Home / పవన్ టుడే / సాయంత్రం గ‌వ‌ర్న‌ర్‌తో జ‌న‌సేన అధినేత భేటీ.. తిత్లీ తుపాను న‌ష్టంపై నివేదిక‌..

సాయంత్రం గ‌వ‌ర్న‌ర్‌తో జ‌న‌సేన అధినేత భేటీ.. తిత్లీ తుపాను న‌ష్టంపై నివేదిక‌..

ప‌చ్చ పాల‌కుల మాదిరి నోరు మాటిస్తే.. చెయ్యి మాట విన‌ని ర‌కం కాదు.. తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో ఆరు రోజుల ప‌ర్య‌ట‌న.. 45 గ్రామాల సంద‌ర్శ‌న అనంత‌రం.. అక్క‌డ ప్ర‌జ‌లు ప‌డుతున్న అవ‌స్థ‌లు చూసిన‌ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. యుద్ధ‌ప్రాతిపధిక‌న వారికి న్యాయం చేసే అంశంపై చ‌ర్య‌లు ప్రారంభించారు.. ఇప్ప‌టికే ప‌లువురు కార్పొరేట్ ప్ర‌ముఖుల‌తో వ్య‌క్తిగ‌తంగా చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌, బాగా న‌ష్టం జ‌రిగిన గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ది ప‌రిచే అంశంపై మాట్లాడారు.. ఇప్ప‌టికే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జ‌న‌సేన అధినేత సూచ‌న మేర‌కు ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే..

ఇక ప్ర‌భుత్వం నుంచి స‌రైన ప‌రిహారం ర‌ప్పించే దిశ‌గా చ‌క‌చ‌కా అడుగులు వేస్తున్నారు.. ముఖ్యంగా కేంద్రం నుంచి స్పంద‌న రాక‌పోవ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌రిగిన న‌ష్ట‌న్ని బ‌య‌టికి చెప్ప‌క‌పోవ‌డం ప‌ట్ల జ‌న‌సేనాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. జ‌రిగిన న‌ష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళే విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న చెబుతున్నారు.. ముఖ్య‌మంత్రి, మంత్రులు రోడ్ల మీద ప‌ర్య‌టించి, అంతా బాగుంది అనే, అంతా చేసేశాం అంటూ అనుంగ మీడియాలో వార్త‌లు వేయించుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.. దీంతో పాటు వీరి ప‌ర్య‌ట‌నల వ‌ల్ల అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు త‌గురీతిలో అందించ‌లేక‌పోతున్నార‌న్న‌ది ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌.. అంతా సిఎం టూర్‌లో బీజీగా ఉండ‌డంతో క‌నీసం స‌రైన రీతిలో న‌ష్టం వివ‌రాలు న‌మోదు ప్ర‌క్రియ కూడా పూర్తి కాలేద‌ని చెబుతున్నారు..

దీంతో పాటు తుపాను ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేసే వ్య‌వ‌హారంలో గానీ, త‌ర్వాత స‌హాయ‌క చ‌ర్య‌ల విఫ‌యంలో గానీ స‌ర్కారు ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని జ‌న‌సేన అధినేత మండిప‌డుతున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా గ్రామాల‌కి క‌రెంటు రాక‌పోవ‌డాన్ని అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్న ప‌వ‌న్‌., న‌ష్టం పూర్తి వివ‌రాల‌తో పాటు తిత్లీ బాధిత ప్రాంతాల నుంచి తాజా గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్రం ప్ర‌భుత్వ ప్ర‌తినిధి అయిన గ‌వ‌ర్న‌ర్‌కి, కేంద్రానికి స‌మ‌ర్పించాల‌ని నిర్ణ‌యించారు.. సోమ‌వారం వ‌ర‌కు తిత్లీ బాధిత ప్రాంతాల్లో తిరిగిన జ‌న‌సేనాని, మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ వేదిక‌గా త‌న ప‌నిని మొద‌లు పెట్టేశారు.. పార్టీ నాయ‌కుల‌తో క‌ల‌సి సంబంధిత నివేదిక‌లు, లేఖ‌ల‌కి రూప‌క‌ల్ప‌న చేసి, సాయంత్రం రాజ్‌భ‌వ‌న్‌లో ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ని క‌ల‌వ‌నున్నారు.. పార్టీ ప్ర‌ముఖుల‌తో క‌ల‌సి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లుస్తారు.. ఈ ముర‌కు పార్టీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌య్యింది.. నొరు చెప్పిన దాన్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసే ఏకైక నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్ర‌మేన‌ని ఇప్పుడు స‌ర్వ‌త్ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. నిత్యం ప్ర‌జ‌ల‌కి ఏదో ఒక‌టి చేయాల‌న్న బ‌ల‌మైన దృక్ప‌ద‌మే అందుకు కార‌ణం..

Share This:

866 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + one =