Home / జన సేన / సమాజ‌సేవ‌కు పుట్టిన సైన్యం.. జ‌న‌సైన్యం.. స‌మ‌స్య కంట‌బ‌డితే ప‌రిష్కార‌మే క‌ర్త‌వ్యం..

సమాజ‌సేవ‌కు పుట్టిన సైన్యం.. జ‌న‌సైన్యం.. స‌మ‌స్య కంట‌బ‌డితే ప‌రిష్కార‌మే క‌ర్త‌వ్యం..

ఊర్ల వెంట ప‌డి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటే., వీరు వీరి పిచ్చ అంటూ పెద‌వి విరిచిన వారి సంఖ్యే ఘ‌నం.. అందులో ఆ అవ‌స‌రం.. అదే జ‌న‌సైనికుల అవ‌స‌రం.. చాలామందికి కావాల్సి వ‌చ్చింది.. చివ‌రికి జ‌న‌సేవ చేయగా చేయ‌గా., గుర్తించ‌డం మొద‌లుపెట్టారు.. జ‌న‌సేన అధినేత ఒక్కో స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌గా.., ప‌రిష్క‌రించ‌గా.. స‌మ‌స్య ఏదున్నా జ‌న‌సేన గ‌డ‌పే తొక్కాల‌న్న న‌మ్మ‌కం కుదిరింది.. ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి జ‌న‌సేన అధినేత., ఆయ‌న‌ ఇచ్చిన స్ఫూర్తితో జ‌న‌సైనికులు ఓ య‌జ్ఞ‌మే చేశార‌ని చెప్పాలి.. పండుగ‌, ప‌బ్బం., తిరునాళ్లు, ఉత్స‌వాలు., దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఓ సేవ‌కు ఉప‌యోగించ‌డం., స‌మ‌స్యల్ని వెతుక్కుంటూ వెళ్లి మ‌రీ., వాటి అంతు తేల్చ‌డం.. భార‌త దేశంలోనే మ‌రే రాజ‌కీయ పార్టీకీ సాధ్యం కాని రీతిలో ప‌ని చేశార‌ని చెప్పాలి..

ఇంకా ఈ యజ్ఞం కొన‌సాగిస్తూనే ఉన్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తి మిగిలిన ప్రాంతాల‌తో పోలిస్తే కోన‌సీమ ప్రాంతంలో ఒక్క అడుగు ముందే ఉంది.. తాజాగా త‌మ కంటికి క‌న‌బ‌డిన ఓ చిన్న పెద్ద స‌మ‌స్య‌కి జ‌న‌సైనికులు త‌మ‌దైన స్ట‌యిల్లో ప‌రిష్కారం చూపారు..

పాల‌కులు, ప్ర‌భుత్వాల మాటల్లో క‌న‌బ‌డిన అభివృద్ది, చేత‌ల్లో క‌న‌బ‌డ‌దు.. ఇది అడుగ‌డుగునా ద‌ర్శ‌న‌మిచ్చే అంశమే.. మూరు మూల ప‌ల్లె అయినా., ప‌ట్ట‌ణం అయినా విద్యార్ధుల భ‌విష్య‌త్తుని కాపాడ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌.. కానీ కార్పొరేట్ స్కూళ్ల‌లో ఉండే క‌ల‌ర్ స‌ర్కారీ స్కూళ్ల‌లో క‌న‌బ‌డ‌దు.. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం అయినివిల్లి మండ‌లం, సిరిప‌ల్లి గ్రామంలోని స‌ర్కారీ స్కూల్ .. క‌నీసం విద్యార్ధులు తాగే మంచినీటి ట్యాంక్ కూడా దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉంది.. ఆ ట్యాంక్‌ని చూడ‌గానే., అందులో నీరు తాగే విద్యార్ధుల ఆరోగ్యం ప‌రిస్థితేంట‌న్న అనుమానం రాక మాన‌దు.. కానీ ఆ స్కూల్లో చ‌దువు చెప్పే అధ్యాప‌కుల‌కి గానీ., గ్రామ పెద్ద‌ల‌కి గానీ అలాంటి భావ‌న ఏం క‌ల‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం..

కానీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి అక్క‌డ స‌మ‌స్య క‌న‌బ‌డింది.. తామకి ఓ స‌మ‌స్య క‌న‌బడితే ఏం చేస్తారో., మ‌రోసారి చాటి చెప్పారు.. ట్యాంక్ క్లీన్ చేయ‌డంతో పాటు ., దానికి ఓ రంగు వేసి ఓ కొత్త రూపునిచ్చారు.. ఎండలు ముదురుతున్న స‌మ‌యంలో వారి దాహ‌ర్తి తీర్చే ప్ర‌య‌త్నం చేశారు..

పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌లు కూడా త‌మ వంతుగా మ‌రో వాట‌ర్ ట్యాంక్‌ని శుభ్ర‌ప‌ర‌చి., మంచినీటి కోసం ఇబ్బంది ప‌డుతున్న ముక్తేశ్వ‌రం హైస్కూల్ విద్యార్ధుల దాహ‌ర్తి తీర్చారు.. ముక్తేశ్వ‌రం హైస్కూల్‌లో జ‌న‌సైన్యం పున‌ర్నిర్మాణం గావించిన వాట‌ర్‌ట్యాంక్ అయితే పూర్తి శిధిలావ‌స్థ‌కి చేరుకుంది..

మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించ‌డంతో త‌మ ప‌ని అయిపోయింద‌ని భావించ‌కుండా., జ‌న‌సైన్యం స్కూల్ ఆవ‌ర‌ణ మొత్తం తిరిగి చూశారు.. విద్యార్ధులకి ఇబ్బంది క‌లిగించే ప‌రిస్థితులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో వెతికి మ‌రీ., వాటిని తీర్చారు.. ముఖ్యంగా విద్యార్ధుల‌కి ఇబ్బంది క‌లిగిస్తున్న మ‌రుగునీటిని త‌ర‌లించేందుకు డ్రైనేజ్ సౌక‌ర్యం క‌ల్పిండం ప‌ల్ల విద్యార్ధులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు..

జ‌నసేన కార్య‌క‌ర్త‌లు అయితే ఏంటి..? ఇంకా ఎవ‌రైతే ఏంటి..? మ‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌ని జ‌రిగిపోయింది క‌దా అని పాల‌కులు భావిస్తే., మీకు ఓట్లేసి మా నెత్తిన ఎందుకు కూర్చోబెట్టుకోవాల‌ని అని జ‌నం కూడా ఆలోచిస్తారు జాగ్ర‌త్త‌.. ఇప్ప‌టికే నాలుగేళ్లు గ‌డ‌చిపోయింది.. క‌నీసం చివ‌రి ఏడాది స్వ‌సేవ మాని జ‌నసేవ చేస్తారని కోరుకుంటున్నాం.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స్ఫూర్తితో పాల‌కులు, యంత్రాంగం ముంద‌డుగు వేయాల‌ని కింక్షిస్తూ..

Share This:

1,570 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × four =