Home / జన సేన / వెన్నుపోట్ల‌తో సిఎం కావాల‌నుకోవ‌ద్దు.. నారా లోకేష్‌కి జ‌న‌సేనుడి హిత‌వు..

వెన్నుపోట్ల‌తో సిఎం కావాల‌నుకోవ‌ద్దు.. నారా లోకేష్‌కి జ‌న‌సేనుడి హిత‌వు..

జ‌న‌సేన పోరాట యాత్ర‌లో ప్ర‌తి అడుగులో ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి చ‌లించిపోయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆ క‌ష్టానికి కార‌ణ‌మైన పాల‌కులను న‌డిరోడ్డు మీద నిల‌బెట్టి క‌డిగేస్తున్నారు.. నిడ‌ద‌వోలు స‌భ‌లో ప్ర‌జ‌ల బాధ‌లు వింటుంటే క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన జ‌న‌సేనాని., గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో చెత్త పేరుకుపోయి జ‌న‌జీవ‌నం దుర్భరంగా మారిపోతోందని వాపోయారు.. చెత్త‌కుప్ప‌ల చెంత జీవ‌నం, దోమ‌లు, ఈగ‌ల మ‌ధ్య ఆహారం తీసుకోవాల్సిన దుస్థితి క‌ల్పించిన ప్ర‌భుత్వాలు సిగ్గుతో త‌ల‌దించుకోవాలంటూ ధ్వ‌జ‌మెత్తారు.. జ‌నం ఎలా పోయినా మా ప‌ద‌వులు మాకు ఉంటే చాల‌న్న‌ట్టు పాల‌కుల శైలి ఉంద‌ని ఆరోపించారు.. సిఎం త‌న‌యుడు లోకేష్ ముఖ్య‌మంత్రి కావ‌చ్చ‌ని., అయితే అది వెన్నుపోటు పొడిచి కారాద‌న్నారు.. తాత ఎన్టీఆర్‌లా 60 ఏళ్ల త‌ర్వాత కావ‌చ్చంటూ ఎద్దేవాచేశారు.. ఎన్టీఆర్ ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు చూసి ఆ స్థాయికి వ‌చ్చార‌న్న ప‌వ‌న్‌., లోకేష్ తండ్రిని ఆద‌ర్శంగా తీసుకుని వెన్నుపోటు పొడ‌వాల‌నుకోవ‌ద్ద‌ని హిత‌వుప‌లికారు.. స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్శిటీలో చ‌దువుకుంటు చాల‌ద‌నీ., అదే యూనివ‌ర్శిటీలో చ‌దివిన అమెరికా అధ్య‌క్షుడు కెన‌డీని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.. దేశం నాకేమి ఇచ్చింది అని కాక‌., దేశానికి నేనేమి ఇచ్చాన‌న్న కెన‌డీ మాట‌ల్ని లోకేష్ గ్ర‌హించాల‌ని సూచించారు.. అయితే లోకేష్ మాత్రం దేశం మీద ప‌డి ఎంత జుర్రుకుందామో అన్న ఆలోచ‌న‌లోనే ఉన్నారంటూ విమ‌ర్శించారు..

వెన్నుపోటు త‌ప్పో..ఒప్పో.. మీ అమ్మ‌గారిని అడ‌గండి..

వెన్నుపోటు రాజ‌కీయాలు మా కుటుంబానికి అల‌వాటేగా అని సరిపెట్టుకుంటే కుద‌ర‌ద‌ని జ‌న‌సేనాని హెచ్చ‌రించారు.. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో ఎంతో బాధ‌ప‌డ్డార‌న్నారు.. ఇప్పుడు అలా కుద‌ర‌ద‌న్న ఆయ‌న ., ఎదురుగా కౌగిలించుకుని, వెనుక నుంచి పొడిచేస్తామంటూ ప‌డేవాళ్లు లేరంటూ చుర‌క‌లు అంటించారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌మంటే జ‌గ‌న్ నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌తార‌నంటూ విప‌క్ష నేత‌కీ చుర‌క‌లు అంటించారు.. నా జీవితంలో ర‌హ‌స్యాలు అంటూ ఏమీ లేవ‌న్న ప‌వ‌న్‌., లోకేష్ కూడా న‌న్ను తిట్టేస్తున్నార‌ని ఆరోపించారు.. నా త‌ల్లిని కూడా అన‌కూడ‌ని మాట‌లు అనిపించారు.. ఒక్క‌సారి మీ అమ్మ‌గారిని అడ‌గండి నేను ఇలా తిట్టించాను.. త‌ప్పా.. ఒప్పా… అని సూచించారు..

చివ‌ర్లో కోట్లు పెట్టి నియోజ‌క‌వ‌ర్గాల్ని కొనేద్దామ‌మ‌నుకుంటున్నారేమో., అదేం కుద‌ర‌దు.. ఇది న‌వ‌త‌రం యువ‌త భ‌గ‌భ‌గ మండే యువ‌త‌.. వీళ్ల‌ని కొన‌లేర‌ని గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చ‌రించారు..జోరు వాన‌లో నిడ‌ద‌వోలు జ‌నం జ‌న‌సేనుడా నీ వెంటే మేమంటూ నిన‌దించారు..

Share This:

1,738 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =