Home / జన సేన / శ‌నివార‌మే JFC నివేదిక‌.. ఇంత‌కీ నివేదిక‌లో ఏముందంటే..?

శ‌నివార‌మే JFC నివేదిక‌.. ఇంత‌కీ నివేదిక‌లో ఏముందంటే..?

విభ‌జ‌న హామీల అమ‌లు వ్య‌వ‌హారంలో కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల భిన్న‌వాద‌న‌లపై నిగ్గు తేల్చేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చొర‌వ‌తో పురుడు పోసుకున్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC) ఏమైంది..? వారాల్లో నివేదిక రూపొందిస్తామ‌ని చెప్పిన JFC, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎక్క‌డ‌..? వ‌్య‌వ‌హారాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు తెలుగు మీడియాకి శ్రీదేవి మృతి, సిరియా మార‌ణ‌కాండ లాంటి హాట్ న్యూస్‌లు దొరికినా., నిబ‌ద్ద‌త గ‌ల నాయ‌కుడిగా పేరున్న జ‌న‌సేన అధినేత మాత్రం తెర వెనుక త‌న ప‌నిని తాను కానిస్తూ వ‌చ్చారు.. JFC, దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన స‌భ్ క‌మిటీల ప‌నితీరుని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ., క‌ర్త‌వ్య‌బోధ గావిస్తూ వ‌చ్చారు..

ఈ సోదంతా మాకెందుకు అస‌లు మేట‌ర్ ఏంటో చెప్ప‌మంటున్నారా..? అక్క‌డికే వ‌స్తున్నా.. మ‌రో 24 గంట‌ల్లో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ నివేదిక ప్ర‌జ‌ల ముందుకి రానుంది.. ఈ మేర‌కు JFC తాజా స‌మావేశం అనంత‌రం జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.. JFC స‌బ్ క‌మిటీలోని కీలక స‌భ్యులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, మాజీ పార్ల‌మెంటేరియ‌న్ ఉండ‌వ‌ల్లి, ఏపీ మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, హోంశాఖ మాజీ కార్య‌ద‌ర్శ ప‌ద్మ‌నాభ‌య్య‌, మ‌రో మాజీ ఐఏఎస్ తోట చంత్ర‌శేఖ‌ర్‌లు హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ హోట‌ల్‌లో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.. అనంత‌రం నివేదిక‌కి సంబంధించి JFCలోని మిగిలిన క‌మిటీలు, స‌భ్యుల నుంచి కూడా రిపోర్టులు స్వీక‌రించాల్సి ఉన్న నేప‌ధ్యంలో., శుక్ర‌వారం ఆ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించింది..
ఇక శ‌నివారం JFC త‌న తుది నివేదిక‌ని ప్ర‌జ‌ల ముందు ఉంచ‌నుంది..

జ‌న‌సేన చొర‌వ‌తో ఏర్పాటైన JFC., ఇది మాట‌ల క‌మిటీ., అంతా ఊహించిన‌ట్టు నాన్చుడు క‌మిటీ కాద‌ని మ‌రోసారి నిరూపించుకుంది.. ఇంత‌కీ JFC నివేదిక‌లో ఏముంది.. ఇందుకు సంబంధించి ఓ కీల‌క స‌మాచారం ఒక‌టి మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.. కేంద్రం నిధులు ఇచ్చామంటోంది.. ఏపీ స‌ర్కారు పుచ్చుకోలేదంటోంది.. ఇంత‌కీ ఎవ‌రి వాద‌న త‌ప్పు.. అంటే ఇరువురు ప్ర‌జ‌ల‌కి మ‌సి పూసిన‌ట్టు నిరూపితం అయిన‌ట్టు తెలుస్తోంది.. అందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని లెక్క‌ల‌తో స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యే రీతిలో నివేదిక‌ని రూపొందించిన‌ట్టు స‌మాచారం..

ఈ స‌మాచారంతో కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో గుబులు మొద‌లైంది.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ JFC నివేదిక ప్ర‌జ‌ల ముందు త‌మ‌ను ఎక్క‌డ దోషిగా నిల‌బెడుతుందోన‌న్న భ‌యాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ఒక‌వేళ త‌మవైపు క‌న‌బ‌డిన ప‌క్షంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అండ్ కోపై ఎదురుదాడి వ్యూహాలు కూడా సిద్దం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.. జ‌న‌సేనుడిపై ఎదురుదాడి సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి., ప్ర‌జ‌ల‌దాడి నుంచి ఎలా త‌ప్పించుకోవాలో ఆలోచించుకోవ‌డం బెట‌ర్‌..

Share This:

2,080 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 5 =