Home / పోరు బాట / సంప్ర‌దాయం కోస‌మే అంత చేస్తే.. హ‌క్కుల కోసం ఇంకెంత చేయాలి- స‌ర్కారుపై ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ ఎటాక్..

సంప్ర‌దాయం కోస‌మే అంత చేస్తే.. హ‌క్కుల కోసం ఇంకెంత చేయాలి- స‌ర్కారుపై ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ ఎటాక్..

pktwitt003 pktwitt03

సామాజిక మాద్య‌మం ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌ల దాడి కొన‌సాగుతోంది.. జ‌ల్లిక‌ట్టుకి., హోదాకి లింకేంటి అంటూ చంద్ర‌బాబు, ఆయ‌న మంత్రులు సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు జ‌న‌సేనుడు త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చారు.. సంప్ర‌దాయం కోసమే త‌మిళులు అంత‌పోరాటం చేసిన‌ప్పుడు.. మ‌న హ‌క్కుల కోసం అవ‌స‌రాల కోసం ఇంకెంత పోరాటం చేయాల‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు..

జ‌ల్లిక‌ట్టు పోరాట స్ఫూర్తితో., త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నించేందుకు., త‌మ హ‌క్కుని కాపాడుకునేందుకు యువ‌త స్వ‌చ్చందంగా ముందుకి వ‌స్తున్న‌ప్పుడు.., కుదిరితే స‌హ‌క‌రించండి.. అంతేకానీ వెన‌క్కి లాగే వ్యాఖ్య‌లు చెయ్య‌కండ‌ని జ‌న‌సేనాని సూచించారు.. అమ్మ పెట్ట‌దు.. అడుక్కు తిన‌నివ్వ‌దు.. అన్న సామెత లాగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించేందుకు మీరు పోరాటం చెయ్య‌రు.. చేసే వారిని చెయ్య‌నివ్వ‌రు.. మ‌రి ఎలా..? అంటూ ప‌వ‌న్ ప్ర‌శ్నించారు..

pktwitt0003

యువ‌త చేయ్యాల‌నుకుంటున్న ఏపీ ప్ర‌త్యేక హోదా శాంతియుత పోరాటాన్ని ఎవ‌రు నీరుగార్చినా., వారు ఏపీ రాష్ట్ర భ‌విష్య‌త్తుని నాశ‌నం చేసిన‌ట్టేన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్ర‌యాప‌డ్డారు..

ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ఫైట్‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి తారా స్థాయికి చేరుతుంటే.., పాల‌కులు ఉక్కిరి బిక్కిర‌వుతుంటే.., కొంత‌మంది మంది త‌ల‌పండిన మీడియా పెద్ద‌లు దాన్ని కూడా వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. ట్విట్ల హీరో అని., బ‌య‌టికి రాకుండా ఇదేంట‌ని ఎవ‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వారు పేలుతున్నారు.. మీరు ఎంత గింజుకున్నా., మీకు జ‌న‌సేనుడు ఎక్క‌డా దొర‌క‌డు.. రెచ్చ‌గొట్టి ల‌బ్దిపొందాల‌న్న ఆశ‌లేమైనా ఉంటే వాటిపై ఆశ‌లు వ‌దులుకోండి..

Share This:

673 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 9 =