Home / జన సేన / శ‌నివారం నంద్యాల‌కు జ‌న‌సేనాని.. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ప‌రామ‌ర్శ‌..

శ‌నివారం నంద్యాల‌కు జ‌న‌సేనాని.. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ప‌రామ‌ర్శ‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ నెల 11వ తేదీ, శ‌నివారం నాడు క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు వెళ్ల‌నున్నారు.. అ నెల 1వ తేదీ మృతి చెందిన పార్టీ నంద్యాల అభ్య‌ర్ధి ఎస్పీవై రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు.. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. వ‌రుస‌గా మూడు సార్లు నంద్యాల లోక్‌స‌భ స్థానం నుంచి పార్ల‌మెంటుకు ఎన్నిక‌యిన ఎస్పీవైరెడ్డి., ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. శ‌నివారం నంద్యాల‌కు వెళ్ల‌నున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎస్పీవైరెడ్డికి నివాళులు అర్పిస్తారు. అనంత‌రం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తారు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితులైన ఎస్పీవై రెడ్డి., త‌న‌ పార్ల‌మెంటు స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి జ‌న‌సేన పార్టీలో చేరారు.. అనంత‌రం త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శాసన‌స‌భ స్థానాల్లో పార్టీ అభ్య‌ర్ధుల గెలుపు కోసం త‌నవంతు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఆ క్ర‌మంలో తీవ్ర అనారోగ్యానికి గురై క‌న్నుమూశారు..

Share This:

416 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × five =