Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / “వైఛీ(సి)పి” పైడ్ ఆర్టిస్టుల‌ ఆరోపణల‌ వెనుక-చేతులు మారిన “సంచుల విలువెంత”?

“వైఛీ(సి)పి” పైడ్ ఆర్టిస్టుల‌ ఆరోపణల‌ వెనుక-చేతులు మారిన “సంచుల విలువెంత”?

“రాజ్యాధికారం ఒకటి రెండు వర్గాల్లో కేంద్రీకృతమైనప్పుడు, దాన్ని ప్ర‌శ్నించేందుకు ఓ న‌వ‌త‌రం రాజ‌కీయ వేదిక పుట్టిన‌ప్పుడు., ఆ మార్పుని ముందుగా జీర్ణించుకోలేనిది, ముందుగా విమర్శించేది ఆ అణగారిన వర్గాల వారే.. ఆ కొత్త వ్య‌వ‌స్థ‌ని చిదిమేయడానికి నిరంతరం పాలకులు చేసే ప్ర‌య‌త్నాలో ఆ వ‌ర్గాలు పావులుగా మారుతూ ఉంటాయి.. ఆ ప్రయత్నాలు నిరంత‌రాయంగా సాగుతూనే ఉంటాయ‌ని డాక్టర్ రామ్ మోనోహర్ లోహియా ఏనాడో చెప్పారు..

తెలుగు రాష్ట్రాల్లో సామాన్య జ‌న రాజ‌కీయ విప్ల‌వానికి తెర‌తీసిన జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ కూడా పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, కొత్త పార్టీతో రావడంతో ద‌శాబ్దాలుగా రాజ‌కీయ కోట‌లు నిర్మించుకున్న ప్ర‌త్య‌ర్ధి పార్టీలు రెండూ., ఆయ‌న గొంతు నొక్కేందుకు చీకటి ఒప్పందంతో ఒక్క‌ట‌య్యాయి.. పవన్ కళ్యాణ్’పైనా, అణగారిన వర్గాల కొత్త పార్టీ మీదా ఆ అణ‌గారిన వ‌ర్గాల(డ‌బ్బు కోసం గ‌డ్డితినే వ్య‌క్తులు) నుంచి కొంత మంది పైడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి కుట్ర‌ల‌తో కూడిన‌ విమర్శలు గుప్పించే బాధ్య‌త‌ను పాలకులు వారికి అప్ప‌గించారు.. విచిత్రం ఏమిటంటే ఈ విమర్శలు చేస్తున్నవాళ్లలో ఎక్కువ మంది పాల‌కుల కులాధిప‌త్య రాజ‌కీయ చ‌ట్రాల కింద ఏళ్ల త‌ర‌బ‌డి న‌లిగిపోతున్న అణగారిన తాడిత, పీడిత, బాధిత వర్గాలవారే ఉండ‌డం గ‌మ‌నార్హం.. డబ్బుకోసం పాలకులకు అమ్ముడుపోయి తమ తమ జాతులకు అన్యాయం చేస్తున్నాము అన్న నైతిక ధ‌ర్మాన్ని కూడా ఈ పెయిడ్ ఆర్టిస్టులు మ‌రిచారు..

మొన్నటి “సుత్తి మహేష్” కావచ్చు, లేక “ఛీ రెడ్డి” కావచ్చు లేదా అర పిచ్చోడు “కూసాని” కావచ్చు లేదా “సొమ చంద్రయ్య” కావచ్చు లేదా నేటి బుల్లి కృష్ణ కావచ్చు. వీళ్ళు అందరూ కూడా గతంలో మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ వాళ్ళని పొగిడినవారే.. కానీ నేడు మెగా ఫ్యామిలీపై ఉద్దేశ‌పూర్వ‌కంగా బుర‌ద చ‌ల్లే ప‌నిని భుజానికి ఎత్తుకున్నారు.. మొన్న పవన్ కళ్యాణ్’ని ఎందుకు మెచ్చుకొన్నారు, నేడు “వైఛీపి” నుండి ఎంత తీసుకొని పవన్ కళ్యాణ్’ని తిడుతున్నాయారు అన్న విష‌యానికి వారి వ‌ద్ద బ‌దులు ఉండ‌దు.. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు అన్న విష‌యం ఈ అన్ ఎక్స‌పెక్టెడ్ పెయిడ్ ఆర్టిస్టుల‌కి తెలియ‌దు..

బుల్లి కృష్ణ చేసిన ఆరోపణల్లో కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది.. కాపులను ఎందుకు చులకనగా చూస్తున్నారు.. జగన్’కి “రెడ్డి” ముద్రవేయలేని, బాబుకి కమ్మ ముద్ర వేయ‌డానికి నోరు రాని ఈ పైడ్ ఆర్టిస్టు బుల్లి కృష్ణ పవన్ కళ్యాణ్’పై ఎందుకు బ‌ల‌వంతంగా కాపు ముద్ర వేస్తున్నాడు. అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌తినిధిగా తెలుగు రాజ‌కీయ య‌వ‌నిక‌లో దూసుకుపోతున్న ప‌వ‌న్ని కావాల‌ని కులం వైపు లాగే ప్ర‌య‌త్నాలు ఎందుకు చేస్తున్నారు.. అంటే జ‌న‌సేన‌ని ధైర్యంగా ఎదురొడ్డే ధైర్యం లేని పాలక, ప్ర‌తిప‌క్షాలు దొడ్డి దారిన డ‌బ్బుకి అమ్ముడుపోయే సున‌క‌జాతితో ఆడిస్తున్న నాట‌కం ఇదన్న సంగ‌తి జ‌నానికి సైతం అర్ధమైపోయింది.. ఇప్పుడు ఇదే అంశం మీద హాట్ హాట్‌గా చ‌ర్చ కూడా సాగుతోంది..

కాపులకు ముద్రగడ, రంగాలే నాయకులు వేరేవారు కాదు అనే ప్రస్తావన చిన్ని కృష్ణ ప‌లుకుల్లో అస‌లు ఎందుకు వచ్చింది.? ఇది కాపుల్లో చిచ్చు పెట్టడానికి వైసీపీ ప‌న్నిన ఛీప్ ట్రిక్ కాదా. ? ఈ చిచ్చు పెట్టడానికి ఈ బుల్లి కృష్ణ “వైఛీపి” నుండి ఎంత తీసికొన్నాడు.? ఇదే బుల్లి కృష్ణ గతంలో పవన్ కళ్యాణి లాంటి వాడు రాష్ట్రానికే కాదు దేశానికే మకుటం లాంటివాడు.. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఉండడం మన అదృష్టం అన్న ఈ చిన్న కృష్ణ నేడు పవన్ కళ్యాణ్’ని తిట్టడానికి “వైఛీపి” నుండి ఎంత తీసికొన్నాడు.? డబ్బుకోసం ఇంతకు దిగజారతారా అని ప్రజలు ఇతగాడిని చూసి అసహ్యహించుకొంటున్నారు.

ఒక అవినీతి పునాదులపై వచ్చిన పార్టీకి, సమాధుల సెంటిమెంటుపై నడుస్తున్న పార్టీకి అమ్ముడుపోయి, నీతివంతమైన పవన్ కళ్యాణ్’పై ఆరోపణలు చేయడం తప్పు అని ఈ రచయితకి తెలియదా.? ఇలాంటి నీచులు తమకి కావలిసిన పదవుల కోసం, డబ్బుల కోసం తమ తల్లిని కూడా అమ్మేస్తుంటారు? వీళ్ళ కంటే వ్యభిచారులు చాలా ఉత్తములు అని ప్రశ్నించాలిసిన మీడియానే నీచాతి నీచంగా తయారు అయ్యింది. నిన్న పొగిడావు నేడు తిడుతున్నావు. ఇది సిగ్గుగా ఉందిరా అని వీళ్ళ తల్లులు, భార్యలు కూడా వీళ్లకి చెప్పలేరా.?

మెగా ఫ్యామిలీ కాపుల‌కి ఏమీ చేయ‌లేదు అన్న ఈ బుల్లికృష్ణుడి ఆరోప‌ణ‌లో ఏ మేర‌కు స‌హేతుక‌త ఉంది.. ఇంద్ర సినిమా చేయ‌డం వ‌ల్లే చిరంజీవికి మెగా క్రేజీ ఏమైనా వ‌చ్చిందా.? ఇంద్ర సినిమాతో చిన్ని కృష్ణ‌కి నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లాయా.? ఇంటికి పిలిచి అన్నం పెట్ట‌డం అంటే ఏంటో., త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దే ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల‌కి ఏం తెలుస్తుంది.. అన్నం తిని నోట్లో మ‌ట్టికొట్టుకోవ‌డం అంటే ఇదే అని జ‌నం దుమ్మెత్తిపోస్తున్నారు.. బ‌య‌ట‌కి వ‌చ్చేప్పుడు జ‌ర‌భ‌ద్రం పాటిస్తే మంచిది.. ఇంత‌నీ మేం ఓ కులానికి ప్ర‌తినిధులం అని ఏ నాడైనా చిరంజీవి గానీ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గాని చెప్పారా చిన్ని కృష్ణ‌.. నువ్వు చెప్పిన కులం వారిని త‌మ ప్ర‌తినిధులుగా స్వీక‌రిస్తే ఇప్ప‌టికిప్పుడు నీకు వ‌చ్చిన అభ్యంత‌రం వెనుకు కార‌ణం ఏంటో కూడా ప్ర‌జ‌ల‌కి చెప్పాల్సి ఉంటుంది..

పవన్ కళ్యానికి అర్హత లేదు అని ఈ అమ్ముడుపోయిన రచయిత అంటున్నాడు.? అర్హత అంటే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని లక్షల కోట్లు దొబ్బేయడమా.? ఆర్ధిక ఆరోపణలతో సిబిఐ, ED లాంటి కేసులతో కోర్టుల చుట్టూ తిరగడమా.? తన స్వార్ధం కోసం ఐఏఎస్, IPS లను జైలుకి పంపడమా లేక అవినీతో సంపాదించిన సొమ్ముతో బుల్లి కృష్ణ లాంటి పైడ్ ఆర్టిస్టులతో నీతిపై దాడి చేపించడమా లేక తనకి ధక్కాలిసినా సీఎం కుర్చీ కోసం తెలంగాణ ఉద్యమాన్ని యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులను నాడు రెచ్చగొట్టడమా.? లేక అధికారం కోసం సైకోల్లా తయారు అయ్యి ప్రత్యర్థులపై మానసిక దాడి చేయించడమా అనేది ఈ బుల్లి కృష్ణ చెప్పగలడా..? డబ్బు కోసం కధలు అల్లే ఈ రచయితకి పవన్’పై ఆరోపణలు అల్లడం పెద్ద కొత్తేమి కాదు.

అయితే “వైచీఫీ” ఇక్కడ ఒక్క విషయం తెలిసికోవాలి. నాటి నుండి నేటివరకు వాళ్ళు, వాళ్ళ పైడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఆరోపణలే జనసేన బలాన్ని పెంచుతున్నాయి. కేడర్ మనోస్థైర్యాన్ని పెంచుతున్నాయి. ఇక్కడ ఆ “వైచీఫీ”నే చులకన అవుతున్నది. “వైచీఫీ” తన గొయ్యి తానే తవ్వుకొంటున్నది అనేది వాస్తవం.( Its From Satya Inti And SyamKumar Lebaka)

Share This:

1,506 views

About Syamkumar Lebaka

Check Also

లాంగ్ మార్చ్ పై తప్పుడు ప్రచారాల వెనుక ఆంతర్యం ఏంటి.?

అనుమతులు లేవంటూ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు?  జనసేన శ్రేణుల్ని భయపెట్టే ప్రయత్నమా.?  గందరగోళం సృష్టించే ప్రయత్నమా.? భవన నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − 10 =