Home / జన సేన / శ్ర‌మ‌ను గుర్తించి…గౌర‌వించాలి-జ‌న‌సేనాని మే డే సందేశం..

శ్ర‌మ‌ను గుర్తించి…గౌర‌వించాలి-జ‌న‌సేనాని మే డే సందేశం..

మే డే సంద‌ర్భంగా కార్మిక సోద‌రులంద‌రికీ త‌న త‌ర‌ఫున, జ‌న‌సైనికుల త‌ర‌ఫున జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. స్వేదాన్ని రక్తంగా మార్చి శ్రమించే కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు అని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.. శ్రమను గుర్తించి… శ్రమను గౌరవించాలని ప‌వ‌న్ కోరారు.. సమాజ పురోగతిలో, సంపద సృష్టిలో కార్మికుల పాత్ర విస్మరించని రోజునే శ్రమ జీవుల కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల కష్టానికి తగ్గ వేతనాలు అందేలా చేయాల్సి ఉందన్నారు.. కార్మికుల ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు.. అప్పుడే కార్మిక దినోత్సవ ఉద్దేశం నెరవేరుతుంద‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. సోష‌లిస్ట్ భావాల‌కు అమిత‌మైన ప్రాధాన్య‌త ఇచ్చే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., కుటుంబం కోసం చ‌మ‌డోచ్చే త‌ల్లి నుంచి దేశ ప్ర‌జ‌ల క‌డుపు నింపే అన్న‌దాత వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిలో శ్ర‌మికుడికి స‌లాం చేస్తూ ఉంటారు.. అందుకే శ్ర‌మ శ‌క్తికి ప్ర‌తీక అయిన పిడికిలిని జ‌న‌సేన పార్టీ గుర్తుగా ఆయ‌న స్వీక‌రించారు.. ఎర్ర‌కండువాని నిత్యం త‌న మెడ‌లో ధ‌రించి త‌న ఉద్దేశాన్ని చాటుకుంటున్నారు కూడా..

Share This:

289 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 5 =