Home / జన సేన / శ‌రీరం స‌హ‌క‌రించ‌లేదు.. అవ‌య‌వాలు ఆచేత‌నంగా మారాయి.. ఆత్మ‌విశ్వాసం అన్నింటినీ అధిగ‌మించింది..

శ‌రీరం స‌హ‌క‌రించ‌లేదు.. అవ‌య‌వాలు ఆచేత‌నంగా మారాయి.. ఆత్మ‌విశ్వాసం అన్నింటినీ అధిగ‌మించింది..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ మాట‌ల్లో ఆవేశం మాత్ర‌మే చూస్తారు కొంద‌రు.. ఆ ఆవేశం వెనుక ఉన్న ఆవేద‌న చూస్తారు మరికొంద‌రు.. నిబ‌ద్ద‌త-నిజాయితీని మాత్ర‌మే చూస్తారు ఇంకొంద‌రు.. అవే ఆయ‌న సైన్యానికి స్పూర్తి.. ఆ స్ఫూర్తి ఎలాంటిదంటే.. మృత్యువు ఎదురుగా నిల్చున్నా., జంకుబొంకులు ఎరుగ‌ని ఆత్మ‌విశ్వాసం.. శ‌రీరం శ‌య్య‌పై ఉన్నా., సేవ చేయాల‌న్న త‌ప‌న‌.. ఇలాంటి ల‌క్ష‌ణాలు కేవ‌లం జ‌న‌సేనుడి భ‌క్తుల‌కి మాత్ర‌మే సాధ్యం…

కాకినాడ వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేన న‌వ‌నాయ‌క‌త్వ ఎంపిక శిభిరంలో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌నే అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం.. ఆరోగ్యం ఇబ్బందుల్లో ఉంది.. కండీష‌న్ సీరియ‌స్‌గా ఉంది.. కానీ రాజ‌కీయాల్లో మార్పు, ప్ర‌క్షాళ‌ణ కోసం జ‌న‌సేనుడు చేప‌ట్టిన య‌జ్ఞానికి తాను సైతం ఓ స‌మిధ‌ను ఆహుతివ్వాల‌నుకున్నాడు.. ఆసుప‌త్రి బెడ్ మీద నుంచి లేచే శ‌క్తి లేదు.. శ‌రీరం ఆచేత‌నావ‌స్థ‌లో ఉంది.. అయినా త‌న ల‌క్ష్యం ముందు ఇవేమీ కాన‌రాలేదు.. ఆసుప‌త్రి బెడ్ నుంచి ఆంబులెన్స్ ఎక్కాడు.. ఎంపిక శిభిరానికి చేరుకుని త‌న కోరిక తీర్చుకున్నాడు..

త‌న‌కు అన్యాయం జ‌రిగింది.. అదే అన్యాయం ఇంకా ఎవ్వ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు.. అందుకు నిస్వార్ధ రాజ‌కీయాల‌కు నిలువెత్తు రూపం అయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర్చాలి అన్న త‌న వాణిని వినిపించాడు.. అన్నీ ఉండీ., అడుగ‌డుగునా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూ., ఎవ‌డో వ‌స్తాడు.. ఏదో చేస్తాడు.. అన్న ఆలోచ‌న‌తో ఎవ్వ‌రికీ ప‌నికిరాని., చేవ చ‌చ్చిన జీవితాన్ని గ‌డిపే ఎంద‌రికో స్పూర్తిగా నిలిచాడు.. అవును ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉంది అభిమానులు కాదు.. భ‌క్తులు.. ఆ భ‌క్తులే ఆయ‌న సైన్యం..

Share This:

About Syamkumar Lebaka

Check Also

తెలుగు ప్ర‌జ‌ల‌కి భోగి, సంక్రాంతి శుభాకాంక్ష‌లు- మీ జ‌న‌సేనాని..

ద‌క్షిణాది సంప్ర‌దాయానికి అద్దం ప‌ట్టే పండుగ సంక్రాంతి.. అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి.. రెండు ముక్క‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 8 =

%d bloggers like this: