Home / జన సేన / శివ భ‌క్తుల సేవ‌లో త‌రించిన జ‌న‌సైనికులు.. శివ‌రాత్రి స్పెష‌ల్‌..

శివ భ‌క్తుల సేవ‌లో త‌రించిన జ‌న‌సైనికులు.. శివ‌రాత్రి స్పెష‌ల్‌..

పాహి అని పిలిచినా వ‌రాలిచ్చే భోళాశంక‌రుడికి., అడ‌గ‌కుండానే క‌ష్టాలు తీర్చే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయన్న‌ది జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల న‌మ్మ‌కం.. అదే స‌మ‌యంలో ఇల‌వేల్పు హ‌నుమంతుడిని జ‌న‌సేన అధినేత ఏ స్థాయిలో కొలుస్తారో.. అదే స్థాయిలో శివ‌త‌త్వాన్ని విశ్వ‌సిస్తారు.. అందుకే శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన‌., ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనుడు చేస్తున్న పోరాటానికి ఆ భోళాశంక‌రుడి మ‌ద్ద‌తు కోరుతూ., శైవ‌క్షేత్రాల్లో శివ‌భ‌క్తుల సేవ‌లో త‌రించారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. తెలుగునాట విఖ్యాత శివ‌క్షేత్రాలు అడుగుకొక్కటి ఉన్నాయి.. వాయులింగాకారుడిగా అవ‌త‌రించి శ్రీకాళ‌హ‌స్తి నుంచి జ్యోతిర్లింగాకారుడిగా ఉద్భ‌వించిన శ్రీశైలం.. కృష్ణా-గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల్లోని పంచారామ క్షేత్రాలు.. ఇక శివ‌రాత్రి పేరు చెప్ప‌గానే గుర్తుకు వ‌చ్చే కోట‌ప్ప‌కొండ‌.. ప్ర‌తి క్షేత్రానికి భ‌క్తులు పోటెత్త‌గా., వారికి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌మ‌వంతు వాలంట‌రీ  సేవ‌లు అందించారు.. ముఖ్యంగా క్యూలైన్ల‌లో నిల‌బ‌డిన వారికి మంచినీరు.. ద‌ర్శ‌నానంత‌రం ప్ర‌సాదం పంపిణీ, పాలు, మ‌జ్జిగ‌ పంపిణీ లాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు..

కొటివేల్పుల కోట‌ప్ప‌కొండ‌లో త‌న్నీర్ కిషోర్ అండ్ కో ఆధ్వ‌ర్యంలో ప్ర‌సాద విత‌ర‌ణ చేప‌ట్టగా., బెజ‌వాడ‌లో జ‌రిగిన శివ‌క‌ళ్యాణ మ‌హోత్స‌వానికి స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ముఖ్యాతిధులుగా పాల్గొన్నారు.. లింగోద్భ‌వ స‌మ‌యాన ఆ స్వామి ద‌ర్శ‌నం చేసుకుని జ‌నం మంచి కోరుకునే జ‌న‌సేన అధినేత‌కి ఆయురారోగ్యాలు ప్ర‌సాధించాల‌ని కోరారు.. శివ‌రాత్రి జాగ‌ర‌ణ మ‌హోత్స‌వం సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో అల‌రించిన క‌ళాకారుల‌కి జ‌న‌సేన కార్య‌క‌ర్త అజ‌య్‌వ‌ర్మ ఠాకూర్ బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేశారు..

ఇక ప్ర‌ముఖ పంచారామ క్షేత్రాల్లో ఒక‌టైన పాల‌కొల్లు క్షీరారామ‌లింగేశ్వ‌రుడి ఆల‌యానికి శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన భ‌క్తులు పోటెత్త‌గా., ద‌ర్శ‌నానంత‌రం భ‌క్తుల‌కి పాలు-మంచినీరు పంపిణీ చేశారు.. జ‌న‌సైనికులు గ‌మ్మిడి సూర్య‌, యాతం సురేంద్ర‌, పితాని వెంక‌టేష్‌., దాసిరెడ్డి పుష్పారావుల ఆధ్వ‌ర్యంలో సుమారు 250 లీట‌ర్ల పాలు విత‌ర‌ణ గావించారు.. ఇక శ‌క్తిపీఠం-పంచారామం క‌ల‌సిన పిఠాపురంలో భ‌క్తుల ర‌ద్దీ నేప‌ధ్యంలో., జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్యేక స్టాల్ ఏర్పాటు చేసి మ‌రీ త‌మ‌వంతు సేవ చేశారు.. వ‌చ్చిన ప్ర‌తి భ‌క్తుడి ఆక‌లి తీర్చేందుకు పులిహోర పంపిణీ చేప‌ట్టారు.. స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త జ‌గ‌దీష్‌చంద్ర వాసు ఆధ్వ‌ర్యంలో జ‌న‌సైనికులంతా ఈ కార్య‌క్ర‌మానికి త‌మ‌వంతు సాయం అందించారు.. ఇక్క‌డ మాత్ర‌మే కాదు ప్ర‌తి శివ‌క్షేత్రంలో జ‌న‌సేన స్టాల్, పోస్ట‌ర్లు భారీ ఎత్తున ద‌ర్శ‌న‌మిచ్చాయి.. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాదాన్ని కూడా ప్ర‌తి పోస్ట‌ర్‌లో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు..

Share This:

1,076 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 1 =