Home / పవన్ టుడే / సాహితీ స్ర‌ష్ట సీ.నా.రేకు జ‌న‌సేనుడి ఘ‌న నివాళి..

సాహితీ స్ర‌ష్ట సీ.నా.రేకు జ‌న‌సేనుడి ఘ‌న నివాళి..

ఆయ‌న సాహిత్యం ప‌రిమ‌ళ సౌర‌భం., ఆయ‌న పాట తేట‌తెలుగు గీత‌.. అందుకే జ్ఞాన‌పీఠం సైతం ఆయ‌న‌కు స‌లాం అంది.. అందుకే వ‌ద్ద‌న్న కొద్దీ ప‌ద‌వులు, పుర‌స్కారాలు ఆయ‌న ఇంటి ఎదుట క్యూక‌ట్టాయి.. సాహితీ లోకం ముద్దుగా సీ.నా.రే అని పిలుచుకునే సి.నారాయ‌ణ‌రెడ్డి తెలుగు త‌ల్లి ముద్దుబిడ్డ ఆయ‌నే.. ఆ సాహితీ సౌర‌భం తెలుగు క‌ళామ‌త‌ల్లి ఒడిని వ‌ద‌లి దివికేగింది.. ఆ తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌, జ్ఞాన‌పీఠ్ అవార్డు గ్ర‌హీత సి.నారాయ‌ణ‌రెడ్డి మృతి ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.. సీ.నా.రే మర‌ణం తెలుగు జాతికే కాక‌., యావ‌త్ సాహితీ లోకానికీ తీర‌ని లోట‌ని జ‌న‌సేనుడు త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. తెలుగు సినిమా పాట‌ను కావ్య‌స్థాయికి తీసుకువెళ్లిన ఆ మ‌హానుభావుని స్థానం భ‌ర్తీ చేయ‌లేనిద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆయ‌న జీవితం గురించి సినీ పెద్ద‌ల ద్వారా., కొన్ని ర‌చ‌న‌ల ద్వారా తెలుసుకున్న‌ప్పుడు సి.నారాయ‌ణ‌రెడ్డి స‌దా ఆద‌ర్శ‌ప్రాయుడ‌ని భావించిన‌ట్టు తెలిపారు.. విశ్వంభ‌ర ర‌చ‌న ద్వారా జ్ఞాన‌పీఠ్ అవార్డు అందుకుని తెలుగు భాష ఖ్యాతిని సీ.నా.రే విశ్వ‌వాపితం చేశార‌ని కొనియాడారు..

ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌న్‌, క‌ళాప్ర‌పూర్ణ వంటి అనేక పుర‌స్కారాలు, రాజ్యాంగ ప‌ద‌వులు సి.నారాయ‌న‌రెడ్డిలోని విన‌మ్ర‌త‌ను మ‌రింత పెంచాయ‌ని ప‌వ‌న్ అన్నారు.. తండ్రి వ్య‌వ‌సాయం చేస్తే., సి.నా.రే సాహితీ వ్య‌వ‌సాయం చేసి., తెలుగు వారికి సాహిత్య ఫ‌లాలు అందించార‌ని తెలిపారు.. ఇంత‌టి సాహితీ స్ర‌ష్ట మ‌ర‌ణించార‌ని తెలిసి తీవ్ర అవేద‌న‌కు గురైన‌ట్టు చెప్పారు.. ఆయ‌న భౌతికంగా లేక‌పోయినా., ఆయ‌న వెద‌జ‌ల్లిన సాహితీ సౌర‌భాలు ., మ‌న మ‌ధ్య‌న చిరంత‌నంగా ప‌రిమ‌ళిస్తూనే ఉంటాయ‌న్నారు.. ఆయ‌న మృతికి త‌న త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుని ప్రార్ధిస్తున్న‌ట్టు జ‌న‌సేనుడు తెలిపారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

గెరుడౌ ఉక్కు క‌ర్మాగార మృతుల కుటుంబాల‌కి న్యాయం చేయాలి.. జ‌న‌సేనాని డిమాండ్‌..

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి స‌మీపంలోని గెరుడౌ ఉక్కు ప‌రిశ్ర‌మ‌లో విష‌వాయువులు వెలివ‌డి ఆరుగురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై జ‌న‌సేన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 20 =

%d bloggers like this: