Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / వెంక‌య్య టూ మోడీ వ‌యా సుజ‌నా.. అనంత‌లో ప‌వ‌న్ కౌంట‌ర్ ఎటాక్‌..

వెంక‌య్య టూ మోడీ వ‌యా సుజ‌నా.. అనంత‌లో ప‌వ‌న్ కౌంట‌ర్ ఎటాక్‌..

అనంత‌పురం.. క‌ల్లూరి సుబ్బారావు వేదిక‌.. స‌మ‌యం ఖ‌చ్చితంగా 4 గంట‌లు.. నల్ల‌ని దుస్తుల‌తో స్టేజీ మీద‌కి వ‌చ్చిన జ‌న‌సేనాని.. ఆశేష జ‌న‌స‌మూహాన్ని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం., ఆధ్యంతం కొత్త స్ట‌యిల్లో సాగింది.. మీకు రాజ‌కీయాలు తెలియ‌దు అంటూ ప్ర‌త్య‌ర్ధులు చేస్తున్న ప్ర‌తి విమ‌ర్శ‌ను ఆయ‌న‌., పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేసి మ‌రీ తిప్పికొట్టారు.. ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ ద‌గ్గ‌ర నుంచి అనంత నీటి స‌మ‌స్య వ‌ర‌కు అన్ని అంశాల‌ను ప్ర‌స్థావించిన ఆయ‌న‌., ప్ర‌భుత్వ‌, పాల‌కుల నిర్ల‌క్ష్యాల‌ను ఎత్తిచూపారు..

ఈ సారి కూడా మొద‌టి కౌంట‌ర్ కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడికి ప‌డింది.. ప్యాకేజీ అబ్బో సూప‌ర్ అని చెప్పుకుంటూ స‌న్మానాలు చేయించుకుంటున్న వెంక‌య్య‌కి అస‌లు ప్యాకేజీ ఎంతో స్ప‌ష్ట‌త ఉందా అని ప్ర‌శ్నించారు.. వెంక‌య్య 2.25 ల‌క్ష‌ల కోట్లు అంటే., అరుణ్‌జైట్లీ 2.03 ల‌క్ష‌ల కోట్లు అంటారు.. ఎది క‌ర‌క్టో చెప్పాల‌న్నారు.. చ‌ట్ట‌బ‌ద్ద‌త లేని ప్యాకేజీకి ఏ అంకె చెబితే ఏంటి అనుకుంటున్నారా..? ఇంకా ఎన్నాళ్లిలా మోసం చేస్తారంటూ గ‌ద్దించారు.. ఈ వంచ‌న ఇంత‌టితో ఆగ‌కుంటే.. ఇదే వేదిక నుంచి మ‌రో మ‌హాప్ర‌స్థానం ప్రారంభ‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు..

ప్ర‌ధాని మోడీపై త‌న‌కు న‌మ్మ‌కం ఉందంటూనే., ఇచ్చిన మాట త‌ప్పితే మాత్రం ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌న‌న్నారు.. ప్యాకేజీ, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు మోడీ అపాయింట్‌మెంట్ అడిగాన‌న్న ఆయ‌న‌., అది ఇంకా రాలేద‌న్నారు.. సుజ‌నా చౌద‌రి హోదా గురించి చేసిన వ్యాఖ్య‌ల‌కు ఘాటుగానే బ‌దులిచ్చారు.. మీరు ఉద‌హ‌రించిన ఎయిరిండియా విమానాలు గాల్లోకి ఎగురుతాయి.. కానీ మీ ప్యాకేజీ మాత్రం ఎక్క‌డిది అక్క‌డే నిల‌చిపోయింది.. చ‌ట్ట‌బ‌ద్ద‌త లేక నేల చూపులు చూస్తోంది.. గుర్తుపెట్టుకోండి.. ఇలాంటి వంచ‌న‌లు ఇక సాగ‌వ్ అంటూ హెచ్చ‌రించారు.. ఇంకా ఇదే కొన‌సాగితే చూస్తూ ఊరుకోం.. కూల్చేస్తాం.. పాల‌కుల పీఠాల్ని నిర్ధాక్ష‌ణ్యంగా కూల్చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు..

ఎక్క‌డా ప‌వ‌ర్ త‌గ్గ‌కుండా సాగిన జ‌న‌సేనాని స్పీచ్‌లో అనంత స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టారు.. 100 టిఎంసిల నీరు క‌రువు సీమ‌లో పారించే ప్ర‌ణాలిక‌లు రూపొందించాల‌ని పాల‌కుల్ని డిమాండ్ .. ఇక్క‌డి జ‌నం స‌మ‌స్య‌లు తీర్చేందుకు ఓ స‌త్య‌సాయి, ఓ మేరీజాన్ లాంటి వాళ్లు రావాలా.. ఎక్క‌డెక్క‌డి వారో క‌రువుసీమ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తుంటే., ఓట్లు వేయించుకున్న మీరేం చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు..

Share This:

1,121 views

About Syamkumar Lebaka

Check Also

వైఛీ(సి)పి చేస్తున్న ప్రచారంలో “విషయము”న్నదా లేక “విషము”న్నదా?

పాపం!!! అందినట్లే అంది జారిపోతున్న సీఎం కుర్చీ కోసం జగన్ గత గోమ్మిది సంవత్సరాలుగా పడుతున్న మనోవేదన అర్ధం చేసికోలేనిదే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − seventeen =