Home / జన సేన / సామాన్యుడు రాజ్యాలు ఏలాలి..అదే జ‌న‌సేన ల‌క్ష్యం- ఆటో డ్రైవ‌ర్ల‌తో జ‌న‌సేనాని.

సామాన్యుడు రాజ్యాలు ఏలాలి..అదే జ‌న‌సేన ల‌క్ష్యం- ఆటో డ్రైవ‌ర్ల‌తో జ‌న‌సేనాని.

ఆటో డ్రైవ‌ర్ల‌ను ఒరేయ్ అని మ‌ర్యాద‌లేకుండా పిలిస్తే లీగ‌ల్ గా చ‌ర్య‌లు తీసుకునేలా జ‌న‌సేన పార్టీ చేస్తుంద‌ని, ఆటో డ్రైవ‌ర్ల ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుతుంద‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.. గ‌ర్భిణి స్త్రీల‌కి, దివ్యాంగుల‌కి ప్ర‌యాణం ఉచితం అని ఆటోల‌పై రాసి సేవ చేయ‌డాన్ని ఆయ‌న అభినంధించారు. ప్రాణం ఉన్నంత వ‌ర‌కు మిమ్మ‌ల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాన‌న్నారు.. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏలూరులోని క్రాంతి క‌ల్యాణ మండపంలో ఆటో డ్రైవ‌ర్ యూనియ‌న్ల‌తో స‌మావేశ‌మైన జ‌న‌సేనాని, వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తాను గెలుపు కోసం కాదు మార్పు కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు తెలిపారు. దెబ్బ‌లు తింటాన‌ని, ఒత్తిడి ఉంటుంద‌ని తెలిసే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. ఆటోల‌ వెనకాల త‌న‌ ఫోటో పెట్టుకుని ఇబ్బంది ప‌డొద్దని ఆటో వాలాల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సూచించారు.. ఆటోలో త‌న‌ ఫొటో పెడితే వేధించిన ఘ‌ట‌న‌లు, త‌న‌ ఫోటో బ‌ల‌వంతంగా తీయించి, ఇష్టం లేకున్నా వారి నాయ‌కుడి ఫోటోలు పెట్టించిన ఘ‌ట‌న‌లు త‌న దృష్టికి వ‌చ్చాయ‌ని తెలిపారు.. అన్నింటినీ స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు మౌనంగా భ‌రించాల‌న్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేసిందని, ఆ సర్టిఫికెట్లు సంపాదించుకోవాలంటే ప్రతి ఆటోకీ ఇన్సూరెన్స్ ఉండాలని, ఇన్సూరెన్స్ మొత్తం ఏడాదికి ఎనిమిది వేల రూపాయల వరకూ ఉంటోందని ఆటో డ్రైవర్ యూనియన్ నేతలు తనకు వివరించారని, వీటిని పరిగణనలోకి తీసుకుని జ‌న‌సేన మ్యానిఫెస్టో రూపొందిస్తామ‌ని హామీ ఇచ్చారు..

రాజ‌కీయం అంతా అవినీతి, దోపిడి వ్య‌వ‌స్థ‌తో నిండిపోయింద‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అది వేల కోట్ల‌తో ముడిప‌డి ఉన్న వ్య‌వ‌హారం అన్నారు.. ఒక ప‌ర్య‌ట‌న జ‌ర‌పాలంటే ఎంతో ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. పార్టీని న‌డ‌పడం ఎంత క‌ష్ట సాధ్య‌మైన ప‌నో కూడా త‌న‌కు తెలుసన్నారు. అయితే ఈ అవినీతికి ఎక్క‌డో ఒక చోట గండి ప‌డాల‌న్న ల‌క్ష్యంతోనే తాను ముందుకి వ‌చ్చాన‌న్నారు.. అధికారులు మిమ్మ‌ల్ని వేధిస్తున్నారంటే అందుకు కార‌ణం కూడా అవినీతేనన్న ఆయ‌న‌, ఆ అవినీతికి జ‌న‌సేన పార్టీ దూరంగా ఉంటుంద‌న్నారు. ఎవ‌రి ద‌గ్గ‌రో డ‌బ్బు తీసుకుని నేను పోరాటం చేయ‌లేన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఎవ‌రికి వారు స్వ‌చ్చందంగా ఇచ్చే విరాళాల‌ని మాత్ర‌మే స్వీక‌రిస్తామ‌ని తెలిపారు. మీరు డ‌బ్బు ఇవ్వ‌లేక‌పోతే, త‌లా పిడికెడు ముద్ద పెట్టండి, దాన్తోనే ముంద‌డుగు వేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ఇబ్బంది ప‌డ‌రాద‌న్న ల‌క్ష్యంతోనే ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాన్ని పెట్టిన‌ట్టు తెలిపారు. త‌న‌ను సొంత‌వారు న‌మ్మారో లేదో తెలియ‌దు, అభిమానులు మాత్రం న‌మ్మారనీ., 11 ఏళ్లు స‌క్సెస్ లేక‌పోయినా త‌న‌పై న‌మ్మ‌కం ఉంచార‌ని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే విష‌యంలో తాను ఎవ‌రి మీదా అధార‌ప‌డ‌డం లేద‌ని, స్వ‌యంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కి వెళ్లి తెలుసుకుంటున్నాన‌న్నారు..                                                                                                                              Advertisement.

పార్టీ పెట్టి నాలుగేళ్లు గ‌డ‌చినా నిర్మాణం పూర్తి చేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలు తెలిపారు. అది చాలా క‌ష్ట సాధ్య‌మైన ప‌నన్నారు.. రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో దోపిడి చేసే ఎమ్మెల్యేలు, ఇబ్బందులు పెట్టే ఎమ్మెల్యేలు ఉంటార‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, వారిని ఎదుర్కోవాలంటే ఎవ‌ర్ని ప‌డితే వారిని పెడితే కుద‌ర‌ద‌న్నారు. నా బంధువుల్నో, కుటుంబ స‌భ్యుల్నో పెట్టి నిర్మాణం చేయ‌డం చాలా తేలికైన ప‌ని అని., కానీ మీ నుంచే నాయ‌కుల్ని త‌యారు చేయాల‌న్న‌దే జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌న్నారు. ఓ ఆటో డ్రైవ‌ర్ నాయ‌కుడు కావాల‌న్నారు. సామాన్యుడు రాజ్యాలు ఏలాల‌న్న‌దే జ‌న‌సేన ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. గెలుపు ల‌క్ష్యం కాదు. మార్పే ల‌క్ష్య‌మ‌ని, స‌మాజంలో మార్పు, చైత‌న్యం తీసుకురావాల‌ని తెలిపారు.. మిమ్మ‌ల్ని బెదిరిస్తే త‌గ్గి ఉండాల‌న్న జ‌న‌సేన అధినేత‌, మీకు జ‌న‌సేన అండ‌గా నిల‌బ‌డుతుంద‌ని తెలిపారు.. ఇక డీజిల్‌కి ప్ర‌త్యామ్నాయంగా, ఆ భారం ఆటో డ్రైవ‌ర్ల మీద ప‌డ‌కుండా బ్యాట‌రీ ఆటోలు తెచ్చే ఏర్పాటు జ‌న‌సేన చేస్తోంద‌న్నారు. అవ‌స‌రం అయితే గో గ్రీన్ ఆటోల‌కి స‌బ్సీడీ ఇచ్చే ఏర్పాటు చేద్దామ‌న్నారు. పోలీసులు, ట్రాన్స్‌పోర్టు అధికారుల‌తో స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే సామ‌ర‌స్యంగా వెళ్లాల‌న్నారు. అధికారుల‌తో ఎక్కువ‌గా గొడ‌వ‌లు ప‌డొద్ద‌ని సూచించారు. నిజంగా స‌మ‌స్య‌లు ఉంటే ముందుగా పోరాటం చేయాల‌ని, నేను వ‌స్తే త‌ప్ప తీర‌ని స‌మ‌స్య అయితే త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు. మొద‌టి విన‌తిప‌త్రం ఆటో డ్రైవ‌ర్ల నుంచి రావ‌డం ప‌ట్ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆనందం వ్య‌క్తం చేశారు. నేను అది చేస్తా ఇది చేస్తా అని ముందే హామీలు ఇవ్వ‌న‌ని, జ‌న‌సేన మేనిఫెస్టో క‌మిటీకి సంబంధించిన ప్ర‌తినిధుల్ని ఆటో డ్రైవ‌ర్ల వ‌ద్ద‌కి పంపి, ప‌రిష్కారంలో సాధ్యాసాధ్యాల్ని ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement.

Share This:

1,209 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + 3 =