Home / జన సేన / సంక్రాంతి వేళ జ‌న‌సేన క్రికెట్ టోర్నీ.. గ్రామీణ యువ‌త‌కు సైన్యం ప్రోత్సాహం..

సంక్రాంతి వేళ జ‌న‌సేన క్రికెట్ టోర్నీ.. గ్రామీణ యువ‌త‌కు సైన్యం ప్రోత్సాహం..

img-20170111-wa0066 img-20170111-wa0068

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యం కేవ‌లం., స‌మ‌స్య‌ల‌తో పోరాడ‌ట ఒక్క‌టే కాదు.. దేశ భ‌విష్య‌త్తుని తీర్చిదిద్దే రేప‌టి పౌరుల‌ను స‌రైన మార్గంలో న‌డిపించ‌డం.. యువ‌త జాగృతం చేయ‌డం.. వ్య‌స‌నాల వైపు దారి మ‌ళ్ల‌కుండా., క్రీడ‌ల వైపు ఆస‌క్తి పెంచ‌డం.. ఇలా ఎన్నో ల‌క్ష్యాలు పార్టీ కార్యాచ‌ర‌ణ‌లో ఉన్నాయి.. ఇప్ప‌టికే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో త‌న‌కంటూ ఓ ట్రేడ్ మార్క్ వేసుకున్న జ‌న‌సేనాని., జ‌న‌సైన్యం.. తాజాగా యువ‌త‌పై దృష్టి కేంద్రీక‌రించారు..

img-20170111-wa0067

ఇప్ప‌టికే తూర్పుగోదావ‌రి జిల్లాలో పార్టీ ఔత్సాహికులంద‌ర్నీ., ఓ తాటిపైకి తెస్తున్న జ‌న‌సైనికులు., ఇప్పుడు సంక్రాంతి సంద‌ర్బంగా కోడి పందాలు లాంటి వాటి జోలికి వెళ్ల‌కుండా యువ‌త‌ను దారి మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం, క‌పిలేశ్వ‌రం మండ‌లం అంగ‌ర‌లో జ‌న‌సేన పార్టీ త‌రుపున ఓ మెగా క్రికెట్ టోర్నీని నిర్వ‌హిస్తున్నారు.. మామాలుగా గ‌ల్లీ స్థాయిలో జ‌రిగే క్రికెట్ టోర్నీల ప‌ట్ల ఇలాంటి పండుగ సీజ‌న్‌లో పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని యువ‌జ‌నం., జ‌న‌సేన పార్టీ నిర్వ‌హిస్తున్న టోర్నీ అన‌గానే ఎంట్రీల కోసం ఎగ‌బ‌డ్డారు.. రెండు ల‌క్ష్యాల‌తో టీం జ‌న‌సేన స‌భ్యులు ఈ టోర్నీకి రూప‌క‌ల్ప‌న చేశారు.. ఒక‌టి సంక్రాంతి అన‌గానే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో కోడి పందాలు, ఇత‌ర జూదాలు జోరందుకుంటాయి.. పార్టీల నాయ‌కులే స్వ‌యంగా బ‌రులు గీసి వీటిని నిర్వ‌హిస్తూ ఉంటారు.. ఇలాంటి వాటి జోలికి యువ‌త‌ను దారి మ‌ళ్ల‌కుండా చూడ‌డం., గ్రామీణ యువ‌త‌లో దాగి ఉన్న క్రీడా ప‌టిమ‌ను వెలికి తీయ‌డం.. అందుకే సంక్రాంతి ప్రారంభానికి ముందు నుంచి పండుగ పూర్త‌యిన నాలుగు రోజుల వ‌ర‌కు ఈ టోర్నీ షెడ్యూల్ ఏర్పాటు చేశారు..

img-20170111-wa0071

అటు ఈ టోర్నీ పుణ్య‌మాఅని మండ‌పేట ప‌రిస‌ర ప్రాంతాల్లో పార్టీపై ప్రేమ ఉండి., బ‌య‌ట‌ప‌డేందుకు ఇబ్బంది ప‌డుతున్న వారంతా ఓ చోట చేరారు.. దీంతో జ‌న‌సైనికులు పెట్టుకున్న ల‌క్ష్యాల కంటే., ఒక‌టి అధ‌నంగా పూర్త‌య్యింద‌నే చెప్పాలి.. మొత్తానికి అంగ‌ర జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో మొద‌లైన మెగా క్రికెట్ టోర్నీ ఆరంభంలోనే మెగా స‌క్సెస్ మార్కులు కొట్టేసింది..

Share This:

1,455 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × five =