Home / సేన సేవ / సాటి మ‌నిషికి సాయ‌మే ప‌వ‌నిజం.. క‌ష్టాల్లో ఉన్న ఈ ప‌వ‌న్ ఫ్యాన్‌ని ఆదుకుందాం.. రండి త‌లో చేయి వేద్దాం..

సాటి మ‌నిషికి సాయ‌మే ప‌వ‌నిజం.. క‌ష్టాల్లో ఉన్న ఈ ప‌వ‌న్ ఫ్యాన్‌ని ఆదుకుందాం.. రండి త‌లో చేయి వేద్దాం..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే ప‌డిచ‌చ్చే అభిమానుల్ని., ఆకాశంలో చుక్క‌ల్ని లెక్క‌గ‌ట్ట‌డం క‌ష్ట‌మే.. వీరిలో ఎవ‌రికి ఏ ఆప‌ద‌వచ్చినా.,., సాటి అభిమానులుగా మిగిలిన వారంతా ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు ఎల్ల‌ప్పుడూ సిద్ధంగానే ఉంటారు.. ఇప్పుడు అలాంటి క‌ష్ట‌మే ఓ ప‌వ‌న్ ఫ్యాన్‌కి వ‌చ్చింది.. అత్తారింటి్కి దారేది సినిమా రిలీజ్ రోజు చూడాల‌న్న స‌తీష్ అనే యువ‌కుడి ఆశ‌., అత‌న్ని మూడేళ్లుగా మంచానికే ప‌రిమ‌తం చేసింది.. టిక్కెట్ కౌంట‌ర్ వ‌ద్ద గోడ‌కూలి అత‌నిపై ప‌డ‌డంతో., శ‌రీరం పూర్తిగా ఆచేత‌నావ‌స్థ‌లోకి వెళ్లిపోయింది.. మూడేళ్లుగా త‌ల్లిదండ్రులు ఉన్న‌ది ఊడ్చి కొడుక్కి వైద్యం చేయిస్తూనే ఉన్నారు.. అత‌ను పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత మొత్తం కావాలి.. ఆప‌న్న‌హ‌స్తం కోసం ఎదురు చూశారు.. జ‌న‌సేనుడిని క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.. బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఆయ‌న ద‌ర్శ‌న‌భాగ్యం ల‌భించ‌లేదు.. దీంతో చివ‌రి నిమిషంలో సాయం కోసం ప‌వ‌న్‌టుడేని ఆశ్ర‌యించారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల్లో ఎవ‌రైనా దాత‌లు ఉంటే త‌మ‌కు సాయం చేయించండంటూ ఫేస్‌బుక్ పేజీకి అత‌ని ద‌య‌నీయ స్థితిని వివ‌రించే వీడియోతో స‌హా మెస్సేజ్ పంపారు..

జ‌న‌సేనుడి వీరాభిమాని(భ‌క్తుడు) అయిన స‌తీష్ ద‌య‌నీయ స్థితికి వెంట‌నే చ‌లించి., విష‌యాన్ని ఎన్ఆర్ఐ జ‌న‌సేన టీంకి చేర్చ‌డం జ‌రిగింది.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌తీష్‌కి మీకు తోచిన సాయం చేయాలంటూ అభ్య‌ర్ధించింది.. ప‌వ‌న్‌టుడే విజ్ఞాప‌న‌కు సానుకూలంగా స్పందించిన ఎన్ఆర్ఐలు యుద్ధ‌ప్రాతిప‌ధిక‌న అత‌నికి సాయం చేసే ప‌నికి శ్రీకారం చుట్టారు.. సోష‌ల్ మీడియాలో హెల్ప్ స‌తీష్ అంటూ ఓ ప్రోగ్రాం రూపొందించి మ‌రీ త‌మ‌కు తెలిసిన అంద‌రి సాయం కోరారు.. స‌తీష్ పూర్తిగా కోలుకోవాల‌నే నిబ‌ద్ద‌త‌తో కూడిన ల‌క్ష్యంతో ఎన్ఆర్ఐ జ‌న‌సేన స‌భ్యులు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లితాన్నిచ్చింది.. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు ల‌క్ష‌ల‌కు పైగా పోగైంది.. ఎన్ఆర్ఐ జ‌న‌సేన టార్గెట్ మూడు ల‌క్ష‌ల 60 వేలు.. ఆ ల‌క్ష్యం అత్యంత చేరువ‌లోనే ఉంది..

ఖ‌మ్మం జిల్లా కొత్తగూడెంకి చెందిన స‌తీష్‌ని ఆదుకునేందుకు ఎవ‌రైనా., ఓపిక మేర‌కు నేరుగా సాయం అందించ వ‌చ్చు.. అత‌ని అకౌంట్ నంబ‌ర్ డిటెయిల్స్‌– Gubbal Satesh kumar, ac no-125401000028152(indian overseas bank Kothagudem Branch), IFSC:IOBA0001254.. స‌తీష్.. త‌దుప‌రి వైద్యానికి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. వివ‌రాల‌కు నేరుగా సంప్ర‌దించాల్సిన ఫోన్ నంబ‌ర్స్ 7416452977, 8328440150 .. ప్లీజ్ సేవ్ ప‌వ‌న్ ఫ్యాన్‌..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ఆ ఊరిలో అగ్గి అల‌జ‌డి.. త‌గుల‌బ‌డుతున్న ఇళ్లు,గ‌డ్డి వాములు.. నిఘాకి జ‌న‌సైన్యం హామీ..

అది కృష్ణాజిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని మొవ్వ మండ‌లం కోసూరు గ్రామం.. గ‌త నెల రోజులుగా ఆ ఊరు ఊరంతా బిక్కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 10 =

%d bloggers like this: