Home / జన సేన / వైసీపీకి ఓటేస్తే టిఆర్ఎస్‌కి ఓటేసిన‌ట్టే.. కేసీఆర్‌ని గెలిపించిన‌ట్టే-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

వైసీపీకి ఓటేస్తే టిఆర్ఎస్‌కి ఓటేసిన‌ట్టే.. కేసీఆర్‌ని గెలిపించిన‌ట్టే-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ దోస్తీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ధ్వ‌జ‌మెత్తారు.. కృష్ణా జిల్లాలో జ‌రిగిన జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావం స‌భ‌ల్లో పాల్గొన్న ఆయ‌న‌., తెలంగాణ‌లో ఆంధ్రులు రాజ‌కీయాలు చేయ‌రాద‌న్న కేసీఆర్‌., ఆంధ్రాలో తెలంగాణ వారు ఎలా రాజ‌కీయాలు చేస్తార‌ని ప్ర‌శ్నించారు.. చంద్ర‌బాబుకి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే.. నేరుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచి చూపించాలి త‌ప్ప వైసీపీ లాంటి పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మేంట‌ని నిల‌దీశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రుల్ని ద్రోహులు, దుర్మార్గులుగా చిత్రించిన కేసీఆర్‌తో దోస్తీని ఆంధ్రులు ఎలా జీర్ణించుకుంటారో వైసీపీ త‌రుపున పోటీ చేస్తున్న అభ్య‌ర్ధులే చెప్పాల‌న్నారు.. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య స‌మ‌స్య‌ని ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌మ‌స్య‌గా చూపిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.. ఎన్నిక‌ల కోసం మాత్ర‌మే కేసీఆర్‌, జ‌గ‌న్‌లు క‌లుస్తార‌ని ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడాల్సి వ‌స్తే మాత్రం నోరు రాద‌న్నారు ప‌వ‌న్‌.. ఆంధ్రాలో బీసీలుగా ఉన్న కొన్ని కులాలు తెలంగాణ విభ‌జ‌న అనంత‌రం ఓసీలుగా మారిపోతే., ఆ స‌మ‌స్య ప‌రిష్కారం గురించి ఏనాడైనా జ‌గ‌న్ కేసీఆర్‌ని అడిగారా అని ప్ర‌శ్నించారు.. ఇదే జ‌గ‌న్ వ‌రంగ‌ల్ వెళ్తే విద్యార్ధుల‌తో రాళ్లు వేయించిన కేసీఆర్‌, ఇప్పుడు అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని హామీ ఇవ్వ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. జ‌గ‌న్ లాంటి నాయ‌కుడు తెలంగాణ‌కి వ‌ద్దు గానీ., ఆంధ్రాకి కావాలా అంటూ వాగ్భాణాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.. కేసీఆర్ చెబితే జ‌గ‌న్‌కి ఓటు వేయ‌డానికి ఆంధ్రా ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వం లేని వారు ఏమీ కాద‌ని, ఎక్క‌డ వైసీపీ అభ్య‌ర్ధిని గెలిపించినా ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం పోయిన‌ట్టేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. వైసీపీ అభ్య‌ర్ధుల్ని గెలిపిస్తే ఆంధ్రుల్ని ద్రోహులంటూ తిట్టిన కేసీఆర్‌ని గెలిపించిన‌ట్టేన‌ని, వైసీపీకి ఓటేస్తే టిఆర్ ఎస్‌కి ఓటేసిన‌ట్టేన‌న్న విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని తెలిపారు..

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే., అభ్య‌ర్ధుల్ని కూడా హైద‌రాబాద్‌లో ఉండే ఎంపిక చేస్తున్నారు.. నాడు-నేడు ఎప్పుడూ టిఆర్ఎస్‌ని తిట్టాలంటే భ‌య‌మే.. హైద‌రాబాద్‌లో ఉన్న ఆస్తులు పోతాయ‌న్న భ‌యం.. కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక్క‌డికి మాత్ర‌మే హైద‌రాబాద్ న‌డిబొడ్డున నిల‌బ‌డి ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌శ్నించే స‌త్తా ఉన్న‌వాడ‌ని తెలిపారు.. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు తెలంగాణ‌లో ఎంపి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా.? అని చాలా మంది ప్ర‌శ్నించారు.. జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు, బీఎస్పీ కూట‌మి త‌రుపున మేం 12 లోక్‌స‌భ స్థానాల‌కి అభ్య‌ర్ధుల్ని నిల‌బెట్టాం.. మ‌రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎందుకు పోటీ చేయ‌లేదో చెప్పాల‌న్నారు.. ఓ రిజిస్ట‌ర్డ్ పార్టీ అయ్యి ఉండి ఎందుకు ఒక్క అభ్య‌ర్ధిని కూడా బ‌రిలోకి దించ‌లేదో చెప్పాల‌న్నారు.. టిఆర్ఎస్‌తో వైసీపీకి దోస్తీ లేక‌పోతే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధుల్ని నిల‌బెట్టి చూపాల‌న్నారు.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గారిలాగే నాకు కేసీఆర్‌తో పాటు వాళ్ల‌బ్బాయితో మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని., అయితే అది రాజ‌కీయ సంబంధిం కాద‌ని అన్నారు.. వైసీపీకి బీజేపీతో కూడా లింకు ఉంద‌ని చెప్ప‌డానికి ఒకే ఒక్క రీజ‌న్ పుర‌ధేశ్వ‌రి బీజేపీలో ఉంటే, వాళ్ల‌బ్బాయి వైసీపీ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌డమే ఇందుకు నిలువెత్తు విద‌ర్శ‌న‌మ‌న్నారు..

============================

Share This:

760 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 4 =