Home / పవన్ టుడే / వెస్ట్ నుంచి జ‌న‌సేనానికి ఓటు.. ప‌వ‌న్‌, పార్టీ అడ్డాగా ఏలూరు..!

వెస్ట్ నుంచి జ‌న‌సేనానికి ఓటు.. ప‌వ‌న్‌, పార్టీ అడ్డాగా ఏలూరు..!

img-20161031-wa0015

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌నున్నారు.. అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ప‌వ‌న్ పూర్తిగా త‌న అడ్డాను హైద‌రాబాద్ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ చేసేయాల‌ని నిర్ణ‌యించారు.. అందుకు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రాన్ని సెల‌క్ట్ చేసుకున్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి ఇప్ప‌టికే సై అన్న ఆయన‌., ఇక మీద‌ట ఆ ద‌శ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు.. పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేసేది ఏపీలోనే కాబ‌ట్టి., అక్క‌డే త‌న అడ్డా ఓపెన్ చేసి., ప్ర‌త్య‌ర్ధుల‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యార‌వ్వాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌.. అందుకోసం ప‌క్కా వ్యూహం సిద్ధం చేసుకున్న జ‌న‌సేనాని., ప్ర‌స్తుతం హైద‌రాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉన్న త‌న ఓటు హ‌క్కుని., ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్ర ఏలూరుకి మార్చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు.. అందుకు రెండు కార‌ణాలు ఉన్నాయి.. త‌న తండ్రి, తాత‌ల సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి కావ‌డం ఒక‌టి అయితే., రెండోది అక్క‌డి నుంచి భారీగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానులు., ఆయ‌న్ని క‌ల‌సిన సంద‌ర్బంగా త‌మ జిల్లా నుంచే ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌స్థానం కొన‌సాగాల‌ని అభ్య‌ర్ధించారు.. వెస్ట్ నుంచి సోమ‌వారం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆయ‌న అభిమానులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి ప‌వ‌న్‌ని క‌లిశారు.. ఈ సంద‌ర్బంగా వారు కోరిన కోరిక మేర‌కు., ఓటు హ‌క్కుని హైద‌రాబాద్ నుంచి ఏలూరుకి మార్చేందుకు అవ‌స‌ర‌మైన ఫార్మాలిటీస్ చూడాల‌ని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు.. అంతేకాదు., త‌న నివాసం, పార్టీ కార్యాల‌యాల‌కు అనువైన ఓ ఇంటిని కూడా చూడ‌మ‌న్నారు.. ప్ర‌స్తుతం చేతిలో ఉన్న మూడు సినిమాల‌కి సంబంధించి షూటి్ంగ్ కోసం నిర్మాత‌ల‌కి ఇచ్చిన డేట్స్ మినహా., మిగిలిన రోజుల్లో ప‌వ‌న్ ప‌శ్చిమ నుంచి పార్టీ కార్య‌క‌లాపాలు న‌డిపించ‌నున్నారు..

సో.. ఇక 2019 ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌త్య‌ర్ధుల‌కి ప‌వ‌న్ ప‌క్క‌లో బ‌ల్లెం కానున్నారు.. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌త్యేక హోదా పోరాటంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జ‌న‌సేనాని., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మ‌రింత దృష్టి సారించాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏదైనా స‌మ‌స్య విష‌యంలో ప‌వ‌న్ క‌ల్పించుకున్నారంటే ప్ర‌భుత్వాలు ఉలిక్కి ప‌డుతున్నాయి.. అయ‌న‌తో పెట్టుకునే ద‌మ్ము లేక‌., వెంట‌నే ప‌రిష్కార మార్గాలు వెతికేస్తున్నాయి.. ఆయ‌న హైద‌రాబాద్‌లో ఎక్క‌డుంటాడో తెలియ‌ని ప‌రిస్థితుల్లోనే పాల‌కుల‌కి కునుకు లేకుండా చేస్తున్న జ‌న‌సేనాని., ఏలూరుకి మ‌కాం మారుస్తున్నార‌న్న వార్త‌., అధికార, విప‌క్షాల‌కు ముచ్చెమ‌ట‌లు పోయిస్తోంది.. పాల‌న ప‌రంగా టీడీపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో స‌రైన అభిప్రాయం లేక‌పోవ‌డం., విప‌క్షం ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డ‌డంలో పూర్తిగా విఫ‌లం కావ‌డంతో., ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయం వైపు చూస్తున్నారు.. ఈ త‌రుణంలో జ‌న‌సేనాని ఏపీ ఏంట్రీ ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందోనన్న టెన్ష‌న్ అన్ని పార్టీల్లో మొద‌లైంది.. మ‌రి పేరులోనే ప‌వ‌ర్ నింపుకున్న మా సేనాని వ‌చ్చేస్తున్నాడు., కాచుకోండి..

Share This:

1,477 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − six =