Home / జన సేన / వ‌స్తాన‌న్నా.. వ‌చ్చా.. న్యాయం జ‌రిగే వ‌ర‌కు అండ‌గా ఉంటా.. హైరోడ్డు నిర్వాసితులతో జ‌న‌సేనాని..

వ‌స్తాన‌న్నా.. వ‌చ్చా.. న్యాయం జ‌రిగే వ‌ర‌కు అండ‌గా ఉంటా.. హైరోడ్డు నిర్వాసితులతో జ‌న‌సేనాని..

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, శెట్టిప‌ల్లి గ్రామ‌స్తుల‌కి ఇచ్చిన మాట మేర‌కు చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు.. హైరోడ్డు నిర్వాసితుల త‌రుపున గ‌ళం విప్పారు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుని న‌డిరోడ్డు మీద క‌డిగిపారేశారు.. మూడో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం శ్రీకాళహ‌స్తీస్వ‌రుణ్ణి ద‌ర్శించుకున్న జ‌న‌సేనాని, అక్క‌డి నుంచి రోడ్ షో నిర్వ‌హించారు.. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరాగా., ర‌హ‌దారుల‌న్నీ జ‌న‌సంద్రాన్ని త‌ల‌పించాయి.. అంత మందిలో చిత్తూరు హైరోడ్డు వెల్ఫేర్ ఆప్ష‌న్ బాధితుల‌తో జ‌న‌సేన అధినేత మాట్లాడారు.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో వారు ప‌డుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు..

చిత్తూరు జిల్లాలో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి.. జిల్లాలో ప్ర‌త్యేకంగా ప‌ర్య‌ట‌న‌కి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి స‌మ‌స్య‌ని ప్ర‌భుత్వం ముందు ఉంచుతాన‌న్న ఆయ‌న‌., హైరోడ్డు భూనిర్వాసితుల‌కి ఇచ్చిన మాట మేర‌కు ఇప్పుడు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.. తాను అభివృద్ది నిరోధ‌కుణ్ణి కాద‌ని అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కి అన్యాయం జ‌రిగితే స‌హించ‌బోన‌ని హెచ్చ‌రించారు.. సొంత జిల్లాకి న్యాయం చేయ‌లేని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు., మిగిలిన జిల్లాల‌కి ఏం చేస్తాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు..

అధికారం ఉన్న‌వారికి ఒక న్యాయం, డ‌బ్బు ద‌ర్పం ఉన్న వారికి ఒక న్యాయం., సామాన్యుల‌కి ఇంకో న్యాయం అంటే కుద‌ర‌ద‌ని., అంద‌రికీ స‌మాన హ‌క్కులు క‌ల్పించాల‌ని జ‌న‌సేన అధినేత డిమాండ్ చేశారు.. మాట ఇచ్చినందుకే మీకోసం వ‌చ్చాన‌న్న ఆయ‌న‌, నిర్వాసితుల‌కి న్యాయం జ‌రిగే వ‌ర‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు..

విదేశాల నుంచి వ‌చ్చే వారికి వేలాది ఎక‌రాలు ఇస్తూ, సొంత జిల్లా వాసుల భూములు లాక్కుంటే ఎలా అంటూ చంద్ర‌బాబుని ప్ర‌శ్నించారు.. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాళ‌హ‌స్తి, నంద్యాల త‌ర‌హా ప‌రిహారాన్ని చిత్తూరు జిల్లా వాసుల‌కి ఎందుకు ఇవ్వ‌ర‌ని నిల‌దీశారు.. న్యాయ‌ప‌రంగా అందాల్సిన ప‌రిహారం చెల్లించాకే., రోడ్డు విస్త‌ర‌ణ జ‌ర‌పాల‌ని జ‌న‌సేన అధినేత డిమాండ్ చేశారు.. ఓ గ్రామం ప‌రిధిలో స‌మ‌స్య జ‌న‌సేనాని వ‌స్తారా..? అన్న అనుమానంతో ఉన్న నిర్వాసితులు ప్ర‌త్యేకంగా ప‌నిక‌ట్టుకుని ఆయ‌న త‌ర‌లిరావ‌డంతో., త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేన‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు..

Share This:

1,926 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × one =