × three =