Home / పోరు బాట / శాంతియుత నిర‌స‌న యువ‌త హ‌క్కు.. కాల‌రాయొద్దు-ప‌వ‌న్ హెచ్చ‌రిక‌..

శాంతియుత నిర‌స‌న యువ‌త హ‌క్కు.. కాల‌రాయొద్దు-ప‌వ‌న్ హెచ్చ‌రిక‌..

pktwitt pktwittt

ఏపీ ప్ర‌త్యేక హదా సాధ‌నే ల‌క్ష్యంగా ఏపీ యువ‌త పిలుపునిచ్చిన మౌన ప్ర‌ద‌ర్శ‌న‌ పోలీసులు ఆంక్ష‌లు విధించ‌డంపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. ఇప్ప‌టికే ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌న‌సేనుడు., నిర‌స‌న దీక్ష‌కు అనుమ‌తిలేద‌న్న డీజీపీ వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌దులిచ్చారు.. ఈ ఉద్య‌మం ఏ పొలిటిక‌ల్ పార్టీకి సంబంధించింది కాదు.. ప్ర‌జ‌ల్లోంచిపుట్టిన ప్ర‌జా ఉద్య‌మ‌మ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.. నిశ్శ‌బ్ద పోరాటానికి అనుమ‌తించ‌క‌పోతే., విద్యార్ధుల్లో అశాంతి రగిలే అవ‌కాశం ఉంద‌ని., శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు యువ‌త‌కి ఉంద‌ని ఆయ‌న వ‌క్కాణించారు.. విశాఖ ఆర్కే బీచ్‌లో నిర‌స‌న దీక్ష‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌తి పౌరుడికీ ఉంద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. ఇచ్చిన హామీలు ఉల్లంఘించిన‌ప్పుడు నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డానికి దేశంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికీ హ‌క్కు ఉంద‌ని జ‌న‌సేనాని అన్నారు.. వారి హ‌క్కులు కాల‌రాస్తే., కొత్త స‌మ‌స్య‌లు సృష్టించిన‌వార‌వుతార‌ని హెచ్చ‌రించారు..

అంత‌కు ముందు రాష్ట్రంలో ఎలాంటి ఉద్య‌మానికీ ఎవ‌రూ అనుమ‌తి తీసుకోలేద‌ని.,సోష‌ల్ మీడియాలో పిలుపుల‌కి స్పందించ‌వ‌ద్దు అని వ్యాఖ్యానించారు.. ఒక‌వేళ ఇప్పుడు అనుమ‌తి అడిగినా బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌లేమ‌ని డిజిపి సాంబ‌శివ‌రావు వ్యాఖ్య‌నించ‌గా., దానిపై ప‌వ‌న్ స్పందించారు..

Share This:

731 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 19 =